పురోగతి యొక్క నూతన శిఖరాలకు మన దేశాన్ని తీసుకుపోగల, మన యువతే మనకు గర్వకారణం. మన యువకులకు ఏదైనా సమస్య ఎదురైనప్పుడు వారికి సహాయం చేయడమే మన ప్రధమ విధి.
పూణేకు చెందిన 7 ఏళ్ల వైశాలి, చాల పేద కుటుంబానికి చెందినది మరియు రెండు సంవత్సరాలకు పైగా గుండెలో రంధ్రంతో బాధపడుతుంది. అన్ని సంవత్సరాలు ఆ పాప ఎంత బాధ అనుభవించి ఉంటుందో ఊహించవచ్చు!
చిన్నారి వైశాలి, తన హృదయ సంబంధ సమస్య కోసం సహాయం కోరుతూ ప్రధానమంత్రికి లేఖ రాయడానికి నిర్ణయించుకునే సమయానికి, ప్రధానమంత్రి ఆమె లేఖకు జవాబు ఇవ్వడం మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా ఆ చిన్నారిని కలిసి ఆమెలో ఉత్సాహాన్ని నింపుతారని బహుషా ఆమెకు తెలియకపోయి ఉండవచ్చు.
వైశాలి యొక్క రెండు పేజీల లేఖలో, పోలీసు అధికారి కావాలన్న ఆమె కల నిజం అయ్యేలా తన సొంతకుమార్తెగా అనుకుని, సహాయం చేయాల్సిందిగా భారతదేశ ప్రధానికి ఒక భావోద్వేగ అభ్యర్ధన చేసింది.
ఆ లేఖను పరిగణనలోకి తీసుకొని, చిన్నారి వైశాలిని గుర్తించవలసినదిగా ప్రధాని అధికారులను కోరారు. అంతేకాకుండా, ఆమెకు సరైన వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితముగా చికిత్స అందించాల్సిందిగా ఆదేశించారు.
ఇది జరిగిన తర్వాత, వైశాలి ప్రధానికి హృదయాన్ని హత్తుకునే లేఖ వ్రాయడంతో పాటు, ఆమె వేసిన డ్రాయింగ్ కూడా జతచేసి పంపింది, దానికి ప్రధానమంత్రి కూడా బదులిచ్చారు.
అంతేకాకుండా, ప్రధానమంత్రి 25 జూన్ 2016 న పూణే సందర్శించినప్పుడు, ఆ చిన్నారి వైశాలిని మరియు ఆమె కుటుంబంను వ్యక్తిగతంగా కలుసుకున్నారు. ఈ సమావేశం, తన మదిలో ఎప్పటికీ జ్ఞాపకం ఉంటుందని శ్రీ మోదీ తెలిపారు.
చిన్నారి వైశాలి కధ కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. ప్రజలనుండి ఇలాంటి అనేక లేఖలు ప్రధానమంత్రి మరియు అతని కార్యాలయానికి అందుతున్నాయి. సమస్యలను పరిష్కరించడానికి మరియు భారతదేశ పౌరులు ఏ ఇబ్బంది ఎదుర్కొనకుండా ఉండడానికి కావలసిన అన్ని ప్రయత్నాలు చేయడం జరుగుతుంది.