అది 1995వ సంవత్సరం.  భారతీయ జనతా పార్టీ మొట్టమొదటి సారిగా గుజరాత్ శాసన సభ ఎన్నికలలో విజయం సాధించి స్వంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.  రెండు నెలల తరువాత రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల తేదీలను ప్రకటించారు. ఏర్పాట్లు పూర్తి స్థాయిలో జరుగుతుండగా శ్రీ మోదీ ఒక రోజు తనకు బాగా నమ్మకమైన, పార్టీ తో సంబంధం లేని మద్దతుదారులను పిలిచి, తాను విదేశీ పర్యటనలో తీసుకొన్న ఒక డిజిటల్ కెమెరా ను వారికి ఇచ్చారు.  అది వారు గతంలో చూడనిది. వారు చేయవలసిందల్లా తమ పార్టీ ప్రచార బృందాలతో కలిసి రాష్ట్రమంతటా పర్యటించి ప్రజలను, వారి హావ భావాలను, వారి దుస్తులు, వారి అలవాట్లు, బహిరంగ సభలకు హాజరు కావడాన్ని, వారు పని చేసే ప్రదేశంలో, టిఫిన్ సెంటర్ల వద్ద ఏమి భుజిస్తారు వంటివి దృశ్యబద్ధం చేయాలి; అంటే - గుజరాత్ స్వరూపాన్ని డిజిటల్ కెమెరా లో బంధించాలి.  భారతదేశం లోనే కాదు, పశ్చిమ భారతదేశంలోనే డిజిటల్ కెమెరా ప్రాచుర్యం కావడానికి చాలా ముందు రోజులలో ఈ ఘటన చోటు చేసుకొంది.

మొదటి నుండి కూడా శ్రీ మోదీ అలవాటు ఇదే.  ముందుగా వారి సామర్ధ్యాన్ని చూసిన  తరువాతే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, డిజిటల్ ఆవిష్కరణలను ఆయన అమలు చేస్తారు.  ఆయన వ్యక్తిగతమైన విషయాలలో మాత్రమే కాదు, పరిపాలనలోనూ ఇదే పద్దతిని అమలు చేస్తారు.  కేవలం రాజకీయ నాయకుల్లోనే కాదు, నిజానికి సమాజం మొత్తంలోనే సామాజిక మాధ్యమం యొక్క శక్తిని మొదటగా గుర్తించింది శ్రీ మోదీనే.  ఇది కేవలం ఒక వైపు నుండి ప్రసారం అయ్యే మాధ్యమం కాదని, ఇది ఈ సామాజిక మాధ్యమం  రెండు వైపుల నుండీ సమానంగా సమాచారం ఇచ్చి పుచ్చుకొనే డిజిటల్ మాధ్యమం అని ఆయన గుర్తించారు.  ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు  సామాజిక మాధ్యమాన్ని ఉపయోగించేవారిని ఎల్లపుడూ సిద్ధంగా ఉండే ప్రేక్షకులుగా భావించే వారు.  ఆయన ప్రధాన మంత్రిగా కాగానే తొలి చర్యగా MyGov ని 2014 జూలై నెలలోప్రారంభించి, ప్రజలతో సంస్థాగతమైన సంబంధాలను ఏర్పాటు చేసుకున్నారు.  ఒక ఏడాది అనంతరం ‘డిజిటల్ ఇండియా’ ను లాంఛనంగా ప్రారంభించారు.  ప్రతిస్పందన, పారదర్శకత, జవాబుదారుతనంతో అది ఒక ఆదర్శ పాలనకు కేంద్రబిందువు గా ముఖ్య పాత్ర పోషిస్తోంది.  2015 లో కేలిఫోర్నియాలోని సాన్ జోస్ లో ‘డిజిటల్ ఇండియా’ కార్యక్రమంలో శ్రీ మోదీ మాట్లాడుతూ “ఈ సామాజిక మాధ్యమం లేదా సేవ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందని మీరు భావిస్తున్నారో - అంత వేగంగా అది ఆశల అంచున ఎంతో కాలంగా నిలబడి ఉన్నవారి జీవితాలలో మార్పు తీసుకురావడానికి దోహదపడుతున్న విషయాన్ని - మీరు విశ్వసించాలి. అందువల్ల, ఈ దృఢమైన విశ్వాసం నుండి వచ్చిన  స్నేహితులు - డిజిటల్ ఇండియా పై అవగాహన కలిగి ఉంటారు.  భారతదేశ పరివర్తనకు ఇదొక ఉత్సాహభరితమైన వ్యాపకం. అయితే  మానవ చరిత్రలో ఇది సరికాక పోవచ్చు.  భారతదేశ పౌరుల్లో బలహీనంగా, దూరంగా, నిరుపేదలుగా ఉన్న వారి జీవితాలను మాత్రమే లక్ష్యంగా కాకుండా మొత్తం దేశ నడవడికను, జీవితాలను మార్చాలన్నదే దీని ఉద్దేశం” అని శ్రీ మోదీ తన తత్వాన్ని వివరించారు.