ఓ భావావేశంగల రచయిత, కవి, సంస్కృతీ ప్రేమికుడు.. శ్రీ నరేంద్ర మోదీ ని గురించి చెప్పాలంటే ఇవి మరి కొన్ని విశేషణాలు. తీరిక లేకుండా, అత్యంత కఠినమైనదైన కార్యక్రమ ప్రణాళికలో నిత్యం తలమునకలవుతున్నప్పటికీ తనకు ఉల్లాసం కలిగించే కొన్ని అంశాలకు ఆయన సమయం కేటాయిస్తారు. అటువంటి వాటిలో యోగా, రచనా వ్యాసంగం, సామాజిక మాధ్యమాల్లో ప్రజలతో అన్యోన్య భాషణం వంటివి కొన్ని. తన సభలలో ఎదురయ్యే అనుభవాలపై ఆయన ట్వీట్లను కొన్నింటిని మనం చూసే ఉంటాము. యువకుడుగా ఉన్నప్పటి నుండి కూడా ఆయన రాస్తూనే ఉన్నారు. నేటి 24 గంటల తాజా వార్తల (బ్రేకింగ్ న్యూస్!) యుగం మాటున శ్రీ నరేంద్ర మోదీ ని గురించి ఒక వాస్తవాన్ని ఈ విభాగం వివరిస్తుంది.
|
||
శ్రీ నరేంద్ర మోదీకి ఆత్మానుగతమైన అంశాలలో ఒకటైన యోగాపై అద్భుతమైన ఉపన్యాసం | ||
|
||
ఎమర్జెన్సీ చీకటి రోజుల నాటి గుజరాత్‌పై సంగ్రహంగా దృష్టి సారించండి.. సామాజిక సమానత్వంపై శ్రీ నరేంద్ర మోదీ దృష్టికోణం గురించి చదివి, భవిష్యత్తరాల కోసం హరిత భూగోళాన్నిమిగల్చాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన ఎందుకు భావిస్తున్నారో తెలుసుకోండి. | ||
|
||
మీకు తెలుసా? యువ నరేంద్ర మోదీకి తన దినచర్యను రాసుకునే అలవాటు ఉండేది. ఆ దినచర్య పుస్తకం (డైరీ)లోని పేజీలను 6-8 నెలలకు ఒకసారి కాల్చివేసే వారు. ఒక రోజు ఆయన ఆ పని చేస్తుండగా ఒక ప్రచారక్ చూసి, అలా చేయవద్దని వారించారు... ఆ కాగితాలే 36 ఏళ్ల శ్రీ నరేంద్ర మోదీ ఆలోచనల సంకలనం ‘‘సాక్షిభావ్’’గా రూపుదాల్చాయి. | ||
|
||
శ్రీ నరేంద్ర మోదీ కవితల సంకలనమిది. గుజరాతీ భాషలో రాసిన ఈ పద్యాలు ప్రకృతి మాత, దేశభక్తి ల వంటి ఇతివృత్తాల చుట్టూ పరిభ్రమిస్తుంటాయి. | ||
|
||
జనరంజక సంస్కృతిపై శ్రీ నరేంద్ర మోదీ విశ్వాసాన్ని వివరించే చిత్రమిది. ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటంలో చురుగ్గా పాల్గొన్న ఆయన భావనలలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అన్నది ఒక నిర్దేశం. దాన్ని ఆయన త్రికరణ శుద్ధిగా అనుసరిస్తారు. ప్రసిద్ధ కళాకారులతో ఆయన అన్యోన్య సంభాషణాన్ని మీరు ఆనందిస్తారు | ||
|
||
శ్రీ నరేంద్ర మోదీ రచించిన ఒక అందమైన పద్యం కళాకారుడు శ్రీ పార్థివ్ గోహిల్ గళం నుండి జాలువారుతున్న సన్నివేశమిది | ||
|
||
నవరాత్రిపై శ్రీ నరేంద్ర మోదీ రచించిన ఒక పద్యం |