ఓ భావావేశంగ‌ల ర‌చ‌యిత‌, క‌వి, సంస్కృతీ ప్రేమికుడు.. శ్రీ న‌రేంద్ర మోదీ ని గురించి చెప్పాలంటే ఇవి మ‌రి కొన్ని విశేషణాలు. తీరిక‌ లేకుండా, అత్యంత క‌ఠినమైనదైన కార్య‌క్ర‌మ ప్ర‌ణాళిక‌లో నిత్యం త‌ల‌మున‌క‌ల‌వుతున్నప్పటికీ త‌న‌కు ఉల్లాసం క‌లిగించే కొన్ని అంశాల‌కు ఆయ‌న స‌మ‌యం కేటాయిస్తారు. అటువంటి వాటిలో యోగా, ర‌చ‌నా వ్యాసంగం, సామాజిక మాధ్య‌మాల్లో ప్ర‌జ‌ల‌తో అన్యోన్య భాష‌ణం వంటివి కొన్ని. త‌న స‌భ‌ల‌లో ఎదుర‌య్యే అనుభ‌వాల‌పై ఆయ‌న ట్వీట్ల‌ను కొన్నింటిని మ‌నం చూసే ఉంటాము. యువ‌కుడుగా ఉన్న‌ప్ప‌టి నుండి కూడా ఆయ‌న రాస్తూనే ఉన్నారు. నేటి 24 గంట‌ల తాజా వార్త‌ల (బ్రేకింగ్ న్యూస్!) యుగం మాటున శ్రీ న‌రేంద్ర మోదీ ని గురించి ఒక వాస్త‌వాన్ని ఈ విభాగం వివ‌రిస్తుంది.

మానవాళికి భారతదేశం యోగాను బహూకరించింది. తద్వారా మనం ప్రపంచానికంతటికీ చేరువయ్యాము. రోగ విముక్తి మాత్రమే కాక భోగ విముక్తి కూడా యోగాతో సాధ్యమేనన్నది వాస్తవం
శ్రీ నరేంద్ర మోదీకి ఆత్మానుగతమైన అంశాలలో ఒకటైన యోగాపై అద్భుతమైన ఉపన్యాసం
 
ఆయన రచించిన పుస్తకాలు ఆయన ఉపన్యాసాల తరహాలోనే శక్తిమంతమైనవేగాక ఉద్బోధనాత్మకంగాను, జ్ఞానాత్మ‌కంగాను ఉంటాయి. శ్రీ నరేంద్ర మోదీ రాసిన ప్రతి పుస్తకం ఓ సమాచార నిధి.. తన జీవితంలో సంభవించిన సంఘటనలు, సుసంపన్న ఆలోచనల సమాహారం.
ఎమర్జెన్సీ చీకటి రోజుల నాటి గుజ‌రాత్‌పై సంగ్ర‌హంగా దృష్టి సారించండి.. సామాజిక సమానత్వంపై శ్రీ నరేంద్ర మోదీ దృష్టికోణం గురించి చదివి, భవిష్యత్తరాల కోసం హరిత భూగోళాన్నిమిగల్చాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన ఎందుకు భావిస్తున్నారో తెలుసుకోండి.
 
“నేను 36 ఏళ్ల వ‌య‌సులో ఉండ‌గా జ‌గ‌జ్జ‌న‌నితో సాగిన నా సంవాద‌మే సాక్షిభావ్‌... దీన్ని చ‌దివే వారు నాతో మ‌మేక‌మై, కేవ‌లం వార్తా ప‌త్రిక‌ల‌ ద్వారా కాకుండా నా మాట‌ల‌ ద్వారా నా గురించి తెలుసుకొంటారు.”
మీకు తెలుసా? యువ న‌రేంద్ర మోదీకి త‌న దిన‌చ‌ర్య‌ను రాసుకునే అల‌వాటు ఉండేది. ఆ దిన‌చ‌ర్య పుస్త‌కం (డైరీ)లోని పేజీల‌ను 6-8 నెల‌ల‌కు ఒక‌సారి కాల్చివేసే వారు. ఒక రోజు ఆయ‌న ఆ ప‌ని చేస్తుండ‌గా ఒక ప్ర‌చార‌క్ చూసి, అలా చేయ‌వ‌ద్ద‌ని వారించారు... ఆ కాగితాలే 36 ఏళ్ల శ్రీ న‌రేంద్ర మోదీ ఆలోచ‌న‌ల సంక‌ల‌నం ‘‘సాక్షిభావ్‌’’గా రూపుదాల్చాయి.
 
“గద్యంలో వివరించలేని దాన్ని తరచూ పద్యంలో వ్యక్తీకరించవచ్చు’’
శ్రీ న‌రేంద్ర మోదీ క‌విత‌ల సంక‌ల‌న‌మిది. గుజ‌రాతీ భాష‌లో రాసిన ఈ ప‌ద్యాలు ప్ర‌కృతి మాత‌, దేశ‌భ‌క్తి ల వంటి ఇతివృత్తాల చుట్టూ ప‌రిభ్ర‌మిస్తుంటాయి.
 
“కళలు, సంగీతం, సాహిత్యం రాజ్యంపై ఆధారపడినవి అయ్య ఉండకూడదు. వాటిపై ఎటువంటి పరిమితులను విధించ‌రాదు. ప్రభుత్వాలు అటువంటి ప్ర‌తిభ‌ను గుర్తించి ప్రాచుర్యం క‌ల్పించాలి.’’
జనరంజక సంస్కృతిపై శ్రీ నరేంద్ర మోదీ విశ్వాసాన్ని వివరించే చిత్రమిది. ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటంలో చురుగ్గా పాల్గొన్న ఆయన భావనలలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అన్నది ఒక నిర్దేశం. దాన్ని ఆయన త్రికరణ శుద్ధిగా అనుసరిస్తారు. ప్రసిద్ధ కళాకారులతో ఆయన అన్యోన్య సంభాషణాన్ని మీరు ఆనందిస్తారు
శరదృతు హృదయం నుంచే వసంత రుతువు ఆవిర్భవిస్తుంది!

శ్రీ నరేంద్ర మోదీ రచించిన ఒక అందమైన పద్యం కళాకారుడు శ్రీ పార్థివ్ గోహిల్ గళం నుండి జాలువారుతున్న సన్నివేశమిది
 
ఒక అందమైన పద్యంతో నవరాత్రి వేడుకల వర్ణ శోభను, చైతన్యాన్ని వేడుక చేసుకొంటున్న దృశ్యమిది
నవరాత్రిపై శ్రీ నరేంద్ర మోదీ రచించిన ఒక పద్యం