శ్రీ నరేంద్ర మోదీ ఎన్నటికీ ఎందుకు అలసిపోనే పోరు ? . ఒకటి తరువాత ఒకటిగా ఎన్నో పనులతో కూడిన కార్యక్రమ పట్టిక వారాల తరబడి ఆయన కోసం ఎదురుచూస్తూ ఉంటున్నప్పటికీ ప్రతి సారీ ఒక యంత్రం మాదిరిగా ఒకే రకం నాణ్యతతో ఆయన చేసుకుంటూ పోవడం వెనుక ఆయన శక్తికి ఉన్న మూలం ఏమిటి ? ప్రధాన మంత్రి ని గట్టిగా సమర్ధించే వారితో పాటు, ఆయనను తీవ్రంగా విమర్శనాత్మకంగా విశ్లేషించే వారు కూడా తరచుగా అడిగే ప్రశ్న ఇది.
మొట్టమొదటి టౌన్ హాల్ సమావేశం లోనూ, ఇటీవలి టెలివిజన్ కార్యక్రమం లో న్యూ ఢిల్లీ లోని ఒక మీడియా సంస్థా ఆయనను ముఖంమీద ఇదే ప్రశ్నను అడగడం జరిగింది. దీనికి శ్రీ నరేంద్ర మోదీ ఇచ్చిన సమాధానం ఆయన వ్యక్తిగత దృష్టికోణంలో నుండి చూస్తే చాలా ఆచరణాత్మకంగా ఉన్నప్పటికీ అందులో ఎంతో వేదాంత ధోరణి కూడా ఇమిడి ఉంది. కష్టపడి పనిచేయడం వల్ల ఎప్పుడూ అలసిపోరు. ఇంకా ఎంత పని మిగిలిపోయింది - లేదా - ఎంత పని పెండింగు లో ఉంది అనే విషయమై ఆలోచించడం వల్ల ఎక్కువగా అలసిపోతారు. శ్రీ రాహుల్ జోషి కి ఇచ్చిన ఒక ఇంటర్ వ్యూలో శ్రీ నరేంద్రమోదీ చెప్పిన మాటలలోనే చెప్పాలంటే.. “నిజానికి పనిచేయకపోవడం వల్ల మనం అలసిపోతాము. అంతేకాదు, పని చేయడం వల్ల మనకు సంతృప్తి లభిస్తుంది. సంతృప్తి శక్తినిస్తుంది. ఇదే పరిస్థితిని నేను అనుభవించాను. అందుకే నేను నా యువ మిత్రులకు ఎల్లప్పుడూ ఈ విషయం చెబుతాను. అలసిపోవడం అనేది కేవలం మానసికమైంది. ఒక పని పరిమాణాన్ని బట్టి కావలసిన సామర్ధ్యాన్ని ప్రతి వ్యక్తీ కలిగి ఉంటారు. కొత్త సవాళ్ళను స్వీకరిస్తూ ఉండాలి. నీ అంతశ్శక్తి నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది.”
ఆయన మంత్రం సాదాది అయినప్పటికీ, అది ఎంతో గంభీరమైంది కూడాను. అదేమిటంటే.. నీ పనిని నీవు ఆనందిస్తున్నట్లు అయితే, ఎప్పటికీ అలసట పొందినట్లు నువ్వు అనుకోవు. ఎందుకంటే, నీవు చేస్తున్న పనిని ఆనందిస్తూ చేస్తూపోతుంటావు కాబట్టి.!