ఇది అడగటం సహజం- భారతదేశ ప్రధానమంత్రి ఏమి తినడానికి ఇష్టపడతారు? ఆయన ఆహారంను కోరతారా?

దీని యొక్క అంతర్దృష్టిని నరేంద్ర మోదీ ఇచ్చారు, ఆయన ఏమ్మన్నారంటే:

"ప్రజా జీవితంలో పనిచేస్తున్న వారి జీవితాలు సక్రమంగా ఉండవు. కాబట్టి, ఒకరు ప్రజా జీవితంలో చురుకుగా ఉండాలనుకొంటే, కఠినమైన కడుపు కలిగి ఉండాలి.

35 సంవత్సరాలుగా, వివిధ వ్యవస్థాపక హోదాల్లో పని చేయడంవల్ల, దేశం నలుమూలల ప్రయాణం చేయాల్సి వచ్చింది, ఆహార అడగాల్సి వచ్చింది మరియు ఇచ్చింది తినాల్సివచ్చింది. నాకు ఏదైనా ప్రత్యేకం చేయమని ప్రజలను ఎప్పుడూ కోరలేదు.

నాకు ఖిచడి చాలా ఇష్టం. కానీ, నాకు వడ్డించింది ఏదైనా తింటాను.”

“దేశానికి భారంగా ఉండే ఆరోగ్యంగా, నా ఆరోగ్యం ఉండకుడదని కోరుకుంటాను. తుదిశ్వాస వరకు నేను ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాను.” అని కూడా అన్నారు.

ప్రధానమంత్రి హోదాలో చాలా ప్రయాణాలు మరియు విందులలో హాజరు అనివార్యం. ఆయన ప్రతీ విందులో ఆయా ప్రాంతాల స్థానిక శాఖాహార వంటకాలను ఆస్వాదిస్తారు. టీటోట్లర్ కావడంతో, ఆయన గ్లాసులో ఎప్పుడూ మద్య పానీయంకు బదులు ఖచ్చితంగా నీరు లేదా పళ్ళరసం ఉంటుంది.