Women have shown how a positive change has begun in rural India. They are bringing about a qualitative change: PM
Guided by the mantra of Beti Bachao, Beti Padhao, the Government is trying to bring about a positive change: PM
Boys and girls, both should get equal access to education: PM Narendra Modi
Swachhata has to become our Svabhaav. The poor gains the most when we achieve cleanliness and eliminate dirt: PM

ప్రధాన మంత్రి శ్రీ‌ నరేంద్ర మోదీ ఈ రోజు గాంధీనగర్ లో జరిగిన “స్వచ్ఛ శక్తి 2017 – మహిళా సర్పంచ్ ల సమావేశం”లో ప్రసంగించారు.


పరిశుభ్రమైన భారత దేశాన్ని ఆవిష్కరించే దిశగా సాగుతున్న ఉద్యమానికి విస్తృత‌ స్థాయిలో సహకారాన్ని అందించిన సర్పంచ్ లను సత్కరించే సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటైనట్లు ఆయన చెప్పారు. రాజకీయ స్వేచ్ఛ కన్నా పరిశుభ్రత మరింత ముఖ్యమైనటువంటిది అని చాటి చెప్పిన గాంధీ మహాత్ముని 150వ జయంతిని మనం 2019వ సంవత్సరంలో జరుపుకోనున్నామని ప్రధాన మంత్రి గుర్తు చేశారు..

పరిశుభ్రత దిశగా ఆరంభించిన ఈ ప్రస్థానాన్ని కొనసాగించవలసిందిగా సమావేశానికి తరలివచ్చిన వారికి ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేశారు. స్వచ్ఛతను మనం ఒక అలవాటుగా మార్చుకోవాలని ఆయన స్పష్టం చేశారు. దుమ్ము, ధూళిని పారదోలి పరిశుభ్రతకు మనం పెద్ద పీట వేసిననాడు దాని ద్వారా పేద ప్రజలు అత్యంత ప్రయోజనం పొందుతారని ఆయన అన్నారు.


ఈ రోజు సత్కారం పొందుతున్న మహిళలు అనేక అపోహలను పటాపంచలు చేశారని, వారు గ్రామీణ భారత దేశంలో ఒక సకారాత్మకమైన పరివర్తన అనేది ఏ విధంగా ఆరంభమైందో ఆచరణాత్మకంగా నిరూపించారని ప్రధాన మంత్రి అన్నారు.

మహిళా సర్పంచ్ లు ఒక గుణాత్మకమైన మార్పును తీసుకురావాలని కోరుకుంటున్నారని, వారిలో ఒక సకారాత్మకమైన మార్పును తీసుకురావడానికి అవసరమైన దృఢ సంకల్పాన్ని వారితో భేటీ అయినప్పుడు తాను గమనించానని శ్రీ నరేంద్ర మోదీ చెప్పారు.

‘భేటి బచావో – భేటీ పడావో’ కార్యక్రమాన్ని గురించి ఆయన ప్రస్తావిస్తూ, మహిళా సర్పంచులు ఉన్న గ్రామాలు ఆడ పిల్లలను పిండ దశలోనే అంతమొందించడానికి స్వస్తి పలికే ఉద్యమంలో ఒక కీలక పాత్రను పోషించగలుగుతారని పేర్కొన్నారు..

వివక్షా పూరితమైన ఆలోచనా సరళిని ఆమోదించజాలమని, బాలురు, బాలికలు విద్యార్జనకు సమాన అవకాశాలను పొంది తీరాలని ప్రధాన మంత్రి అన్నారు..

సాంకేతిక విజ్ఞానాన్ని గురించి ఆయన మాట్లాడుతూ, మన పల్లెలలో గొప్ప మార్పును తీసుకురాగల శక్తి దీనికి ఉందని చెప్పారు.

పురస్కార విజేతలను ప్రధాన మంత్రి అభినందిస్తూ, వారు యావత్ భారతదేశానికే ప్రేరణను అందిస్తున్నారని అన్నారు.

 

 

Click here to read full text speech