There will be detailed discussion on the Budget and I am sure the level of debate and discussion will be of good quality: PM
Matters that will benefit the poor will be discussed during this session: PM Modi

మిత్రులారా మీకు ఇదే నా స్వాగతం,

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల విరామం తరువాత మళ్లీ మనమంతా కలుసుకుంటున్నాం. బడ్జెట్ పై సవివరమైన చర్చ జరుగుతుందని, మంచి, నాణ్యమైన చర్చ తప్పక చోటుచేసుకుంటుందని నమ్ముతున్నాను. ఆ చర్చలు పేద ప్రజల సంక్షేమానికి సంబంధించిన అంశాలు కేంద్ర బిందువుగా సాగే అవకాశం ఉంది. జిఎస్ టి విషయంలో పురోగతి సాధ్యపడుతుందని మేం ఆశిస్తున్నాం. అన్ని రాష్ట్రాలు సకారాత్మకమైన పద్ధతిలో సహకరించడమే మా ఆశావాదానికి మూలం. అన్ని రాజకీయ పక్షాలు చాలా సానుకూలంగా మెలగి, వాటి ప్రతిస్పందనలో సహకార వైఖరిని చాటాయి. కొన్ని నిర్ణయాల పైన ప్రజాస్వామ్య పద్ధతిలో సమగ్రమైన చర్చను చేపట్టిన అనంతరం ఏకాభిప్రాయాన్ని సాధించి ఈ దిశలో ముందుకు సాగగలిగాం. ఈ సమావేశాలలో జిఎస్ టి ని సభ ముందుకు తీసుకువచ్చే విధంగా చూడడం కోసం అన్ని వర్గాల సహకారాన్ని కూడగట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మీ అందరికీ మరోసారి నేను బహుధా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.