వ. సం.

ఒడంబడిక/అవగాహన ఒప్పందం పేరు

వివరాలు

1.

సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంపై గణతంత్ర భారతదేశ గణతంత్రం మరియు యుఎఇ మధ్య ఒప్పందం

ఆగస్టు 2015, ఫిబ్రవరి 2016 ల నాటి ఉన్నత స్థాయి సంయుక్త ప్రకటనలలో అంగీకరించిన మేరకు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం కింద ద్వైపాక్షిక సహకారంపై గుర్తించిన అంశాలకు ప్రాధాన్యమిస్తూ వాటిని ఒక చట్రంలో ఇమిడ్చేదే ఈ సాధారణ ఒడంబడిక.

2..

రక్షణ పరిశ్రమల రంగంలో సహకారంపై భారతదేశ గణతంత్రం, యుఎఇ ప్రభుత్వ రక్షణ శాఖల మధ్య అవగాహనపూర్వక ఒప్పందం (ఎంఒయు)

రక్షణ రంగ తయారీ, సాంకేతిక పరిజ్ఞానాల్లో గుర్తించిన క్షేత్రాలలో సహకారమే దీని ఉద్దేశం. రెండు దేశాల ప్రభుత్వ, ప్రైవేటు రక్షణ రంగ సంస్థల మధ్య అధ్యయనం, పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణ, సహకారం ఇందులో భాగంగా ఉంటాయి. ఆయుధ సామగ్రి, రక్షణ పరిశ్రమలతోపాటు సాంకేతికత బదిలీపై ఉభయ పక్షాలు సహకరించుకుంటాయి.

3.

సముద్ర రవాణాలో వ్యవస్థాగత సహకారంపై భారతదేశ గణతంత్రం, యుఎఇ ప్రభుత్వాల మధ్య అవగాహనపూర్వక ఒప్పందం(ఎంఒయు)

ద్వైపాక్షిక సముద్ర వాణిజ్య సంబంధాల వృద్ధికి ఈ ఎమ్ఒయు ఒక చట్రాన్ని ఏర్పరుస్తుంది. సముద్ర రవాణా సదుపాయం, రెండు దేశాల ఒప్పంద భాగస్వాముల మధ్య స్వేచ్ఛగా నగదు బదిలీ, నౌకా పత్రాల గుర్తింపుపై పరస్పర ప్రతిస్పందన ఇందులో అంతర్భాగంగా ఉంటాయి.

4.

భారతదేశ గణతంత్ర నౌకారవాణా డైరెక్టరేట్ జనరల్ యుఎఇ సమాఖ్య ఉపరితల-సముద్ర రవాణా ప్రాధికార సంస్థల మధ్య శిక్షణ ప్రమాణాలు, అర్హతపత్రాలు, నిఘా సదస్సు (STCW78) తీర్మానాలు, సవరణలకు అనుగుణంగా ప్రమాణీకృత పత్రాల పరస్పర గుర్తింపుపై అవగాహనపూర్వక ఒప్పందం

సముద్ర వాణిజ్య కార్యకలాపాలను మరింత విస్తృతం చేసేందుకు ఉద్దేశించిన ఎమ్ఒయు. సముద్ర రవాణాలో పాల్గొనే అధికారులు, ఇంజినీర్లు, సిబ్బందికి చెందిన ప్రమాణీకృత పత్రాల పరస్పర గుర్తింపునకు ఒక చట్రాన్ని ఏర్పరుస్తుంది.

5.

భారత రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ, యుఎఇ సమాఖ్య ఉపరితల-సముద్ర రవాణా ప్రాధికార సంస్థల మధ్య రోడ్డు రవాణా, రహదారుల రంగంలో ద్వైపాక్షిక సహకారంపై అవగాహనపూర్వక ఒప్పందం

రోడ్డు రవాణా, రహదారుల రంగంలో ద్వైపాక్షిక సహకారమే ఈ ఎమ్ఒయు ఉద్దేశం. సాంకేతికత, వ్యవస్థలు సరుకు రవాణా, గిడ్డంగుల నిల్వలో ఉత్తమ పద్ధతులు. విలువ ఆధారిత సేవల భాగస్వామ్యం ఇందులో అంతర్భాగం.

6.

మానవ అక్రమ రవాణ నిరోధం-పోరులో సహకారంపై భారత-యుఎఇ ప్రభుత్వాల మధ్య అవగాహనపూర్వక ఒప్పందం

మానవ అక్రమ రవాణా నిరోధం, ప్రత్యేకించి మహిళలు, పిల్లల సత్వర రక్షణ, రికవరీ, తిప్పి పంపడాలకు సంబంధించి ద్వైపాక్షిక సహకార విస్తృతి ఈ ఒప్పందం ముఖ్యోద్దేశం.

7.

చిన్న, మధ్యతరహా సంస్థల (ఎస్ఎమ్ఇల)రంగంలో సహకారం, ఆవిష్కరణల్లో సహకారంపై భారత ఆర్థిక మంత్రిత్వశాఖ-యుఎఇ ప్రభుత్వం.. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎమ్ఒఎస్ఎమ్ఎస్ఎమ్ఇ)మంత్రిత్వ శాఖల మధ్య ఎమ్ఒయు  

సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగంలో సంయుక్త ప్రాజెక్టులు, పరిశోధన-అభివృద్ధి కార్యకలాపాలలో సహకారానికి ప్రోత్సాహం ఈ ఎమ్ఒయు ఉద్దేశం.

8.

వ్యవసాయ, అనుబంధ రంగాలలో సహకారంపై భారతదేశ వ్యవసాయ-రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, యుఎఇ వాతావరణ మార్పు-పర్యావరణ మంత్రిత్వ శాఖల మధ్య ఎమ్ఒయు

వివిధ వ్యవసాయ, ఆహార తయారీ, ఆధునిక సాగు పద్ధతుల సాంకేతికత బదిలీలో పరస్పర ఆసక్తి గల అంశాలపై సహకార చట్రం అభివృద్ధి ఈ ఎమ్ఒయు ఉద్దేశం.

9.

దౌత్య, ప్రత్యేక, అధికార పాస్‌పోర్టులు గలవారికి ప్రవేశ వీసాల పరస్పర మినహాయింపుపై భారతదేశ గణతంత్రం- యుఎఇ ప్రభుత్వాల మధ్య ఎమ్ఒయు.

దౌత్య, ప్రత్యేక, అధికార పాస్‌పోర్టులు గల వారు రెండు దేశాల మధ్య స్వేచ్ఛగా ప్రయాణించేందుకు ఈ అవగాహన ఒప్పందం వీలు కల్పిస్తుంది.

10.

కార్యక్రమాల ఆదానప్రదాన సహకారానికి భారత ప్రభుత్వ ప్రసారభారతి విభాగం, యుఎఇలోని ఎమిరేట్స్ న్యూస్ ఏజెన్సీ (WAM)ల మధ్య ఎమ్ఒయు.

ప్రసారాలు, కార్యక్రమాల పరస్పర మార్పిడి, వార్తలు, ఉత్తమ పద్ధతులలో ప్రసారభారతి, ఎమిరేట్స్ న్యూస్ ఏజెన్సీ (WAM)ల మధ్య సహకారం ద్వారా సంబంధాల బలోపేతమే ఈ ఒప్పందం ముఖ్యోద్దేశం.

11.

వాణిజ్య పరిష్కరాల్లో పరస్పర అసక్తిగల అంశాలపై సహకారానికి ప్రోత్సాహం కోసం భారతదేశ గణతంత్ర వాణిజ్య-పరిశ్రల మంత్రిత్వశాఖ, యుఎఇ ఆర్థిక మంత్రిత్వ శాఖల మధ్య ఎమ్ఒయు.

విచ్చలవిడి నిల్వ, సుంకాల అంశంలో సహకార విస్తృతి ఈ ఒప్పందం ఉద్దేశం. పరస్పరం గుర్తించిన అంశాలలో వాణిజ్య పరిష్కార సంబంధిత సమాచార మార్పిడి, సామర్థ్య నిర్మాణం, సదస్సులు-శిక్షణ ఇందులో భాగంగా ఉంటాయి.

12.

చమురు నిల్వ, నిర్వహణపై భారత వ్యూహాత్మక పెట్రోలు నిల్వల సంస్థ, అబు ధాబీ జాతీయ చమురు సంస్థల మధ్య ఎమ్ఒయు

భారత దేశంలో అబు ధాబి జాతీయ చమురు సంస్థ ముడి చమురు నిల్వ-నిర్వహణకు చట్రం రూపకల్పనతో పాటు ఇంధన రంగంలో రెండు దేశాల మధ్య వ్యూహాత్మక బంధం బలోపేతం చేయడమే ఈ ఒప్పందం ఉద్దేశం.

13.

భారత జాతీయ ఉత్పాదకత మండలి, అల్ ఎతిహాద్ ఇంధన సేవల సంస్థ ఎల్ఎల్ సి మధ్య ఎమ్ఒయు

ఇంధన సామర్థ్య సేవలలో సహకారమే ఈ ఒప్పందం ముఖ్యోద్దేశం.

14.

భారత జాతీయ భద్రత మండలి సచివాలయం, యుఎఇ జాతీయ ఎలక్ట్రానిక్ భద్రత ప్రాధికార సంస్థ మధ్య ఎమ్ఒయు.

సైబర్ ప్రపంచంలో సాంకేతికత అభివృద్ధి, సహకారమే ఈ ఒప్పందం ఉద్దేశం.