PM condoles the loss of lives in Afghanistan due to avalanches

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ హిమపాతం కారణంగా అఫ్గానిస్తాన్ లో ప్రాణ నష్టం వాటిల్లడం పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు.

“మంచు చరియలు విరిగిపడ్డ కారణంగా అఫ్గానిస్తాన్ లో ప్రాణ నష్టం వాటిల్లడం పట్ల నేను ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. సాధ్యమైనంత మేరకు ఏ విధమైన సహాయం చేయడానికైనా భారతదేశం సంసిద్ధంగా ఉంది” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.