ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు శ్రీ డోనాల్డ్ ట్రంప్ ను యునైటెడ్ స్టేట్స్ అధ్యక్ష పదవికి ఎన్నికైనందుకు అభినందనలు తెలిపారు.

“శ్రీ డోనాల్డ్ ట్రంప్ యు ఎస్ కు 45వ అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు మీకు అభినందనలు.

మీరు ఎన్నికల ప్రచారంలో భారతదేశం పట్ల వ్యక్తం చేసిన స్నేహ భావనను మేము అభినందిస్తున్నాము.

భారతదేశం- యుఎస్ ద్వైపాక్షిక సంబంధాలను ఒక కొత్త శిఖరానికి తీసుకువెళ్లేందుకు మీతో కలసి సన్నిహితంగా పనిచేయడం కోసం మేము ఎదురుచూస్తున్నాము” అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.