ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఏషియన్ చాంపియన్స్ ట్రోఫీ ని గెల్చుకొన్న భారతీయ హాకీ జట్టును అభినందించారు.

“మన హాకీ జట్టు ను చూస్తే ఎంతో గర్వంగా ఉంది. ఏషియన్ చాంపియన్స్ ట్రోఫీ ని గెల్చుకొన్న సందర్భంగా జట్టుకు ఇవే నా అభినందనలు” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.