ఆప్తులను కోల్పోయిన కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా మంజూరు
ఉత్తరప్రదేశ్‌లోని చందౌలీ, వారణాసి ల మధ్య ఉన్న రాజ్‌ఘాట్ బ్రిడ్జి వద్ద 15-10-2016న తొక్కిసలాట జరిగి కొందరు ప్రాణాలు కోల్పోవడం, పలువురు గాయాలబారిన పడడంపై ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు.
“వారణాసిలో జరిగిన తొక్కిసలాటలో ప్రాణనష్టం సంభవించడం తీవ్ర విచారం మిగిల్చింది. ఆప్తులను కోల్పోయిన కుటుంబసభ్యులకు ఇదే నా సంతాపం. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను.
నేను అధికారులతో మాట్లాడి, వారణాసిలో జరిగిన ఈ ఘటన వల్ల బాధితులైన వారికి అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందజేయవలసిందని సూచించాను” అని ప్రధాన మంత్రి అన్నారు.
ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 2లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ. 50,000 ఎక్స్‌గ్రేషియాను ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి నుండి ప్రధాన మంత్రి మంజూరు చేశారు.
Deeply saddened by the loss of lives in the stampede in Varanasi. Condolences to the bereaved families. Prayers with those injured.
— Narendra Modi (@narendramodi) October 15, 2016
I have spoken to officials & asked them to ensure all possible help to those affected due to the stampede in Varanasi.
— Narendra Modi (@narendramodi) October 15, 2016