PM Modi lauds the passing of Rights of Persons with Disabilities Bill – 2016
Passage of Rights of Persons with Disabilities Bill -2016 is a landmark moment: PM Modi
Passage of Disabilities Bill -2016 will add tremendous strength to ‘Accessible India movement’: PM

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ దివ్యాంగుల హక్కుల బిల్లు – 2016 కు పార్లమెంట్ ఆమోదం తెలపడాన్ని ప్రశంసించారు. ఇది ఒక మహత్తర సంఘటన అని, యాక్సెసిబుల్ ఇండియా మూవ్ మెంట్ కు బ్రహ్మాండమైన శక్తిని జతచేయగలదని ప్రధాన మంత్రి అన్నారు.

“దివ్యాంగుల హక్కుల బిల్లు – 2016 కు ఆమోదం లభించడం ఒక మహత్తర సంఘటన, ఇది యాక్సెసిబుల్ ఇండియా మూవ్ మెంట్ కు బ్రహ్మాండమైన శక్తిని సంతరించగలుగుతుంది.

ఈ చట్టంలో భాగంగా, వికలత్వాల రకాలు పెరిగాయి. అదే సమయంలో అదనపు ప్రయోజనాలకు సంబంధించిన నిబంధనలను కూడా ప్రవేశపెట్టడం జరిగింది.

దివ్యాంగుల పట్ల నేరాలకు పాల్పడితే, కొత్త చట్టంలోని నిబంధనలను అతిక్రమిస్తే నిష్కర్ష అయిన నిబంధనలు వర్తిస్తాయి.

అవకాశాలను, సమానత్వాన్ని మరియు అందుబాటును మరింత ఎక్కువ చేసే పలు ప్రధాన విశేషతలు కొత్త చట్టంలో ఉన్నాయి. వాటిని గురించి ఇక్కడ చూడండి.. https://goo.gl/Zwpm4k” అంటూ ప్రధాన మంత్రి పేర్కొన్నారు.