First responsibility of the government must be to work for poor, marginalized & underprivileged but sadly, SP isn’t doing so: Shri Modi
PM attacks SP government, says schools in UP do not have teachers in adequate number
Our Government is committed to welfare of farmers in UP, says Shri Narendra Modi
SP, BSP, Congress favouring each other in some way or the other in these elections, alleges PM Modi
For Uttar Pradesh's growth & development, BJP is the only ray of hope, says Prime Minister Modi

ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఉత్తర ప్రదేశ్ లోని కనౌజ్ భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. ఉత్తరప్రదేశ్ ప్రజలలో విపరీతమైన ఉత్సాహం ఉందని అది గాలి ఎటువైపు వీస్తుందో స్పష్టమైన సూచన అని శ్రీ మోదీ తెలిపారు.

ఒకేసారి 104 ఉపగ్రహాలను ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తలను శ్రీ మోదీ అభినందించారు. శాస్త్రవేత్తలు మొత్తం దేశాన్ని గర్వపడేలా చేశారని ఆయన అన్నారు.

పేదలు, అట్టడుగు మరియు అణగారిన వర్గాలకోసం పనిచేయడమే తమ ప్రభుత్వం యొక్క మొదటి బాధ్యత అని ప్రధాని అన్నారు. " పేదలకు ఆహారం అందించడానికి మా ప్రభుత్వం వనరులను కేటాయిస్తుంది కాని పేదలకు ఆహారం అందించడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏమాత్రం ఏ చురుకుదనం చూపించడం లేదు." అని ప్రధాని చెప్పారు. "యుపిలో ప్రభుత్వం పేదల సాధికారత వ్యతిరేకంగా ఉండడం విచారకరమని" కూడా అన్నారు.

 యుపిలోని దీన విద్యా వ్యవస్థ పట్ల ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు, యుపిలో పాఠశాలలు తగిన సంఖ్యలో ఉపాధ్యాయులు లేదు. “యుపిలోని పాఠశాలలలో తగిన సంఖ్యలో ఉపాధ్యాయులు లేరు. ఇలావుంటే భారతదేశం యొక్క పేదలకు సాధికారత ఎలా వస్తుంది?" అని ప్రధాని పేర్కొన్నాడు.

తన ప్రభుత్వానికి  రైతుల సంక్షేమం ముఖ్యం అని ప్రధాని మోదీ నొక్కిచెప్పారు. “ యుపిలోని రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. తమను అధికారంలోకి తీసుకుని వస్తే, తమ ప్రభుత్వం చిన్నకారు రైతుల రుణాలను మాఫీ చేస్తుందని చెప్పారు.

ప్రధాని ప్రతిపక్షాలపై దాడి చేసి," ఈ ఎన్నికల్లో ఎస్పి, బిఎస్పి, కాంగ్రెస్ పార్టీలు ఏదోఒకరకంగా ఒకరికొకరు మేలు చేసుకుంటున్నారు. ఒకప్పుడు,  వారు ఒకరినొకరు నిందించుకునే వారు కాని ఇప్పుటి పరిస్థితులు చూడండి. వారు ఒకరికి వ్యతిరేకంగా ఇంకొకరు ప్రకటనలు ఇవ్వడానికి కూడా ప్రతిఘటిస్తున్నారు.” అని, "ఉత్తర ప్రదేశ్ యొక్క వృద్ధి మరియు అభివృద్ధి కి బిజెపి మాత్రమే ఆశాకిరణం” అని కూడా అన్నారు.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ పై కూడా శ్రీ మోదీ దాడి చేసి, 1984లో ములాయం సింగ్ జీ పై కాంగ్రెస్ దాడిని అఖిలేష్ జి  గుర్తుచేసుకున్నారా? నేడు మీరు వారితోనే పొత్తుపెట్టుకుంటారా! అధికారం నిలుపుకోవడానికి ఎస్పి ఏదైనా చేస్తుంది అనడానికి ఇది ఒక నిదర్శనం" అని అన్నారు.

రాష్ట్రంలో నేరాలు మరియు అవినీతికి పెరిగేందుకు మాత్రమే  ఎస్పీ ప్రభుత్వం సహాయపడిందని ఆయన ఆరోపించారు. “ ఉత్తరప్రదేశ్ లో అరచకాలు, ఉపాధికోసం యువత వలసలు, అవినీతి, అల్లర్లు, పేదరికం, అధిక మరణాల రేటు, పాఠశాల మానేసిన పిల్లలు మాత్రమే పైకి ఉన్నాయని” ఆయన అన్నారు

గ్రేడ్ 3 మరియు 4 ఉద్యోగాలలో అవినీతిని అరికట్టేందుకే తమ  ప్రభుత్వం ఇంటర్వ్యూలను లేకుండా చేసిందని ప్రధాని మోదీ అన్నారు. “గతంలో గ్రేడ్ 3 మరియు 4 ఉద్యోగాలకు లంచాలు తీసుకునేవారు. అందుకే ఇంటర్వ్యూలో ప్రక్రియలు దూరం చేశాము. ఇది అవినీతిని అరికట్టగలిగింది. 125 కోట్ల భారతీయుల దీవెనలు వల్లే నల్లధనం, అవినీతికి వ్యతిరేకంగా నేను పోరాడగల్గుతున్నానని “ కూడా ఆయన అన్నారు.

అనేకమంది పార్టీ కార్యకర్తలు మరియు నాయకులూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

పూర్తి ప్రసంగం చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి