Prime Minister Modi lays foundation Stone of AIIMS at Bathinda, Punjab
Social infrastructure is essential for the development of every nation: Prime Minister
NDA Government does not only stop at laying foundation stones but completes all projects on time: PM
PM Modi urges people to use technology for making payments or purchasing things

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంజాబ్ లోని భటిండాలో అఖిల భారత వైద్య శాస్త్రాల సంస్థ (ఎ ఐ ఐ ఎమ్ ఎస్)కు నేడు పునాది రాయి వేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటైన సభను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, ప్రతి దేశం అభివృద్ధి చెందాలంటే సామాజిక, మౌలిక వసతులు ఎంతైనా అవసరమని, కాబట్టి మనకు అగ్ర శ్రేణి పాఠశాలలు మరియు ఆసుపత్రులు ఉండి తీరాలని చెప్పారు. భటిండాలో ఏర్పాటయ్యే ఎ ఐ ఐ ఎమ్ ఎస్ స్థానిక ప్రాంతాలకు లబ్ధిని చేకూర్చగలదని ఆయన అన్నారు. ఈ కేంద్ర ప్రభుత్వం పునాది రాళ్ళు వేయడంతోనే ఆగిపోదని, ఆయా పథకాలు పూర్తి అయ్యేటట్లు శ్రద్ధ తీసుకొంటుందని స్పష్టం చేశారు. పథకాలను సకాలంలో పూర్తి చేయడం మాకు ప్రాధాన్య అంశమని ఆయన అన్నారు.

భారతీయ సేనల సామర్థం ఎటువంటిదో పాకిస్తాన్ ఇప్పుడిక పూర్తిగా తెలుసుకొన్నదని ప్రధాన మంత్రి అన్నారు. అవినీతితోను, నకిలీ నోట్లతోను పోరాడవలసిందిగా పాకిస్తాన్ ప్రజలు వారి పాలకులకు చెప్పాలి అని ఆయన పిలుపునిచ్చారు.

రైతులకు చాలినంత నీటిని ఇవ్వడం కోసం కేంద్ర ప్రభుత్వం శాయశక్తులా కృషి చేస్తుందని ప్రధాన మంత్రి అన్నారు. భారతదేశానికి చెందిన జలాలను పాకిస్తాన్ కు ప్రవహించనీయబోమని ఆయన చెప్పారు.

 

 

 

 

 

 

 

 

 

Click here to read full text speech