PM Modi lays foundation of the New Green Field International Airport & Electronic City in Goa
PM Modi appreciates the State of Goa, for its progress
PM lauds Manohar Parrikar for taking Goa to new heights of progress: PM
With the new airport the impetus to tourism will be immense: PM
A digitally trained, modern and youth driven Goa is being shaped today. This has the power to transform India: PM
We took a key step to help the honest citizen of India defeat the menace of black money: PM
I was not born to sit on a chair of high office. Whatever I had, my family, my home...I left it for the nation: PM
Yes I also feel the pain. These steps taken were not a display of arrogance. I have seen poverty & understand people's problems: PM

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు గోవాలోని శ్యాంప్ర‌సాద్ ముఖ‌ర్జీ స్టేడియమ్ లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొని, మోపా విమానాశ్ర‌యం, తువాంలో ఎలక్ట్రానిక్ సిటీల‌కు సంబంధించిన శిలాఫ‌ల‌కాల‌ను ఆవిష్క‌రించారు.

ప్రధాన మంత్రి నౌక‌ల విధ్వంసం కోసం అమ‌ర్చే స‌ముద్ర మందుపాత‌ర‌ల‌ను కొనుగొని, ధ్వంసం చేసే నౌక‌ల (మైన్ కౌంట‌ర్‌ మెజ‌ర్ వెసల్స్‌) నిర్మాణానికి ఉద్దేశించిన మౌలిక స‌దుపాయాల‌కు సంబంధించిన శిలాఫ‌ల‌కాల‌ను కూడా ఆవిష్క‌రించారు; అలాగే, అయిదు కోస్తా తీర‌ రక్షక ద‌ళ ఆఫ్ షోర్ పట్రోల్ వెసల్స్ నిర్మాణ పనులను ప్రారంభించారు.

ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన‌ మంత్రి మాట్లాడుతూ, కొద్ది వారాల కింద‌ట గోవాలో బిఆర్ ఐ సిఎస్ (బ్రిక్స్) శిఖ‌రాగ్ర స‌మావేశానికి భారతదేశం విజ‌య‌వంతంగా ఆతిథేయిగా వ్యవహరించ‌డంలో తోడ్ప‌డిన బృందానికి తొలుత‌ అభినంద‌న‌లు తెలిపారు. అలాగే గోవా సాధించిన పురోగతికి గాను గోవా రాష్ట్రాన్ని ప్రధాన మంత్రి అభినందించారు.

ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన‌ మంత్రి మాట్లాడుతూ, కొద్ది వారాల కింద‌ట గోవాలో బిఆర్ ఐ సిఎస్ (బ్రిక్స్) శిఖ‌రాగ్ర స‌మావేశానికి భారతదేశం విజ‌య‌వంతంగా ఆతిథేయిగా వ్యవహరించ‌డంలో తోడ్ప‌డిన బృందానికి తొలుత‌ అభినంద‌న‌లు తెలిపారు. అలాగే గోవా సాధించిన పురోగతికి గాను గోవా రాష్ట్రాన్ని ప్రధాన మంత్రి అభినందించారు.

విమానాశ్ర‌య ప్రాజెక్టు ను గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, దీని నిర్మాణంపై పూర్వ ప్ర‌ధాని శ్రీ అట‌ల్ బిహారీ వాజ్‌పేయి ఇచ్చిన వాగ్దానాన్ని నెర‌వేర్చ‌డంపై హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఈ ప్రాజెక్టు గోవాకు ప్ర‌యోజ‌నం క‌ల్పించ‌డంతోపాటు ప‌ర్యాట‌కానికి ఊతంగా నిలుస్తుంద‌న్నారు.

ఎలక్ట్రానిక్ సిటీ ప్రాజెక్టును గురించి ప్ర‌స్తావిస్తూ, ఇవాళ డిజిట‌ల్ శిక్ష‌ణ పొందిన ఆధునికమైన, యువ‌తీయువకులతో ముందుకు సాగుతున్న గోవా రూపురేఖ‌లు సంత‌రించుకుంటోంద‌ని, దీనికి దేశాన్ని ప‌రివ‌ర్త‌న దిశ‌గా ప‌య‌నింప‌జేయ‌గ‌ల శ‌క్తి ఉంద‌న్నారు.

500, 1,000 రూపాయ‌ల నోట్ల‌ చెలామణిని ర‌ద్దు చేస్తూ కేంద్ర ప్ర‌భుత్వం ఇటీవ‌ల తీసుకున్న నిర్ణ‌యాన్ని గురించి ప్ర‌ధాన‌ మంత్రి ప్ర‌స్తావిస్తూ, న‌వంబ‌రు 8వ తేదీన దేశంలో అనేక‌ మంది ప్ర‌జ‌లు ప్ర‌శాంతంగా నిద్ర‌పోయార‌ని, కొద్దిమంది మాత్రం ఇప్ప‌టికీ నిద్ర‌లేని రాత్రులు గడుపుతున్నార‌న్నారు. నిజాయ‌తీపరులైన పౌరుల‌కు సహాయపడడానికి, న‌ల్ల‌ధ‌నం పీడ‌ను వ‌దిలించ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం కీల‌కమైన చ‌ర్య‌ను చేపట్టిందనట్లు ఆయ‌న చెప్పారు. పెద్ద నోట్ల చెలామణి ర‌ద్దు క‌స‌రత్తు విజ‌య‌వంతం కావ‌డానికి త‌మ‌ వంతుగా సహాయప‌డుతున్న వారంద‌రికీ ప్ర‌ధాన‌ మంత్రి కృతజ్ఞ‌త‌లు తెలిపారు. తాను కూడా బాధను అనుభవిస్తున్నానని, ఈ చర్యలు అహంకార ప్రదర్శన కాద‌న్నారు. తాను పేద‌రిక‌ం అంటే ఏమిటో చూశాన‌ని, ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను అర్థం చేసుకోగ‌ల‌న‌ని పేర్కొన్నారు.

2014లో ప్ర‌జ‌లు దేశాన్ని అవినీతి నుండి విముక్తం చేయ‌డం కోసమే తీర్పు ఇచ్చార‌ని ఆయన గుర్తుచేశారు. న‌ల్ల‌ధ‌నానికి కళ్లెం వేసేందుకు కేంద్ర ప్ర‌భుత్వం వివిధ చర్యలు చేపట్టిందని కూడా ఆయ‌న వివ‌రించారు.