PM Modi presents Ramnath Goenka Journalism Awards
The colonial rulers were scared of those who wrote and expressed themselves through the newspapers: PM

పత్రికారచనలో శ్రేష్ఠతకు ఇచ్చే రామ్ నాథ్ గోయంకా అవార్డులను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విజేతలకు ఈ రోజు ప్రదానం చేశారు.

ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, స్వాతంత్ర్య సమర కాలంలో వార్తాపత్రికలు అభిప్రాయ వ్యక్తీకరణకొక బలమైన మాధ్యమంగా మారాయన్నారు. పత్రికల ద్వారా అభిప్రాయాలను వ్యక్తీకరించే వారంటే వలస పాలకులు భయపడేవారు అని ఆయన చెప్పారు.

అత్యవసర పరిస్థితిని ప్రసార మాధ్యమాలలో అతి కొద్ది మంది ఎదురించారని, వారికి రామ్ నాథ్ గారు నాయకత్వం వహించారంటూ కీర్తిశేషుడు శ్రీ రామ్ నాథ్ గోయంకా ను ప్రధాన మంత్రి ప్రశంసించారు.

సాంకేతిక విజ్ఞానం ప్రసార మాధ్యమాలకు సవాలును విసరుతోందని ప్రధాన మంత్రి చెబుతూ, ఇదివరకు వార్తలను వ్యాప్తి చేసేందుకు 24 గంటలు పడితే ఇప్పుడు 24 క్షణాలలో వార్తలు వ్యాప్తి చెందుతున్నాయన్నారు.

 

Click here to read full text speech