PM Modi today attends the golden jubilee celebrations of Haryana state
PM Modi launches various developmental schemes in Gurugra, Haryana
People of Haryana have given their lives for the nation by serving in the armed forces: PM
The daughters of Haryana have made India very proud on multiple occasions: PM
Let us think about making Haryana ODF in this golden jubilee year: PM
 

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు గురుగ్రామ్‌లో ఏర్పాటైన హ‌రియాణా స్వ‌ర్ణ‌ జ‌యంతి ఉత్స‌వాల ప్రారంభ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు.

ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, హరియాణా స్థాపన నాటి కాలాన్ని, రాష్ట్రం ఏ లక్ష్యాల కోసం ఏర్పడిందో ఆ లక్ష్యాలను స్ఫురణకు తెచ్చుకోవలసిన రోజు ఈ రోజు అన్నారు.

హరియాణా సాపేక్షంగా చిన్న రాష్ట్ర‌మే కానీ, అనేక రంగాలలో ఈ రాష్ట్రం తన వంతు తోడ్పాటును అందించింది అని ప్ర‌ధాన మంత్రి చెప్పారు. హ‌రియాణాలో ఒక్క రైతులు మాత్రమే ఉంటారని ని అంద‌రూ అనుకుంటారు గానీ, ఈ రాష్ట్రానికి చెందిన వ్యాపార‌వేత్త‌లు ఆదర్శప్రాయ విజ‌యాలను అందుకొన్నార‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

సాయుధ బలగాలలో సేవలు అందిస్తూ దేశం కోసం హరియాణా వాసులు వారి ప్రాణాలను త్యాగం చేశారు అని ప్రధాన మంత్రి చెప్పారు.

ఇంతటి ప్రముఖమైన రాష్ట్రంలో ఆడపిల్ల గ‌ర్భంలో ఉండగానే వారిని వదుల్చుకొనే విష‌ సంస్కృతి ఉండరాదని శ్రీ నరేంద్ర మోదీ స్పష్టంచేశారు. ఇప్పుడు భ్రూణ హ‌త్య‌ల నివార‌ణ‌కు హ‌రియాణా ప్రభుత్వం కృషి చేస్తోంద‌ని ఆయన చెప్పారు. ఆడ పిల్ల ను కాపాడుతానంటూ హరియాణాలో ప్రతి ఒక్క పౌరుడు ప్ర‌తిజ్ఞ చేయాల‌ంటూ ప్రధాన మంత్రి ఈ సంద‌ర్భంగా విజ్ఞ‌ప్తి చేశారు.

హరియాణా ప్రజలు ఈ స్వ‌ర్ణోత్స‌వాల సంద‌ర్భంగా యావత్తు రాష్ట్రాన్ని బ‌హిరంగ మ‌ల మూత్ర విస‌ర్జ‌నకు తావు లేనిదిగా మలచడాన్ని గురించి ఆలోచించాల‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

పరివర్తన ప్రక్రియ మొద‌ట పల్లెలలో ఆరంభం కావాల‌ని, ఇదే జ‌రిగితే హ‌రియాణాలో అభివృద్ధికి మ‌రింత ఊతం అందుతుందని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

 

 

Click here to read full text speech