PRAGATI: PM Modi reviews progress towards handling and resolution of grievances related to income tax administration
PRAGATI: PM Modi reviews progress towards implementation of the Pradhan Mantri Khanij Kshetra Kalyan Yojana
PRAGATI: PM Modi reviews the progress of vital infrastructure projects in the road, railway and power sectors

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నేడు ఐసిటి ఆధారిత మల్టి మోడల్ ప్లాట్ ఫామ్ ఫర్ ప్రొ-యాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్ లీ ఇంప్లిమెంటేషన్.. పిఆర్ఎజిఎటిఐ (ప్రగతి) మాధ్యమం ద్వారా జరిగిన పదిహేనో ముఖాముఖి సమావేశానికి అధ్యక్షత వహించారు.

ఆదాయపు పన్ను పరిపాలనకు సంబంధించిన ఇబ్బందులను స్వీకరించే మరియు వాటిని పరిష్కరించే దిశగా సాగుతున్న పురోగతిని ప్రధాన మంత్రి సమీక్షించారు. పన్ను చెల్లింపుదారులు వ్యక్తం చేస్తున్న ఇబ్బందులు పెద్ద సంఖ్యలో ఉంటుండడం పట్ల ఆందోళనను వెలిబుచ్చిన ప్రధాన మంత్రి, వాటిని పరిష్కరించడం కోసం ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని చెప్పారు. సమస్యలు సత్వరమే పరిష్కారమయ్యేలా చూసేందుకు సాంకేతిక విజ్ఞానాన్ని గరిష్ఠ స్థాయిలో వినియోగించుకోవాలని సంబంధిత అధికారులను ఆయన కోరారు.

ప్రధాన మంత్రి ఖనిజ్ క్షేత్ర కల్యాణ్ యోజన అమలులోని పురోగతిని ప్రధాన మంత్రి సమీక్షించారు. ఖనిజ సంపద సమృద్ధంగా ఉన్న 12 రాష్ట్రాలు ఇంతవరకు రూ.3,214 కోట్ల సొమ్మును వసూలు చేశాయని, ముందు ముందు మరింత పెద్ద మొత్తం వసూలు అయ్యే అవకాశాలు ఉన్నాయని గమనించారు. నిధుల వినియోగానికి ఒకే రీతిలో ఉండే ప్రక్రియలు మరియు విధానాలను రూపొందించేందుకు సంబంధిత అధికారులు కసరత్తు చేయాలని, దీని వల్ల ఖనిజాలు దండిగా ఉన్న జిల్లాలలో ఆదివాసీలు సహా వెనుకబడిన సముదాయాల వారికి ప్రయోజనం కలగాలని ఆయన విజ్ఞప్తి చేశారు.