PM Modi calls for collective effort to completely eliminate the ‘treatable disease’ of leprosy from India
Mahatma Gandhi had an enduring concern for people afflicted with leprosy: PM
Effort to eliminate leprosy from this country under the National Leprosy Eradication Programme is a tribute to Mahatma Gandhi’s vision: PM

చికిత్సకు వీలు ఉన్న కుష్టురోగాన్ని భారతదేశం నుండి సంపూర్ణంగా నిర్మూలించేందుకు సమష్టి ప్రయత్నాలు అవసరమని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ పిలుపునిచ్చారు.

కుష్టురోగ నిరోధక దినం సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇచ్చిన ఒక సందేశంలో- మనమందరం కలిసి చికిత్స పొందిన వ్యక్తుల సాంఘిక, ఆర్థిక అభ్యున్నతి తో పాటు దేశ నిర్మాణంలో వారి వంతు కృషిని జత చేసే దిశగా పాటుపడాల్సివుందని స్పష్టంచేశారు. గాంధీ మహాత్ముడు కలగన్న విధంగా- మన దేశానికి చెందిన ఈ పౌరులు గౌరప్రదమైన జీవనం సాగించేటట్లు చూడటం కోసం- మనం కఠోర పరిశ్రమ చేయాలని ప్రధాన మంత్రి శ్రీ మోదీ చెప్పారు.

కుష్టు రోగంతో బాధపడుతున్న వారి విషయంలో గాంధీ మహాత్ముడు తీవ్రంగా పరితపించేవారని ప్రధాన మంత్రి శ్రీ మోదీ జ్ఞ‌ప్తికి తెచ్చుకొన్నారు. వారికి రోగం నయం కావాలనేది మాత్రమే ఆయన ఆశయం కాదని, వారిని మన సంఘం అనే ప్రధాన స్రవంతిలోకి తీసుకురావాలనేది కూడా ఆయన ఆశయమేనని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వివరించారు.

జాతీయ కుష్టురోగ నిర్మూలన కార్యక్రమంలో భాగంగా కుష్టురోగాన్ని ఈ దేశంలో నుండి తొలగించివేసేందుకు జరుగుతున్న కృషి గాంధీ మహాత్ముని విజన్ ను సాకారం చేయడం కోసం అర్పిస్తున్న నివాళి అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఎప్పుడో 1955 వ సంవత్సరంలోనే మొదలుపెట్టడం జరిగిందని గుర్తు చేశారు. ప్రజారోగ్య సమస్య అయినటువంటి కుష్టురోగ నిర్మూలన లక్ష్యాన్ని అంటే.. ప్రతి 10,000 మంది జనాభాలోనూ ఈ రోగం ఉనికి రేటు 1 శాతం కన్నా తక్కువకు పరిమితం చేయటాన్ని.. 2005 లో సాధించడమైందని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు. తదనంతరం కేసులను కనిపెట్టే రేటు కొంత తగ్గినప్పటికీ, రోగ నిదానం వేళ వైకల్యం గోచరం కావడం పెరిగిందని ఆయన అన్నారు. ఒక దేశంగా మనం ఆఖరి మైలును సమీపించడంలో ఏ ప్రయాసనూ దాచిపెట్టుకోకూడదని, అంతే కాకుండా ఈ రోగంతో ముడిపడివున్న సాంఘిక అపనిందను నివారించడానికి కూడా కలిసికట్టుగా కృషిచేయాలని ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ చెప్పారు.

సముదాయాలలో కుష్టురోగాన్ని తొలిదశలోనే కనిపెట్టటం కోసం, ప్రత్యేకించి చేరుకోవడం కష్టసాధ్యమైన ప్రాంతాలలో దీని ఆచూకీ తీయటానికి- జాతీయ ఆరోగ్య ఉద్యమంలో భాగంగా 2016వ సంవత్సరంలో మూడు విధాలైన వ్యూహాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్రస్తావించారు. 2016వ సంవత్సరంలో ఒక ప్రత్యేక లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్ ను నిర్వహించినట్లు తెలిపారు. తత్ఫలితంగా, 32000 కు పైగా కేసులు రూఢి అయ్యాయని, వారందరికీ చికిత్స ఇస్తున్నారన్నారు. దీనికి తోడు, రోగులతో సన్నిహితంగా ఉంటూ సేవలు చేసే వారు రోగం బారిన పడే అవకాశాలను కుదించడానికిగాను వారికి సైతం మందులు ఇస్తున్నారని ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ వివరించారు.