ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ ఉదయం జమ్ము & కశ్మీర్ లోని ఉరీ లో జరిగిన ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించారు.
“ఉరీ లో జరిగిన పిరికిపంద తరహా ఉగ్రవాది దాడిని మేం తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ హేయమైన దాడి వెనుక ఉన్న వారు శిక్ష నుండి తప్పించుకోలేరు అని నేను దేశానికి హామీని ఇస్తున్నాను.
ఉరీ లో మృతవీరులందరికీ మేము నమస్కరిస్తున్నాము. దేశానికి వారు చేసిన సేవను ఎప్పటికీ స్మరించుకోవడం జరుగుతుంది. సన్నిహితులను కోల్పోయిన కుటుంబాల దు:ఖంలో నేను పాలుపంచుకొంటున్నాను.
పరిస్థితిని గురించి హోం మంత్రితోను, రక్షణ మంత్రి తోను నేను మాట్లాడాను. రక్షణ మంత్రి పరిస్థితిని పరిశీలించడం కోసం స్వయంగా జమ్ము & కశ్మీర్ కు వెళ్లనున్నారు ” అని ప్రధాన మంత్రి తమ సందేశంలో పేర్కొన్నారు.
We strongly condemn the cowardly terror attack in Uri. I assure the nation that those behind this despicable attack will not go unpunished.
— Narendra Modi (@narendramodi) September 18, 2016
We salute all those martyred in Uri. Their service to the nation will always be remembered. My thoughts are with the bereaved families.
— Narendra Modi (@narendramodi) September 18, 2016
Have spoken to HM & RM on the situation. RM will go to J&K himself to take stock of the situation.
— Narendra Modi (@narendramodi) September 18, 2016