India's friendship will stand with Myanmar in full support and solidarity: PM Modi
India has a robust development cooperation programme with Myanmar: Prime Minister
MOU on Cooperation in Power Sector will help create the framework for advancing India-Myanmar linkages in the sector: PM Modi
As close and friendly neighbours, the security interests of India and Myanmar are closely aligned: Prime Minister Modi
India-Myanmar enjoy a cultural connect that is centuries old: PM Modi

శ్రేష్ఠురాలైన స్టేట్ కౌన్స్ లర్,
ప్ర‌తినిధివర్గాల విశిష్ట స‌భ్యుల‌ు,
ప్రసార మాధ్యమాల సభ్యులారా,

సాద‌ర స్వాగ‌తం. భారతదేశానికి తొలిసారి ఆధికారిక ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన శ్రేష్ఠురాలు డా ఆంగ్ సాన్ సూ చీ కి స్వాగ‌తం ప‌ల‌ుకుతుండడం నిజానికి నాకు ఎంతో ఆనందాన్ని కలగజేసింది. ఎక్స్ లెన్సీ, మీరు భార‌తదేశ ప్రజలకు అప‌రిచిత వ్యక్తి ఏమీ కారు. ఢిల్లీ ప‌ద‌నిస‌లు, ఇక్క‌డి పరిసరాలు మీకూ సుప‌రిచిత‌ం. ఎక్స్ లెన్సీ, మీ రెండో ఇంటికి మీకు ఇదే పున:స్వాగ‌తం. ఎక్స్ లెన్సీ, మీరు దిగ్గజ నాయకురాలు.

మీ స్ప‌ష్ట‌మైన విజన్, ప‌రిణ‌తి చెందిన నాయ‌క‌త్వం, ప‌ట్టు వీడ‌ని సంఘ‌ర్ష‌ణ‌.. అంతిమంగా మ‌య‌న్మార్‌లో ప్ర‌జాస్వామ్య జెండారెప‌రెప‌లాడించిన విధం ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌జ‌లందరిలోనూ స్ఫూర్తి నింపింది. భార‌తదేశంలో మీకు ఆతిథ్య‌ం ఇవ్వ‌డం ఎంతో గౌర‌వంగా భావిస్తున్నాము. అలాగే కొద్దిరోజుల కింద‌ట గోవాలో జ‌రిగిన బిమ్స్ టెక్‌, బ్రిక్స్‌- బిమ్స్ టెక్‌ స‌ద‌స్సులో మీ భాగ‌స్వామ్యం కూడా ఎంతో ఆనంద‌దాయ‌కం.

ఎక్స్ లెన్సీ,

మీ స‌మ‌ర్థ సార‌థ్యంలో మ‌య‌న్మార్ స‌రికొత్త ప్ర‌యాణాన్ని ఆరంభించింది. ఇది ఆశ‌, ఆశ‌యాల ప్ర‌యాణం. 

మీ ప్ర‌గ‌తిశీలత‌, ప్రాచుర్యం దేశాన్ని అభివృద్ధి ప‌థంలో న‌డిపిస్తున్నాయి. వ్య‌వ‌సాయం, మౌలిక‌ స‌దుపాయాలు, ప‌రిశ్ర‌మ‌లు, విద్యాభివృద్ధి, యువ‌త‌కు నైపుణ్యాభివృద్ధి, ప‌రిపాల‌న‌లో కొత్త వ్య‌వ‌స్థ‌ల రూప‌క‌ల్ప‌న‌, ద‌క్షిణాసియా, ఆగ్నేయాసియాల‌తో బ‌ల‌మైన బంధం, ప్ర‌జ‌ల‌కు ర‌క్ష‌ణ‌...లు మీ సార‌థ్యంలో ముందుకు సాగుతున్నాయి. మ‌రింత అధునాత‌నమైన, సుర‌క్షిత‌మైన, ఆర్థికంగా శ్రేయోదాయక‌మైన దేశంగా మ‌య‌న్మార్‌ను తీర్చిదిద్దుతున్న మీ ప్ర‌య‌త్నంలో భార‌తదేశం త‌న స్నేహ‌హ‌స్తాన్ని స‌దా అందిస్తూనే ఉంటుంది.

మిత్రులారా,

భార‌తదేశం, మ‌య‌న్మార్‌ ల భాగ‌స్వామ్యంపై స్టేట్ కౌన్స్ ల‌ర్ (సూ చీ), నేను ఇప్పుడే విస్తృత‌ స్థాయిలో ఫ‌ల‌వంత‌మైన చ‌ర్చ‌లు ముగించాం. మ‌య‌న్మార్ అభివృద్ధిలో భార‌తదేశం గ‌ణ‌నీయ‌మైన స‌హ‌కారాన్ని అందిస్తుంది. క‌లద‌న్‌, ట్రైలేట‌ర‌ల్ హైవే లాంటి మెగా క‌నెక్టివిటీ ప్రాజెక్టుల‌తో మొద‌లుపెడితే, మానవ వ‌న‌రుల అభివృద్ధి, ఆరోగ్య‌ సంర‌క్ష‌ణ‌, సామ‌ర్థ్య బ‌లోపేతం శిక్ష‌ణ‌లలో భార‌తదేశం త‌న అనుభ‌వాల‌ను పంచుకొంటోంది; అండ‌గా నిలుస్తోంది. సుమారు 1.75 బిలియ‌న్ యు ఎస్ డాల‌ర్‌ల మేరకు భారతదేశం సమకూర్చిన అభివృద్ధి సహాయం ప్ర‌జ‌ల కోసం ఉద్దేశించిందే. తాజాగా వ్య‌వ‌సాయం, పున‌రుత్పాద‌క ఇంధ‌న వ‌న‌రులు, విద్యుత్‌ రంగాల్లో భాగ‌స్వామ్యాన్ని పెంచుకోవాల‌ని ఇవాళ్లి చ‌ర్చ‌లలో నిర్ణ‌యానికి వ‌చ్చాం. నాణ్య‌మైన విత్త‌నాల కోసం మయ‌న్మార్‌లోని యెజిన్‌లో విత్త‌నోత్ప‌త్తి కేంద్రాన్ని భార‌తదేశం ఏర్పాటు చేస్తుంది. ప‌ప్పు దినుసుల వాణిజ్యానికి సంబంధించి కూడా క‌ల‌సి ప‌నిచేస్తాం. మ‌ణిపూర్‌లోని మోరె నుండి మయాన్మార్‌ లోని త‌ము దాకా విద్యుత్ స‌ర‌ఫ‌రాను రెట్టింపు చేస్తాం. మ‌య‌న్మార్ ప్ర‌భుత్వం కోరుకున్న చోట ఎల్ఇడి బల్బుల ప్రాజెక్టును కూడా చేప‌డ‌తాం. విద్యుత్తు రంగంలో ఇప్పుడు కుదిరిన అవ‌గాహ‌నపూర్వక ఒప్పందం కీల‌కమైన ఈ రంగంలో మ‌రింత స‌హ‌కారం అందించ‌డానికి అవ‌స‌ర‌మైన కార్యాచ‌ర‌ణ‌ను రూపొందిస్తుంది.

మిత్రులారా,

సన్నిహిత ఇరుగుపొరుగు దేశాలుగా భార‌తదేశం, మయ‌న్మార్ ల భ‌ద్ర‌తాంశాలు ఒక‌దానితో మరొక‌టి ముడిప‌డి ఉన్నాయి. స‌రిహ‌ద్దుల్లో మ‌రింత స‌న్నిహిత‌మైన స‌మ‌న్వ‌యం ఉభయ దేశాల‌కూ, వ్యూహాత్మ‌క ప్ర‌యోజ‌నాల‌కూ అవ‌స‌ర‌మ‌ని అంగీక‌రించాం. మ‌న ఇరు దేశాల సాంస్కృతిక బంధం శ‌తాబ్దాల నాటిది. ఇటీవ‌లి భూకంపంలో దెబ్బ‌తిన్న ప‌గోడాల‌ను పున‌రుద్ధ‌రించ‌డంలో సహాయం చేశాం. బోధ్‌గ‌య‌లో మిన్‌డాన్‌, బేగ్యిదా రాజుల శాస‌నాల‌ను, రెండు పురాత‌న‌మైన దేవాల‌యాల‌ను పున‌రుద్ధ‌రించే ప‌నిని ఆర్కియాలజికల్ స‌ర్వే ఆఫ్ ఇండియా త్వ‌ర‌లోనే మొద‌లుపెడుతుంది.

ఎక్స్ లెన్సీ,

మ‌య‌న్మార్‌ను శాంతి, ఆర్థికాభివృద్ధి, సామాజికాభివృద్ధి దిశ‌గా న‌డిపిస్తున్న మీ సార‌థ్యాన్ని, ప‌ట్టుద‌ల‌ను మ‌రోమారు ప్ర‌శంసిస్తున్నాను. న‌మ్మ‌క‌మైన భాగ‌స్వామిగా, మిత్ర‌దేశంగా మీతో భుజం భుజం క‌లిపి న‌డుస్తాం. మీకూ, మయ‌న్మార్ ప్ర‌జ‌ల‌కూ శుభం చేకూరాల‌ని ఆశిస్తున్నాను.

మీకు ఇవే నా ధ‌న్య‌వాదాలు. మరీ మరీ కృత‌జ్ఞ‌త‌లు.