PM Modi jointly inaugurate The ET Asian Business Leaders’ Conclave 2016 with Malaysian PM, Najib Razak
Under the leadership of Prime Minister Najib, Malaysia is moving towards its goal of achieving developed country status by 2020: PM
Close relations with Malaysia are integral to the success of our Act East Policy: PM
The 21st Century is the Century of Asia: PM
India is currently witnessing an economic transformation: PM
We have now become the 6th largest manufacturing country in the world: PM
We are now moving towards a digital and cashless economy: PM
India is currently buzzing with entrepreneurial activity like never before: PM
Our economic process is being geared towards activities which are vital for generating employment or self-employment opportunities: PM
India is not only a good destination. It’s always a good decision to be in India: PM

మాన్య మ‌లేషియా ప్ర‌ధాని, శ్రేష్ఠులు శ్రీ మొహ‌మ్మ‌ద్ న‌జీబ్‌,

ది ఎక‌నామిక్ టైమ్స్ మేనేజ్ మెంట్ స‌భ్యులు,

వ్యాపార రంగ ప్రముఖులు,

లేడీస్ అండ్ జెంటిల్ మెన్‌..

మాననీయ మ‌లేషియా ప్ర‌ధాని, నేను క‌లిసి ది ఎక‌న‌మిక్ టైమ్స్ ఏషియ‌న్ బిజినెస్ లీడ‌ర్స్ స‌మావేశం- 2016 ను ప్రారంభించ‌డం ఎంతో సంతోషంగా ఉంది.

ఈ స‌మావేశం కోసం ది ఎక‌నామిక్ టైమ్స్ కౌలాలంపూర్ ను ఎంపిక చేసుకోవ‌డం వాణిజ్య సంబంధమైన మరియు వ్యాపార సంబంధమైన గమ్యస్థానంగా మలేషియాకు ఉణ్న ప్రాముఖ్యాన్ని సూచిస్తోంది.

ఈ స‌మావేశానికి ఇవే నా శుభాభినంద‌న‌లు.

స్నేహితులారా..

శ్రేష్ఠులు శ్రీ మొహ‌మ్మ‌ద్ న‌జీబ్‌ నాయకత్వంలో మ‌లేషియా 2020 కల్లా అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలన్న తన గమ్యం దిశగా పయనిస్తోంది.

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఏర్ప‌డిన ఆర్ధికస్థితి పట్ల ప్రతిస్పందించడంలోనూ మలేషియా సమర్థంగా వ్య‌వహ‌రించింది.

భారతదేశం మరియు మలేషియా ల మధ్య చిరకాలంగా నెలకొన్న సంబంధాలు పెద్ద సంఖ్యలో నివ‌సిస్తున్న భార‌త సంత‌తి ప్ర‌జ‌ల కార‌ణంగా మరింత బలోపేత‌మ‌య్యాయి.

ఈ మ‌ధ్య‌నే కౌలాలంపూర్ లోని ప్ర‌ధాన భాగంలో నెల‌కొల్పిన తోర‌ణ ద్వారం ఇరు దేశాల బంధాల‌కు, సంస్కృతికి నిద‌ర్శ‌నంగా నిలిచి చారిత్రాత్మ‌క బంధాల‌కు ప్ర‌తీక‌గా నిలచింది.

ఇటీవల కాలంలో, మేము ఒక వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పుకొన్నాము.

గ‌త సంవ‌త్స‌రం నవంబ‌ర్ లో మ‌లేసియాలో నేను చేసిన ప‌ర్య‌ట‌న ఇరు దేశాల మ‌ధ్య‌ ప‌లు అంశాలలో ఉన్న వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యం మరింత దృఢంగా మారడానికి ఉపకరించింది.

మా యాక్ట్ ఈస్ట్ పాలిసి విజ‌య‌వంతం కావ‌డంలో మ‌లేషియాతో ఉన్న సన్నిహిత సంబంధాలు కీలకం.

ప్రాజెక్ట్ అభివృద్ధి నిధి, లైన్ ఆఫ్ క్రెడిట్ లతో సహా భార‌త‌దేశం తీసుకొన్న పలు కార్యక్రమాలు భారతదేశం- ఆసియాన్ స‌హ‌కారానికి భారీ ఊతాన్ని అందించాయి.

మిత్రులారా..

ఆసియాన్ దేశాల నాయకులు ఈ ప్రాంత దేశాల మధ్య మెరుగైన సమన్వయం కోసం జరిగిన ప్రయత్నాలకు నేతృత్వం వహించారు.

కాబట్టి ఏషియా వ్యాపార రంగ ప్రముఖులను ఒక చోటుకు తీసుకువచ్చేందుకు ఏర్పాటైన కార్యక్రమం సరైన సమయంలో చేపట్టినటువంటి కార్యక్రమం అని చెప్పాలి.

21వ శ‌తాబ్దం ఆసియా శతాబ్దం అని నేను ప‌లు సంద‌ర్భాలలో చెప్పి ఉన్నాను.

ప‌ని చేయ‌గ‌లిగే మాన‌వ వ‌న‌రులు, వినియోగ‌దారులు, నేర్చుకొనేందుకు అనుకూలమైన అణకువ కలిగిన వారు ఉన్న ప్రాంతమే ఆసియా.

అంత‌ర్జాతీయంగా అననుకూల, అనిశ్చిత ఆర్ధిక వాతావ‌ర‌ణం నెలకొన్నప్పటికీ, ఆసియాన్ ప్రాంతంలో పురోగతి అవకాశాలు ఒక ఆశాకిరణంగా తోచాయి.

స్నేహితులారా..

భార‌త‌దేశం ప్రస్తుతం ఆర్ధిక పరివర్తనను చవిచూస్తోంది.

ఇది ప్ర‌పంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్ధిక వ్య‌వ‌స్థ‌లలో ఒక‌టి మాత్రమే కాదు; భార‌త‌దేశంలో..

– వ్యాపారం చేయడానికి సౌలభ్యం,

– పాలనను పార‌ద‌ర్శ‌క‌ంగాను, స‌మ‌ర్థ‌ంగాను తీర్చిదిద్దడం,

– నియంత్ర‌ణల పరంగా అధిక భారాన్ని త‌గ్గించ‌డం వంటి కార్య‌క్ర‌మాలు

అమలవుతున్నాయి కూడా.

నల్లధనం, అవినీతి ల బారి నుండి వ్యవస్థను కాపాడడమనేది ప్రస్తుతం నా కార్య‌క్ర‌మాల పట్టికలో ప్రముఖమైన కార్యక్రమంగా ఉంది.

డిజిట‌లీక‌ర‌ణ‌ మరియు జిఎస్ టి ని ప్రవేశపెట్టడం కూడా వెంటవెంటనే జరుగనున్నాయి.

మా ప్రయత్నాల ఫలితాలు వేరు వేరు సూచికలలో భారతదేశానికి లభించిన అంత‌ర్జాతీయ ర్యాంకింగులలో ప్రతిఫలిస్తున్నాయి.

ప్రపంచ బ్యాంకు యొక్క డూయింగ్ బిజినెస్ రిపోర్ట్ లో భార‌త‌దేశానికిచ్చిన ర్యాంకు ఎగబాకింది.

ప్ర‌పంచంలోని ఉత్త‌మ‌మైన వ్యాపార విధానాల‌కు, భార‌త‌దేశంలో వ్యాపార పద్ధతులకు మధ్య ఉన్న అంతరాన్ని మేము చాలా వేగంగా పూడ్చుతున్నాము.

యుఎన్ సి టి ఎ డి విడుద‌ల చేసిన వ‌ర‌ల్డ్ ఇన్ వెస్ట్ మెంట్ రిపోర్ట్ 2016 లో 2016-18 సంవత్సరాలకుగాను అగ్రగామి ప్రాస్పెక్టివ్ హోస్ట్ ఎకాన‌మీస్ జాబితాలో మేము మూడో ర్యాంకులో నిలచాము.

వ‌ర‌ల్డ్ ఎక‌న‌మిక్ ఫోరమ్ యొక్క ‘2015-16, 2016-17 సంవ‌త్స‌రాల‌ గ్లోబ‌ల్ కాంపిటీటివ్ నెస్ రిపోర్టు’ లో మా ర్యాంకు 32 స్థానాల‌ను దాటుకొని ముందుకువెళ్లింది;

గ్లోబ‌ల్ ఇన్నోవేష‌న్ ఇండెక్స్ 2016లో మేము 16 స్థానాల‌ను దాటుకొని ముందుకెళ్లాం; అలాగే, ప్ర‌పంచ‌ బ్యాంకు ప్ర‌క‌టించిన ‘లాజిస్టిక్స్ ఫ‌ర్ ఫార్మెన్స్ ఇండెక్స్ 2016’లో మేము 19 స్థానాల వ‌ర‌కు మెరుగ‌య్యాము.

మేము నూత‌న రంగాలలో ఎఫ్ డి ఐ కి అవ‌కాశం క‌ల్పించాము. అంతే కాదు, మ‌రికొన్ని రంగాల్లో ఎఫ్ డి ఐ ల‌కు ఉన్న ప‌రిమితులను పెంచాము.

ఎఫ్ డి ఐ రంగంలోని ప్ర‌ధాన‌ విధానాలలో సంస్క‌ర‌ణ‌ల‌ కోసం మా ప్ర‌య‌త్నాలు కొనసాగుతూనే ఉంటాయి. పెట్టుబ‌డులు పెట్ట‌డానికి వీలుగా ప‌రిస్థితుల‌ను స‌రళీకరించ‌డం జ‌రుగుతుంది.

ఇప్ప‌టికే మేము సాధించిన ఫ‌లితాల‌ను ఎవ‌రైనా స‌రే చూడ‌వ‌చ్చు.

గ‌త రెండున్నర సంవ‌త్స‌రాలలో ఎఫ్ డి ఐ ల రాక 130 బిలియ‌న్ అమెరికా డాల‌ర్ల‌కు చేరుకొంది.

గ‌త సంవ‌త్స‌రంలో మేము అందుకొన్న ఎఫ్ డి ఐ నిధులు అత్యంత అధిక స్థాయిలో ఉన్నాయి.

గ‌త రెండు ఆర్ధిక సంవ‌త్స‌రాలలో వ‌చ్చిన ఎఫ్ డి ఐ లలో పెరుగుద‌ల- అంత‌కు ముందు రెండు ఆర్ధిక సంవ‌త్స‌రాలలో వ‌చ్చిన ఎఫ్ డి ఐ ల‌తో పోలిస్తే- 52 శాతంగా లెక్క తేలింది.

ఎఫ్ డి ఐ ల‌ను పెడుతున్న రంగాల‌తో పాటు వాటిని స్వీక‌రిస్తున్న రంగాలు కూడా గ‌ణ‌నీయ స్థాయిలో పెరిగాయి.

మేం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా మొద‌లుపెట్టిన ‘మేక్ ఇన్ ఇండియా’ కార్య‌క్ర‌మం ఈ సంవ‌త్స‌రం రెండో వార్షికోత్స‌వాన్ని జ‌రుపుకొంది. దీని ద్వారా త‌యారీ, డిజైన్‌, ప‌రిశోధ‌న రంగాలలో భార‌త‌దేశాన్ని అంత‌ర్జాతీయ కేంద్రంగా రూపొందించ‌డానికి కృషి చేస్తున్నాము.

మేము సాధించిన కొన్ని విజ‌యాల‌ను ఇక్క‌డ ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించ‌ద‌లుచుకున్నాను:

త‌యారీ రంగంలో ప్ర‌పంచంలోనే ఆర‌వ అతి పెద్ద దేశంగా భార‌త‌దేశం అవ‌త‌రించింది.

2015-16లో త‌యారీరంగానికి చేకూరిన మొత్తం విలువ రికార్డు స్థాయిలో 9.3 శాతం వృద్దిని సాధించింది.

గ‌త రెండు సంవ‌త్స‌రాల్లో 51 కోల్డ్ చెయిన్ ప్రాజెక్టుల‌ను పూర్తి చేయ‌డం జ‌రిగింది.

2014నుంచి తీసుకుంటే ఆరు మెగా ఫుడ్ పార్కుల‌ను ప్రారంభించాము.

గ‌త రెండు ఆర్ధిక సంవ‌త్స‌రాల్లో 19 కొత్త టెక్స్ టైల్ పార్కులకు ఆమోదం తెలప‌డం జ‌రిగింది. ప్ర‌స్తుత‌మున్న టెక్స్ టైల్ పార్కుల్లో 200 నూత‌న ఉత్ప‌త్తి యూనిట్ల‌ను నెల‌కొల్ప‌గ‌లిగాము.

ఈ సంవ‌త్స‌రం భార‌త‌దేశంలో త‌యారవుతున్న మొబైల్ ఫోన్ల సంఖ్య 90 శాతం పెరిగింది.

ఆటో రంగంలోని ప్ర‌ముఖ అంత‌ర్జాతీయ కంపెనీలు త‌మ అసెంబ్లీ యూనిట్ల‌ను, గ్రీన్ ఫీల్డ్ యూనిట్ల‌ను నెలకొల్పాయి.

స్నేహితులారా..

భార‌త‌దేశంలో సులువుగా వ్యాపారం చేసుకోవ‌డానికి వీలుగా మేము తీసుకున్నంటున్న చ‌ర్య‌లు స‌మ‌గ్రంగా ఉంటున్నాయి. అవి ప‌లు రంగాల‌కు వ‌ర్తిస్తాయి. చ‌ట్ట‌ప‌ర‌మైన‌, నిర్మాణాత్మ‌క విభాగాల్లోనూ ఈ చ‌ర్య‌లు ఉంటాయి.

మీతో నేను సంతోషంగా ఒక విష‌యాన్ని పంచుకోవాల‌నుకుంటున్నాను.

వ‌స్తువులు, సేవ‌ల ప‌న్నుకు (జిఎస్ టి కి) సంబంధించిన రాజ్యాంగ స‌వ‌ర‌ణకు ఆమోదం లభించింది. ఇది 2017 నుండి అమ‌లులోకి రాగలదని భావిస్తున్నాము.

మేము ప్ర‌స్తుతం న‌గ‌దు ర‌హిత‌, డిజిట‌ల్ ఆర్ధిక వ్య‌వ‌స్థ‌లోకి ప్ర‌యాణిస్తున్నాము..

మా లైసెన్సుల విధానం పూర్తిగా శాస్త్రీయం చేయ‌డం జ‌రిగింది.

ఏదైనా కంపెనీని రిజిస్ట‌ర్ చేసుకోవాల‌న్నా, ఎగుమతులు దిగుమతుల సంబంధమైన క్లియ‌రెన్సుల‌ కోసం, కార్మిక ప‌ర‌మైన స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం మేము సింగిల్ విండో విధానాన్ని ప్ర‌వేశ‌పెట్ట‌డం జ‌రిగింది.

నీరు, విద్యుత్ లాంటి సౌక‌ర్యాల‌ను పొంద‌డానికి అనుస‌రించాల్సిన విధానాల‌ను స‌ర‌ళీక‌రించ‌డం జ‌రిగింది.

పెట్టుబ‌డిదారుల‌కు స‌హాయం చేసి వారికి దారి చూప‌డానికి వీలుగా ఇన్ వెస్ట‌ర్ ఫెసిలిటేష‌న్ సెల్ ను రూపొందించ‌డం జ‌రిగింది.

మేక్ ఇన్ ఇండియా కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించిన త‌రువాత కేంద్ర ప్ర‌భుత్వానికి, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు మ‌ధ్య‌ భాగ‌స్వామ్యం చెప్పుకోద‌గ్గ స్థాయిలో పెరిగింది.

ఆయా రాష్ట్రాలలో అమ‌లవుతున్న వ్యాపార విధి విధానాల‌ను ప‌రిగ‌ణ‌నలోకి తీసుకొని ప్ర‌పంచ బ్యాంకుతో క‌లిసి 2015లో రాష్ట్రాల‌కు ర్యాంకులు ఇవ్వ‌డం జ‌రిగింది. అంద‌రికీ ఆమోద‌యోగ్య‌మైన పరామితుల ప్ర‌కారమే ఈ ప‌ని చేశాము. ఈ ప‌నిని 2016కు కూడా విస్త‌రించాము.

భ‌విష్య‌త్ లో మేధోప‌ర‌మైన హ‌క్కుల‌ను పొంద‌డానికిగాను అనుస‌రించాల్సిన మార్గసూచిని రూపొందించ‌డానికి మొట్ట‌మొద‌టిసారిగా స‌మ‌గ్ర‌మైన జాతీయ మేధో ఆస్తి హ‌క్కు విధానాన్ని ప్ర‌వేశ‌పెట్ట‌డం జ‌రిగింది.

సృజనాత్మ‌క విధ్వంసాన్ని అమ‌లు చేసే విధానం కోసం ప్ర‌ధాన‌మైన చ‌ర్య‌ల‌ను తీసుకోవ‌డం జ‌రిగింది.

కంపెనీలు పున‌ర్ వ్య‌వ‌స్థీకృతం కావ‌డానికి, నిష్ర్క‌మించ‌డానికి సులువైన చ‌ర్య‌ల‌ను చేప‌ట్టాము.

భార‌త‌దేశం నుండి సులువుగా నిష్క్ర‌మించడంలో ముఖ్య‌మైన ప‌ని, ఇన్ సాల్వెన్సీ అండ్ బ్యాంక్ ర‌ప్ట‌సీ కోడ్ కు చ‌ట్ట‌బ‌ద్ద‌త‌, అమ‌లు.

వాణిజ్య‌ప‌ర‌మైన త‌గాదాల‌ను వేగంగా ప‌రిష్క‌రించ‌డానికి నూత‌న వాణిజ్య కోర్టుల‌ను నెల‌కొల్ప‌డం జ‌రిగింది.

ఆర్బిట్రేష‌న్ చ‌ట్టాల‌కు స‌వ‌ర‌ణ‌లు చేసి విచార‌ణ‌ల‌ను వేగంగా పూర్తి చేస్తున్నాము.

స్నేహితులారా,

ఇది వ‌ర‌కు ఎన్న‌డూ లేని విధంగా నేడు భార‌త‌దేశం ఔత్సాహిక పారిశ్రామిక కార్య‌క్ర‌మాలతో వెలిగిపోతోంది.

భార‌త‌దేశంలో బ‌ల‌మైన ఆర్ధిక శ‌క్తిగా స్టార్ట‌ప్ కంపెనీలు అవ‌త‌రించ‌బోతున్నాయి..ఇది విప్ల‌వాత్మ‌క ప‌రిణామం.

ఈ రంగంలో గ‌ల సామ‌ర్థ్యాన్ని వెలికితీయ‌డానికి మేము ప్రారంభించిన ‘స్టార్ట్ అప్ ఇండియా’ కార్య‌క్ర‌మం ఉప‌యోగ‌ప‌డుతోంది.

ఉపాధి క‌ల్ప‌న‌కు, స్వ‌యం ఉపాధికి ఎంతో ముఖ్యమైన కార్య‌క్ర‌మాల‌ను మా ఆర్ధిక విధానంలో రూపొందించడం జ‌రిగింది.

ఈ విధంగా మాత్ర‌మే జ‌నాభాపరంగా భార‌త‌దేశం ల‌బ్ధి పొంద‌గ‌ల‌దు.

నైపుణ్య భార‌త‌దేశం కార్య‌క్ర‌మం దానికి సంబంధించిన ఇత‌ర అంశాలను చూసిన‌ప్పుడు వాటి ద్వారా మేము మార్కెట్ అవ‌స‌రాల‌కు అనుగుణంగా పూర్తిస్థాయిలో నైపుణ్యాల‌ను స‌మ‌ర్థ‌వంతంగా వాడుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నాము.

భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌ను అందుకోగ‌లిగే మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న అనేది మేం చేప‌ట్టిన‌ అతి పెద్ద కార్య‌క్ర‌మం.

దేశ‌వ్యాప్తంగా వాణిజ్య కారిడార్ల‌ను అభివృద్ధి చేసుకుంటున్నాము.

దేశ‌వ్యాప్తంగా మేం చేప‌ట్టిన కార్య‌క్ర‌మాల అమ‌లులో క్షేత్ర‌ స్థాయిలో ఎదుర‌వుతున్న అడ్డంకుల‌ను తొల‌గించడంపైన‌ పూర్తిస్థాయిలో దృష్టిపెట్టాము.

దేశ‌వ్యాప్తంగా రహదారులు, రైల్వే వ్య‌వ‌స్థ‌ల‌ను, నౌకాశ్ర‌యాల‌ను నేటి అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్టుగా ఆధునీక‌రిస్తున్నాము.

ఇలాంటి మౌలిక వ‌స‌తులకు కావాల్సిన నిధుల‌కోసం విదేశీ నిధుల స‌హాయంతో జాతీయ పెట్టుబ‌డి, మౌలిక వ‌స‌తుల నిధిని ఏర్పాటు చేయ‌డం జ‌రిగింది.

స్నేహితులారా,

ఇది ఐక్యంగా వ్య‌వ‌హ‌రించాల్సిన స‌మ‌యం.

లోన ఒక‌టి పెట్టుకొని పైకి మ‌రొక‌టి మాట్లాడ‌కుండా ముక్కుసూటితనంతో వ్య‌వ‌హ‌రించిన‌ప్పుడే ఐక‌మ‌త్యాన్ని సాధించ‌గ‌లుగుతాము.

భార‌త‌దేశం ఎల్ల‌ప్పుడూ హృద‌య‌పూర్వ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తోంది.

ఆర్ధిక‌ రంగ స్థాయిలో చూసిన‌ప్పుడు.. ప్ర‌పంచవ్యాప్తంగా స్ప‌ష్ట‌త‌తో ఉండి అందరినీ క‌లుపుకొనివెళ్లే ఆర్థిక వ్య‌వ‌స్థ‌లలో భారతదేశ ఆర్థిక వ్వవస్థ కూడా ఒక‌టి.

ఇంత‌వ‌ర‌కూ భార‌త‌దేశంలో వ్యాపార వాణిజ్య కార్య‌క్ర‌మాలు ప్రారంభించ‌ని వారికి మేము స్వాగ‌తం ప‌లుకుతున్నాము.

మీకు నేను వ్య‌క్తిగ‌తంగా హామీని ఇస్తున్నాను.. మీకు అవ‌స‌ర‌ం అయిన‌ప్పుడు నేను మీ ప‌క్క‌నే ఉంటాను.

భార‌త‌దేశం మీరు చేరుకోవ‌లసిన ఉత్త‌మ‌మైన గ‌మ్యం మాత్ర‌మే కాదు;

భార‌త‌దేశంలో మీ కార్య‌క‌లాపాలు నిర్వ‌హించ‌డం ఎల్ల‌ప్ప‌టికీ ఒక మంచి నిర్ణ‌యంగా మిగిలిపోతుంది.

మీకు ఇవే నా ధన్యవాదములు.