The very word "Japan" in India is a benchmark of quality, excellence, honesty and integrity: PM Modi
India's gets inspiration through the teachings of Truth from Gautam Buddha and Mahatma Gandhi: PM
21st Century is Asia’s Century. Asia has emerged as the new centre of global growth: PM Modi
Strong India – Strong Japan will not only enrich our two nations. It will also be a stabilising factor in Asia and the world: PM Modi
Today, India is on the path of several major transformations: Prime Minister Narendra Modi
India seeks rapid achievement of our developmental priorities, but in a manner that is environment friendly: PM
Creating an enabling environment for business and attracting investments remains my top priority: PM Modi

ఈ మహత్తర దేశాన్ని మరొక సారి సందర్శించడం నాకు ఎంతో సంతోషాన్నిస్తున్నది. ఇక్కడ ఎన్నో పరిచితమైన ముఖాలను చూడడం నిజానికి ఎనలేని ఆనందాన్ని ఇస్తోంది. ఈ అవకాశాన్ని కల్పించినందుకు భారతీయ పరిశ్రమల సమాఖ్య (సిఐఐ) మరియు జపాన్ పరిశ్రమల సమాఖ్య (కైదన్‌రెన్)లకు ధన్యవాదాలు తెలుపుకొంటున్నాను. మీతో కలవడం చాలా ఉపయోగకరంగా ఉంటుందని నేను ఎల్లప్పుడూ భావిస్తాను.

 

కొన్ని సంవత్సరాలుగా నేను అనేక సార్లు జపాన్ ను సందర్శించాను. నాయకత్వంతో, ప్రభుత్వంతో, పారిశ్రామికవేత్తలతో మరియు జపాన్ ప్రజలతో నా వ్యక్తిగత అనుబంధానికి నిజానికి దశాబ్దపు వయసు.

 

మిత్రులారా,

 

భారతదేశంలో, ‘జపాన్’ అనే పదం, నాణ్యత, శ్రేష్ఠత, నిజాయతీ మరియు విశ్వసనీయతలకు ప్రమాణంగా నిలుస్తోంది.

సుస్థిర అభివృద్ధిలో జపాన్ ప్రజలు ప్రపంచాన్ని ముందుకు నడిపించారు. సామాజిక బాధ్యత మరియు నైతిక ప్రవర్తనలకు సంబంధించి కూడా లోతైన అవగాహన వుంది.

 

ప్రపంచంలోని ఇతర ప్రాంతాల, ముఖ్యంగా ఆసియా, ఆఫ్రికా దేశాల అభివృద్ధి ప్రక్రియలో జపాన్ యొక్క అపారమైన సహాయం గురించి మనందరికీ తెలిసిందే.

 

భారతీయ మౌలిక విలువలు దాని నాగరికతా వారసత్వంలో వేళ్ళూనుకొని ఉన్నాయి. గౌతమ బుద్ధుడు మరియు మహాత్మా గాంధీల సత్యాన్ని గురించిన బోధనల నుండి అది ప్రేరణ పొందుతుంది.

 

మన ప్రజాస్వామిక సంప్రదాయాలు, సంపద మరియు విలువల సృష్టి రెండింటికీ ప్రాధాన్యత నివ్వడం, వ్యాపార ఉద్యమం గురించిన బలమైన భావం, దాని ఆర్థిక వ్యవస్థను ఆధునీకరించి వృద్ధి చెందేట్లు చేయడం-వీటి నుంచి అది తన రెక్కలని పొందుతుంది.

 

అందువల్లనే కలిసి పనిచేయడానికి భారతదేశం మరియు జపాన్ బాగా సరిపోతాయి.

 

నిజానికి,

మన గతం మనం సమైక్యంగా ఉండాలని కోరుకున్నది.

మన వర్తమానం మనల్ని కలసి పని చేయమని ప్రోత్సహిస్తున్నది.

 

మిత్రులారా,

ఈ 21వ శతాబ్దం ఆసియా శతాబ్దం అని నేను ఎప్పటి నుండో చెబుతున్నాను.

అది ఉత్పత్తి, సేవా రంగాలలో పోటీదారు, ప్రపంచ ఆవిష్కరణలకు కేంద్రంగా మారుతున్నది, ప్రతిభావంతమైన విశాల శ్రామిక శక్తికి పుట్టిల్లు మరియు ప్రపంచ జనాభాలో అరవై శాతం కలిగి ఉండి నిరంతరం విస్తృతమవుతున్న విపణి.

 

ఆసియా ఆవిర్భావంలో భారతదేశం మరియు జపాన్ వాటి ప్రధాన పాత్రలను కొనసాగిస్తాయి.

మన ప్రత్యేక వ్యూహాత్మక మరియు ప్రపంచ భాగస్వామ్యం నాయకత్వంలో పెరుగుతున్న భారతదేశం, జపాన్ ల మధ్య అభిప్రాయాల ఏకీభావం ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థను మరియు అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తుంది మరియు ప్రపంచ వృద్ధిని ఉత్తేజపరుస్తుంది.

 

బలమైన భారతదేశం-బలమైన జపాన్ మన రెండు దేశాలని సుసపన్నం చేయడం మాత్రమే కాదు, అది ఆసియా మరియు ప్రపంచంలో ఒక స్థిరత్వాన్ని నెలకొల్పే కారకంగా కూడా వుంటుంది.

 

మిత్రులారా,

 

ఇవాళ భారతదేశం అనేక అతి పెద్ద మార్పుల మార్గంలో నడుస్తోంది. మనం అనేక నిర్ణయాత్మక చర్యలని చేపట్టాము, భారతదేశం తన శక్తి సామర్థ్యాలను తెలుసుకునే విధంగా పరిపాలనా పద్ధతిని నిర్మించాము. ఫలితాలు ఇప్పటికే కనిపిస్తున్నాయి.

బలహీనమైన అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితిలో కూడా, భారతదేశం నుంచి బలమైన వృద్ధి, పుష్కలమైన అవకాశాలను గురించిన వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలు నమ్మశక్యం కాని అవకాశాల గురించి, భారతదేశపు నమ్మకమైన విధానాల గురించి.

 

2015లో భారత ఆర్థిక వ్యవస్థ ఇతర పెద్ద అర్థిక వ్యవస్థల కంటే కూడా వేగంగా అభివృద్ధి చెందింది. ఈ ధోరణి కొనసాగుతుందని ప్రపంచ బ్యాంకూ మరియు అతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ అంచనా వేస్తున్నాయి. భారతదేశాన్ని ఆకర్షణీయమైన పెట్టుబడుల గమ్యంగా తయారు చేయడానికి అత్యల్ప కార్మిక వ్యయాలూ, అతి పెద్ద దేశీయ విపణి మరియు స్థూల ఆర్థిక సుస్థిరత అన్నీ కలిశాయి.

 

గత రెండు ఆర్థిక సంవత్సరాలలో మనం 55 బిలియన్ డాలర్ల విలువైన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్ డి ఐ)ని అందుకున్నాము. ఇప్పటిదాకా ఇదే అత్యధిక ఎఫ్ డి ఐ మాత్రమే కాకుండా, భరతదేశంలోని ఎఫ్ డి ఐ లో అత్యధిక వృద్ధి కూడా.

ఇ వాళ ప్రతి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా ఒక భారత వ్యూహాన్ని కలిగి వుంది. జపాన్ కంపెనీలు ఇందుకు మినహాయింపు కాదు.

ఇవాళ జపాన్ భారతదేశపు నాలుగవ అతిపెద్ద ఎఫ్ డి ఐ కి వనరు అంటే అందులో ఆశ్చర్యం ఏమీ లేదు.

జపాన్ పెట్టుబడులు గ్రీన్ ఫీల్ద్ (నూతనంగా కంపెనీలను నెలకొల్పడం) మరియు బ్రౌన్ ఫీల్ద్ (ఉన్న కంపెనీలను కొనడం లేదా లీజుకు తీసుకోవడం లేదా అందులో పెట్టుబడులు పెట్టడం) రెండింటికీ విస్తరించాయి. అవి తయారీ మరియు సేవా రంగాలకూ, మౌలిక వసతుల కల్పన మరియు బీమా రంగాలకూ మరియూ ఇ- కామర్స్ మరియు ఈక్విటీ రంగాలకు విస్తరించాయి.

 

మా వంతుగా, మేము మరింత పెద్ద జపాన్ పెట్టుబడుల వెల్లువను కోరుకొంటున్నాము. ఇందుకోసం మేము మీ ఆందోళనల్ని చాలా చురుకుగా పరిష్కరిస్తాము.

 

ఇంకా, జపాన్ పారిశ్రామిక టౌన్ షిప్పులతో పాటు ప్రత్యేక విధానాల్ని బలోపేతం చేస్తాము.

మేము ఇప్పుడు జపాన్ ప్రయాణికులకు అందిస్తున్న పది సంవత్సరాల వ్యాపార వీసా, ఇ-టూరిస్టు వీసా, వీసా ఆన్ అరైవల్ సౌకర్యాలను ఉపయోగించుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను.

 

జపాన్ తో సామాజిక భద్రతా ఒప్పందం కూడా అమలు లోకి వచ్చింది. రెండు వైపులా పెరుగుతోన్న నిపుణులకు ఇది శుభ వార్త.

 

మిత్రులారా,

 

భారతదేశపు అభివృద్ధి అవసరాలు భారీ స్థాయిలోనూ మరియు గణనీయంగానూ ఉన్నాయి. మా అభివృద్ధి ప్రాధాన్యాల్ని అత్యంత వేగంగా సాధించాలని మేము కోరుకుంటున్నాము. అయితే, అది పర్యావరణానికి భంగం కలగని రీతిలోనే.

 

• మేము రహాదారుల్నీ రైల్వేలనూ అత్యంత వేగంగా నిర్మించాలనుకొంటున్నాము;

• మేము పర్యావరణానికి హాని జరగకుండా ఖనిజాలనూ, హైడ్రోకార్బన్లనూ శోధించాలనుకొంటున్నాము;

• మేము గృహాలనూ, ఫౌర సదుపాయలనూ మెరుగైన పద్ధతిలో నిర్మించాలనుకొంటున్నము; మరియు

• మేము శుభ్రమైన పద్ధతిలో ఇంధనాన్ని వుత్పత్తి చెయ్యాలనుకొంటున్నాము.

 

వీటితో పాటు, రెండవ తరానికి చెందిన భవిష్య మౌలిక సదుపాయాల కల్పనా ప్రాజెక్టులున్నాయి. ఇవి: ప్రత్యేక సరుకుల కారిడార్, పారిశ్రామిక కారిడార్లు, హై స్పీడు రైల్వేలు,స్మార్ట్ సిటీలు, కోస్టల్ జోన్లు మరియు మెట్రో రైల్ ప్రాజెక్టులు.

 

ఇవన్నీ కూడా ఇదివరకెప్పుడూ లేని అవకాశాల్ని జపాన్ పారిశ్రామిక రంగానికి అందిస్తున్నాయి. మేడ్ ఇన్ ఇండియా మరియు మేడ్ బై జపాన్ ల కలయిక అద్బుతంగా పనిచేయడం, ఏకీకృతం అవడం మొదలైంది.

 

భారతదేశంలో జపాన్ తయారీదారు చేత తయారైన కార్లు ఇప్పటికే జపాన్లో అమ్ముడవుతున్నాయి. ఇప్పటికే భారతదేశంలో వున్న మీకందరికీ నేను ధన్యవాదాలు మరియు అభినందనలను తెలియజేస్తున్నాను.

తమ కార్యకలాపాల్ని ప్రారంభించాలనుకొంటున్న వారికి, మేక్ ఇన్ ఇండియాను ముందుకు తీసుకెళ్ళడానికి మా విధానలనూ మరియు వ్యవహార పద్ధతుల్ని మరింత మెరుగు పరచడానికి మేము నిబద్ధులమై ఉన్నామని హామీ ఇస్తున్నాను.

మిత్రులారా,

 

వ్యాపారానికి తోడ్పాటునందించే వాతావరణాన్ని మరియు పెట్టుబడులను ఆకర్షించడం నాకు అతి ముఖ్యమైన ప్రాధమ్య అంశం. భారతదేశంలో జరిగే వ్యాపార స్వభావాన్ని స్థిరమైన, ఊహించదగిన మరియు పారదర్శకమైన నిబంధనలు పునర్ నిర్వచిస్తాయి.

ఇ-
గవర్నెన్స్ ఇక ఎంత మాత్రమూ ఫ్యాన్సీ పదంగా వుండదు. కానీ, అది ఒక మౌలిక సదుపాయం. సరుకులు మరియు సేవల పన్ను కు(జిఎస్ టి) సంబంధించి మేము ఒక కొత్త చట్టాన్ని విజయవంతంగా తీసుకొచ్చాము.

ఇటీవల ఆమోదం పొందిన ‘అప్పులు చెల్లించ లేని మరియు దివాలా కోడ్’ (ఇన్సాల్వెన్సీ మరియు బ్యాంక్ రప్టసి కోడ్) ఇన్వెస్టర్లు నిష్క్రమించడానికి మార్గాన్ని సులభతరం చేస్తుంది. వ్యాపార సంబంధమైన విషయాల్ని వేగంగా పరిష్కరించడం కోసం మేము వాణిజ్య న్యాయస్థానాల్నీ, వాణిజ్య డివిజన్లనూ నెలకొల్పుతున్నాము.

 

వివాదాల పరిష్కార చట్టంలో సవరణల్ని తీసుకు రావడం వల్ల, వివాదాల పరిష్కరణ విచారణలు ఇక వేగవంతం అవుతాయి. ఈ సంవత్సరం జూన్‌లో మేము ఎఫ్ డి ఐ వ్యవస్థను మరింత సరళతరం చేశాము. నూతన మేథో సంపత్తి హక్కుల విధానాన్ని కూడా మేము ప్రకటించాము.

 

ఇవన్నీ కూడా భారతదేశం కొనసాగిస్తున్న ఆర్థిక సంస్కరణల నూతన దిశను సూచిస్తున్నాయి. ప్రపంచంలోనే భారతదేశాన్ని అత్యంత బహిరంగ ఆర్థిక వ్యవస్థగా చేయాలని నా సంకల్పం. మా ప్రయత్నాల ప్రభావాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలుసుకొంటున్నారు, గుర్తిస్తున్నారు.

 

• గత రెండు సంవత్సరాలలో ఎఫ్ డీ ఐ ఈక్విటీ అంతర్‌ప్రవాహం 52% పెరిగింది.

 

• 2016లో ప్రపంచ బ్యాంకు వెలువరించిన ప్రపంచ లాజిస్టిక్స్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ లో భారతదేశం 19 స్థానాలకి ఎగబాకింది.

• “సులభంగా వ్యాపారాన్ని చేయడం” అనే విషయంలో మేము గణనీయంగా మెరుగయ్యాము. మా ర్యాంకింగ్ గణనీయంగా మెరుగుపడింది.

ప్రపంచ ఆర్థిక ఫోరం యొక్క గ్లోబల్ కాంపెటీటివ్‌నెస్ ఇండెక్స్ లో భారతదేశం గత రెండు సంవత్సరాలలో 32 స్థానాలకు ఎగబాకింది. ప్రపంచ పెట్టుబడి నివేదిక 2015 ప్రకారం ప్రపంచం లోని మెరుగైన 10 ఎఫ్ డి ఐ గమ్యాలలో భారతదేశం మొదటిది.

మిత్రులారా,

 

భారతదేశానికి స్థాయి, వేగం మరియు నైపుణ్యం అవసరమని నేను ఎప్పటి నుండో చెబుతున్నాను. ఈ మూడింటిలో జపాన్ చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నది.

ప్రత్యేక సరుకు కారిడర్, ఢిల్లీ ముంబై పారిశ్రామిక కారిడర్, మెట్రో రైలు మరియు హై స్పీడు రైలు వంటి మన మెగా ప్రాజెక్టులలో జపాన్ ప్రమేయం స్థాయినీ మరియు వేగాన్ని సూచిస్తున్నది.

 

ఇప్పటికే అనేక నైపుణ్య అభివృద్ధి చొరవలు అమలులోకి వస్తున్న తరుణంలో, మన భాగస్వామ్యం మన ప్రాధాన్యంలోని కీలకమైన రంగంలోకి విస్తరిస్తున్నది. జపాన్ సాంకేతిక నైపుణ్యాలు మరియు భారత మానవ వనరుల కలయిక అందరికీ గెలుపును అందించే పరిస్థితిని తీసుకువస్తుందనటంలో ఇక్కడ కూర్చొని వున్న జపాన్ వ్యాపార, పారిశ్రామిక అధిపతులు నాతో అంగీకరిస్తారు.

 

మీ హార్డువేర్ మరియు మా సాఫ్ట్ వేర్ ల కలయిక ఒక అద్బుతమైన కలయిక అని నేను గతంలోనే చెప్పాను. అది ఇరు దేశాలకూ లాభదాయకంగా ఉంటుంది.

 

మరింత సన్నిహితంగా, బలంగా మన చేతుల్ని కలుపుదాం రండి. కలిసి ముందుకు నడుద్దాం. మరింత ఎక్కువ శక్తి సామర్థ్యాలను మరియు మరింత స్పష్టమైన ప్రయోజనాల్ని కనుగొందాము.

 

ధన్యవాదాలు.

 

అనేకానేక ధన్యవాదాలు.