బిజ్నోర్ బహిరంగ సభలో, కేంద్రంలోని ఎన్డిఎ ప్రభుత్వం మాత్రమే రైతుల సంక్షేమమే ముఖ్యంగా భావించి ఎరువుల ధరలను తగ్గించిందని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. "చౌదరి చరణ్ సింగ్ జీ ప్రధానిగా ఉన్నప్పుడు,  ఆయన ఎరువుల ధరలను తగ్గించారు. ఆయన స్ఫూర్తితోనే రైతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ, ఎరువుల ధరలను తగ్గించే చర్యలు చేపట్టాము. మరి ఏ ఇతర పార్టీ కూడా అలాంటి చర్య తీసుకోలేదు.” అని ఆయన గుర్తుచేసుకున్నారు.

బిజెపి ప్రభుత్వాన్ని గెలిపిస్తే ఉత్తరప్రదేశ్ లోని ప్రతి జిల్లాలోనూ రైతుల సంక్షేమం కోసం చౌదరి చరణ్ సింగ్ కళ్యాణ్ కోష్ ఏర్పాటుచేస్తామని  కూడా శ్రీ మోదీ అన్నారు.