PM Modi calls for promotion of sports and cultural exchanges between states
A digital movement in the nation is going on and the youth are at the core of this: PM
India has tremendous scope to expand it's tourism sector that can draw the world: PM

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు కేంద్రం మరియు రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల పర్యటన, సంస్కృతి ఇంకా క్రీడల మంత్రులు, కార్యదర్శుల జాతీయ సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా పాల్గొని, సభను ఉద్దేశించి ప్రారంభోపన్యాసమిచ్చారు. ఈ కార్యక్రమాన్ని గుజరాత్ లోని కచ్ఛ్ లో నిర్వహిస్తున్నారు.

క్రీడలలో ప్రావీణ్యానికి దారితీసే ఒక సంస్థాగతమైన ఏర్పాటును చేసుకోవలసిన అవసరాన్ని గురించి ప్రధాన మంత్రి నొక్కిచెప్పారు. క్రీడలను లోకప్రియంగా మలచేందుకు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రాల ప్రభుత్వాలు సైతం మంచి ఆసక్తితో ఉన్నాయని ఆయన చెప్పారు. ప్రతిభను గుర్తించేందుకు జిల్లా స్థాయిలో తగిన వ్యవస్థ నెలకొనాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఇది చోటు చేసుకొంటే మనం మన ప్రతిభ యొక్క శ్రేణి ఎటువంటిదన్నది గ్రహించగలమని, తదనుగుణంగా మౌలిక సదుపాయాలను సమకూర్చేందుకు సన్నద్ధులం కావచ్చని ప్రధాన మంత్రి వివరించారు.

పర్యటన రంగం విషయానికి వస్తే, భారతదేశంలో అవకాశాలు అపారంగా ఉన్నాయని, ఈ అవకాశాలు ప్రపంచం దృష్టిని భారతదేశం వైపునకు ఆకర్షించగలుగుతాయని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. భారతదేశపు యువత డిజిటల్ కార్యక్రమాలు, ఇంకా స్వచ్ఛ భారత్ అభియాన్ ల వంటి కీలక కార్యక్రమాలకు శక్తిని సంతరిస్తోందని ప్రధాన మంత్రి చెప్పారు. ప్రతి రాష్ట్రం కొన్ని గమ్యస్థానాలను ఎంపిక చేసుకోవాలని, ప్రపంచ శ్రేణి పర్యటక మౌలిక సదుపాయాలను సమకూర్చుకోవాలని, అలా చేయడం ద్వారా ప్రపంచ యాత్రికులు ఆయా ప్రదేశాలకు తరలివచ్చేటట్లుగా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచనలు చేశారు.

రాష్ట్రాల మధ్య పరస్పరం వివిధ కార్యక్రమాలను అమలుపరచడం ద్వారా ‘ఏక్ భారత్- శ్రేష్ఠ్ భారత్’ ను అమలుపరచే దిశగా కృషిచేయవలసిందిగా సమావేశానికి విచ్చేసిన ప్రతినిధులకు ప్రధాన మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు.

గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపానీ, కేంద్ర సహాయ మంత్రులు (స్వతంత్ర బాధ్యత) శ్రీ విజయ్ గోయల్ మరియు డాక్టర్ మహేశ్ శర్మ లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.