Passage of Maternity Benefit Amendment Bill in Lok Sabha a landmark moment in our efforts towards women-led development: PM
Maternity Benefit Amendment Bill ensures better health & wellbeing of the mother & child. Increase in maternity leave is a welcome provision: PM

ప్రధాన మంత్రి శ్రీ‌ నరేంద్ర మోదీ లోక్ సభలో ప్రసూతి ప్రయోజన సవరణ బిల్లుకు ఆమోదం లభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మహిళల నాయకత్వంలో అభివృద్ధి సాధన దిశగా జరుగుతున్న ప్రయత్నాలలో ఇది ఒక మహత్తర సంఘటన అని ఆయన అన్నారు.

"ప్రసూతి ప్రయోజన సవరణ బిల్లు లోక్ సభలో ఆమోదం పొందడం మహిళల నేతృత్వంలో అభివృద్ధి సాధన దిశగా మనం చేస్తున్న కృషిలో్ ఒక మహత్తర ఘటన.

తల్లి, శిశువుల శ్రేయస్సుకు, చక్కటి ఆరోగ్యానికి ప్రసూతి ప్రయోజన సవరణ బిల్లు హామీ ఇస్తుంది. మాతృత్వ‌పు సెలవు అవధి పెంపుదల ఆహ్వానించదగ్గది.

ప్రసూతి ప్రయోజన సవరణ బిల్లు కారణంగా మహిళల ఉద్యోగాలకు రక్షణ లభిస్తుంది. కార్యాలయాలకు శిశు సంరక్షణ నిలయాలు తప్పక ఉండాలనే నిబంధన ప్రశంసనీయమైనటువంటిది" అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.