PM Narendra Modi addresses public meeting in Aligarh
Our aim is to make rural India smoke-free. We have launched the Ujjwala Yojana & are providing gas connections to the poor: PM
We want our farmers to prosper. We will undertake every possible measure that benefits them: PM
Uttar Pradesh does not need SCAM. It needs a BJP Government that is devoted to development, welfare of poor & elderly: PM

ఉత్తర ప్రదేశ్ లో అలిగర్ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ నేడు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ, అవినీతి, నల్లధనంపై ప్రభుత్వం నిరంతరం పోరాడుతుందని, “2014 లో అధికారంలోకి వచ్చిన నాటి నుండి, అవినీతి అరికట్టేందుకు & అవినీతికి వ్యతిరేకంగా చర్య తీసుకున్నాము.” అని శ్రీ మోదీ అన్నారు.

యుపిలోని  సమాజ్వాదీ పార్టీ ప్రభుత్వంపై  ప్రధాని మోదీ విరుచుకుపడి, రాష్ట్ర అభివృద్ధి గురించి గాని మరియు రాష్ట్రంలో పరిశ్రమలు మూతపడుతున్నదాని గురించి గాని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి ఆందోళన లేదని అన్నారు. “అలిగర్ తాళాలు చాలా ప్రసిద్ధమైనవి. యుపి ప్రభుత్వానికి పట్టింపు లేకపోవడంవల్ల రాష్ట్రంలో పరిశ్రమలు మూతపడుతున్నాయి.” విద్యుత్, చట్టం, రహదారి-వికాస్ మీదే మా దృష్టి అని కూడా ఆయన అన్నారు.

తమ ప్రభుత్వం యువతకు ఉపాధి అవకాశాలను అందించడానికి పథకాలకు చేపడుతుందని ప్రధాని మోదీ అన్నారు. “మేము మీ యువత సంపన్నులవ్వాలనీ మరియు అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాము. మేము ముద్రా యోజనను తీసుకువచ్చి వారికి రుణాలు అందించాము మరియు వ్యవస్థాపకతను ప్రోత్సహించాము.”

ఉత్తరప్రదేశ్లో నేరస్థులకు చట్టమంటే భయం లేదని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. “ఉత్తరప్రదేశ్లో నేరస్థులకు చట్టమంటే భయం లేదు. అందుకే నేరస్తులకు ఆశ్రయమిచ్చే వారిని ఆధికారంనుండి దూరం చేయాలను ప్రజలను కోరుతున్నాను.” అని అన్నారు.

చెరుకు రైతుల సంక్షేమ చర్యలు గురించి మాట్లాడి వారికి 14 రోజుల్లోనే చెల్లింపులు అందుతాయని ప్రధాని తెలిపారు. “ మేము చెరుకు రైతుల కోసం సంక్షేమ చర్యలు చేపట్టాము. అయితే అందుకని యూపి ప్రభుత్వం వారిని సరిగా చూసుకోలేకపోతుంది.” అని కూడా అన్నారు. “మన రైతులు సంపన్నుకావాలని మేము కోరుకుంటున్నాము, దానికి అవసరమైన ప్రీ చర్య చేపదతాము.” అని కూడా శ్రీ మోదీ అన్నారు.

ప్రతిపక్షంపై ప్రధాని మోదీ దాడిచేస్తూ, ప్రతీ పార్టీ కూడా బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శాలు రాజకీయం చేస్తున్నాయి. కాని మేము డాక్టర్ అంబేద్కర్ చేసిన కార్యక్రమాల గురించి ప్రతి ఒక్కరికీ తెలియాలి." అని అనుకుంటున్నామని అన్నారు.

స్కాంపై ఉత్తరప్రదేశ్ పోరాడే సమయం వచ్చిందని శ్రీ మోదీ అన్నారు. స్కాం అంటే సమాజ్వాది పార్టీ, కాంగ్రెస్, అఖిలేష్ యాదవ్ మరియు మాయావతి. “ఇది స్కాంకు వ్యతిరేకంగా పోరాటం. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ప్రజలు స్కాం కావాలో లేదా అభివృద్ధికి కట్టుబడిన బీజేపి కావాలో తేల్చుకోవాలి. ఉత్తర ప్రదేశ్ కోసం సాధ్యం అయ్యే ప్రతిదీ చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాము.” అని  కూడా అన్నారు.

ఉత్తరప్రదేశ్ అభివృద్ధికోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని మార్చాలని శ్రీ మోదీ ప్రజలను కోరారు.

ఈ కార్యక్రమంలో అనేకమంది బిజెపి నాయకులు మరియు కార్యకర్తలు హాజరయ్యారు.