ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పట్నాలో శ్రీ గురు గోబింద్ సింగ్ జీ మహరాజ్ 350వ జయంతి ఉత్సవాలకు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఒక స్మారక తపాలా బిళ్ళను విడుదల చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రధాన మంత్రి శ్రీ మోదీ ప్రసంగిస్తూ గురు గోబింద్ సింగ్ జీ ఎంతో మంది ప్రజలకు ఏ విధంగా ప్రేరణనిచ్చారో ప్రపంచం తెలుసుకోవాలన్నారు. గురు గోబింద్ సింగ్ జీ తన బోధనలలో విజ్ఞానాన్ని కేంద్ర బిందువుగా చేసుకున్నారని, ఆయన తన ఆలోచనలు మరియు ఆదర్శాల ద్వారా ఎంతో మంది ప్రజలకు స్ఫూర్తిని అందించారని ప్రధాన మంత్రి చెప్పారు. ఆయన పరాక్రమానికి తోడు, గురు గోబింద్ సింగ్ జీ వ్యక్తిత్వంలో అభినందన యోగ్యమైన ఇతర అంశాలు ఉన్నాయని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. సంఘంలో ఏ రూపంలోనైనా వివక్షను గురు గోబింద్ సింగ్ జీ విశ్వసించలేదని, ప్రతి ఒక్కరిని సమానంగానే ఆయన చూశారని ప్రధాన మంత్రి శ్రీ మోదీ అన్నారు.

మద్యం ప్రభావం నుండి భావి తరాలను కాపాడడం కోసం బిహార్ ముఖ్యమంత్రి శ్రీ నితీశ్ కుమార్ చేస్తున్న కృషిని ప్రధాన మంత్రి అభినందించారు. దేశ అభివృద్ధిలో బిహార్ ప్రధాన పాత్రను పోషించగలుగుతుందని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు.

Click here to read full text speech