PM Modi congratulates ISRO scientists for successful launch of INSAT-3DR
Our space programme keeps making us proud with the exemplary achievements: PM
ISRO scientists have demonstrated top-notch skill, unparalleled dedication & remarkable determination: PM

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ భారతదేశానికి చెందిన జియోసింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ జిఎస్ఎల్ వి- ఎఫ్05 ను పదో సారి విజయవంతంగా ప్రయోగించిన భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఐఎస్ఆర్ఒ.. ఇస్రో) శాస్త్రవేత్త లను అభినందించారు. ఈ వెహికల్ ఆధునిక వాతావరణ ఉపగ్రహం ‘ఐఎన్ఎస్ఎటి-3డిఆర్’ ను మోసుకొనివెళ్లింది.

“మన అంతరిక్ష కార్యక్రమం మార్గదర్శకమైన విజయాలతో మనం గర్వించేటట్లు చేస్తోంది. ఐఎన్ఎస్ఎటి-3డిఆర్ సఫల ప్రయోగం ఎంతో ఆనందించవలసిన క్షణం.

ఐఎస్ఆర్ఒ శాస్త్రవేత్తలు మరొక్క మారు మొదటి రకం నైపుణ్యాన్ని, సాటిలేని సమర్పణ భావాన్ని, అసాధారణమైన దృఢ సంకల్పాన్ని ప్రదర్శించినందుకు వారికి ఇవే నా అభినందనలు” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.