Netaji Bose's valour played a major role in freeing India from colonialism: PM
Netaji Bose was a great intellectual who always thought about the interests & wellbeing of the marginalised sections of society: PM
Honoured that our Government got the opportunity to declassify files relating to Netaji Bose: PM Modi

నేతాజీ సుభాష్ చంద్ర బోస్ జయంతి సందర్భంగా ఆయనకు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్రణామాలు అర్పించారు.

“నేతాజీ సుభాష్ చంద్ర బోస్ జయంతి సందర్భంగా ఆయనకు నేను ప్రణమిల్లుతున్నాను. భారతదేశాన్ని వలసపాలన విధానం బారి నుండి విముక్తం చేయడంలో ఆయన పరాక్రమం ప్రధాన భూమికను పోషించింది.

నేతాజీ బోస్ ఒక గొప్ప మేధావి; సమాజంలోని అణగారిన వర్గాల వారి శ్రేయస్సును గురించి మరియు వారి ప్రయోజనాలను గురించి ఆయన ఎల్లప్పుడూ ఆలోచిస్తుండే వారు.

దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉండిపోయిన, ప్రజాదరణ పాత్రమైన కోర్కె అయినటువంటి నేతాజీ బోస్ కు సంబంధించిన ఫైళ్లను బహిర్గతపరచే అవకాశం మా ప్రభుత్వానికి లభించడం గౌరవప్రదం.

నేతాజీ సుభాష్ చంద్ర బోస్ కు సంబంధించిన ఫైళ్లు https://www.netajipapers.gov.in లో లభ్యమవుతున్నాయి” అని ప్రధాన మంత్రి అన్నారు.