PM Narendra Modi launches National SC/ST Hub and Zero Defect Zero Effect scheme
PM Modi distributes Charkhas to 500 women, views exhibits
Khadi is a priority for us. A Charkha at home brings more income: PM Modi
Bringing the poor to the economic mainstream of the country vital for the country’s progress: PM Modi
Earlier it was only 'Khadi for nation', now its also 'Khadi for fashion': PM Modi

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు పంజాబ్ లోని లుధియానా లో జాతీయ ఎస్ సి/ఎస్ టి కేంద్రాన్ని, ఇంకా ఎమ్ ఎస్ ఎమ్ ఇ ల కోసం జీరో డిఫెక్ట్- జీరో ఇఫెక్ట్ (జడ్ ఇ డి) స్కీమును ప్రారంభించారు. సూక్ష్మ, లఘు మరియు మధ్యతరహా సంస్థ (ఎమ్ ఎస్ ఎమ్ ఇ) ల కు జాతీయ అవార్డు లను కూడా ఆయన ప్రదానం చేశారు. కర్రతో చేసిన 500 సాంప్రదాయక చరఖాలను మహిళలకు ప్రధాన మంత్రి పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, లుధియానా ఒక ముఖ్యమైన ఆర్థిక కేంద్రం, అందువల్ల ఎమ్ ఎస్ ఎమ్ ఇ లకు ఒక పథకాన్ని ఈ నగరం నుండే ప్రారంభించడం సహజంగా ఉంది అన్నారు. ఎమ్ ఎస్ ఎమ్ ఇ రంగం భారతదేశ ఆర్థిక పురోగతికి కీలకమని ప్రధాన మంత్రి చెప్పారు. ఎమ్ ఎస్ ఎమ్ ఇ లు ప్రపంచ నాణ్యత నియంత్రణ ప్రమాణాలకు తుల తూగవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు.

చరఖాల పంపిణీని గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, ఖాదీ మనకు ఒక ప్రాథమ్యం, అలాగే ఇంట్లో చరఖా ఉంటే అధిక ఆదాయాన్ని తీసుకువస్తుందని చెప్పారు. ప్రస్తుతం ఖాదీని చక్కగా విక్రయించడం జరుగుతోందని, ఒక సమయంలో ‘దేశం కోసం ఖాదీ’ అనేది సరైన నినాదంగా ఉండిందని, కానీ ఇప్పుడు దీనిని ‘ఫ్యాషన్ కోసం ఖాదీ’ గా మార్చాలి అని ఆయన తెలిపారు.

దళితులలో ఔత్సాహిక పారిశ్రామికత్వ స్ఫూర్తి రాజుకొంటే మనకు మేలు కలుగుతుందని ప్రధాన మంత్రి అన్నారు. సంస్థలను నెలకొల్పాలని, ఉద్యోగాలను కల్పించాలన్న కలలు కంటున్న యువతీయువకులు ఉన్నారని కూడా ఆయన చెప్పారు.

దళితులలో ఔత్సాహిక పారిశ్రామికత్వ స్ఫూర్తి రాజుకొంటే మనకు మేలు కలుగుతుందని ప్రధాన మంత్రి అన్నారు. సంస్థలను నెలకొల్పాలని, ఉద్యోగాలను కల్పించాలన్న కలలు కంటున్న యువతీయువకులు ఉన్నారని కూడా ఆయన చెప్పారు.

Click here to read full text speech