ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తో స్వీడిష్ వ్యాపారవేత్తల ప్రతినిధివర్గం ఈ రోజు భేటీ అయింది. ఇండియా స్వీడన్ బిజినెస్ లీడర్స్ రౌండ్ టేబుల్ లో పాల్గొనడం కోసం న్యూ ఢిల్లీ కి వచ్చిన కొంత మంది సి ఇ ఒ లు కూడా ఈ ప్రతినిధివర్గంలో కలసి ఉన్నారు.

ప్రతినిధివర్గం సభ్యులకు ప్రధాన మంత్రి స్వాగతం పలికారు. రక్షణ రంగ తయారీ, సౌర శక్తి సహా స్వీడిష్ తయారీ సంస్థలకు దీర్ఘకాలిక వ్యాపార అవకాశాలు ఈ సందర్భంగా చర్చకు వచ్చాయి.