This budget session will be historic as it will see merger of the general and the rail budgets: PM
Hope budget session would be fruitful and all parties would debate on issues that would benefit the country: PM

పార్లమెంట్ 2017 సంవత్సర బడ్జెట్ సమావేశాలు ఈ రోజు నుండి ఆరంభం అవుతున్నాయి. ఈ సమావేశాలలో భాగంగా పార్లమెంట్ ను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం, బడ్జెట్ సమర్పణ లతో పాటు అనేక అంశాలపైన సమగ్ర చర్చ చోటు చేసుకోనున్నాయి.

ఇటీవలి కాలంలో రాజకీయ పక్షాలతో విడివిడిగా, సమష్టిగా చర్చలు జరిగాయి. విశాల ప్రజాహితాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సమావేశాలను నిర్మాణాత్మకమైన చర్చ కోసం వినియోగించుకోవాలి. అదే తరుణంలో, బడ్జెట్ పైన క్షుణ్ణమైన చర్చ జరగాలి.

మొట్టమొదటిసారిగా, కేంద్ర బడ్జెటును ఫిబ్రవరి 1వ తేదీ నాడు ప్రవేశపెట్టడం జరుగుతోంది. ఇంతకు ముందు కేంద్ర బడ్జెటును సాయంత్రం పూట 5 గంటలకు సమర్పించే వారు. అటల్ బిహారీ వాజ్ పేయి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత బడ్జెట్ ను సమర్పించే సమయాన్ని ఉదయం పూటకు మార్చడమైంది; బడ్జెటును పార్లమెంట్ సమావేశాలు మొదలైన వెంటనే సమర్పించారు.

మరొక కొత్త సంప్రదాయం కూడా ఈ రోజు నుండి అమలులోకి వస్తోంది. ఒక నెల ముందే బడ్జెట్ ను సమర్పిస్తున్నారు; అంతే కాకుండా, రైల్ బడ్జెటు ఇప్పుడు కేంద్ర బడ్జెటులో ఒక భాగమైంది. ఈ అంశంపై పార్లమెంట్ లో విస్తృత‌మైన‌ చర్చ జరగవచ్చు; అలాగే, ఈ నిర్ణయం నుండి అందే లాభాలు రానున్న రోజులలో కనిపించగలవు. అన్ని రాజకీయ పక్షాలు విశాల జనహితాన్ని ఆశించి, పార్లమెంట్ లో ఆరోగ్యకరమైన చర్చ జరగడంలో చేతులు కలుపుతాయన్న ఆశాభావంతో నేనున్నాను.