భారత ప్రభుత్వ కార్యదర్శుల బృందాలు రెండు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి విద్య, విపత్తుల నిర్వహణ లపై ఆలోచనలను నివేదించాయి.
ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు, నీతి ఆయోగ్ కు చెందిన అధికారులు కూడా పాల్గొన్నారు.
దీనితో, వేరు వేరు పాలన సంబంధిత అంశాలపైన ప్రస్తుత పరంపరలో మొత్తం తొమ్మిది సమర్పణలనూ నివేదించినట్లయింది.
ఈ సందర్భంగా ప్రధాన మంత్రి మాట్లాడుతూ, కొత్త ఆలోచనలను ఆహ్వానించడానికి, స్వీకరించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టంచేశారు. సమగ్ర దృక్పథంతో ఆలోచిస్తూ ఉండవలసిందిగాను మరియు నిర్దిష్ట ఫలితాల సాధనకు అగ్ర ప్రాధాన్యం ఇస్తూ ఉండవలసిందిగాను కార్యదర్శులకు ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేశారు.