PM Modi campaigns in Hardoi & Barabanki, urges people to elect a BJP Govt
SP, BSP and the Congress never thought welfare of people and always focused on political gains: PM
What is the reason that Uttar Pradesh tops the chart in the entire nation in crime rates? This must change: PM
Our Govt is committed to empower the poor: PM Modi

ఉత్తరప్రదేశ్ లోని హర్దోయి మరియు బారాబంకి జిల్లాల్లో భారీ బహిరంగ సభలలో నేడు ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. రాష్ట్రంలో ఎన్నికల మొదటి రెండు దశల్లో రికార్డు స్థాయిలో హాజరైన ప్రజలకు శ్రీ మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఉత్తరప్రదేశ్ అభివృద్ధి చెందినప్పుడు దేశం ప్రగతి మార్గంలో నడుస్తుందని కూడా ఆయన అన్నారు.

సమాజ్వాది పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ మరియు కాంగ్రెస్ లను ఉత్తరప్రదేశ్ నుండి తొలగిస్తే తప్ప, రాష్ట్ర అభివృద్ధి కాదని  శ్రీ మోదీ అభిప్రాయపడ్డారు. “ ప్రజల సంక్షేమం కోసం సమాజ్వాది పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీలు ఎప్పుడు ఆలోచించలేదు, రాజకీయ ప్రయోజనాలపైనే వారు దృష్టిపెట్టారు. ఇది మారాలి.” అని ఆయన అన్నారు.

సమాజ్వాది పార్టీలో ఖండిస్తూ, రాష్ట్రంలో నిరంతరం నేరాలు పెరుగుతున్నాయని శ్రీ మోదీ పేర్కొన్నారు. “పెరుగుతున్న నేర రేటు గురించి రాష్ట్ర ప్రభుత్వం కనీసం పట్టించుకుందా? చీకటిపడితే గృహాలనుండి బయటకు వెళ్ళడం సురక్షితం కాదని మహిళలు అనుకుంటున్నారు. నిజాయితీపరులు వేధింపులకు గురౌతున్నారు. నేర రేట్ల విషయంలో మొత్తం దేశంలో ఉత్తరప్రదేశ్ ముందుంది. ఆయుధాల చట్టం సంబంధించిన కేసుల్లో 50 శాతం యుపి ఒంటరిగా నమోదుచేస్తుంది.” అని ప్రధాని అన్నారు.

బిజెపి అధికారంలోకి వస్తే చిన్న వ్యవస్థాపకులు ప్రయోజనం కోసం అమలు చేస్తామని హామీయిస్తున్న వ్యాపార్ కళ్యాణ్ బోర్డు మరియు విశ్వకర్మ శ్రమ సమ్మాన్ యోజన గురించి ప్రధాని మోదీ మాట్లాడారు. ఎరువులు ధరలు తగ్గించేందుకు అవసరమైన చర్యలు గత ప్రభుత్వాలు తీసుకోలేదని అన్నారు. "చౌదరి చరణ్ సింగ్ జీ ఉన్నప్పుడు, ఎరువుల ధరలు తగ్గించారు. ఆయన స్ఫూర్తితో, రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ, ఎరువులు ధరలు తగ్గించేందుకు చర్యలు తీసుకున్నాము. మరే ఇతర ప్రభుత్వమూ ఇటువంటి చర్యలు చేపట్టలేదు.” అని ప్రధాని అన్నారు.

యూరియా వేప పూత గురించి మరియు అది ద్వారా అనేక రైతులకు ఎలా లబ్ధిచేకూరుస్తుందో శ్రీ మోదీ సుదీర్ఘంగా మాట్లాడారు. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన యొక్క వివిధ కోణాలు గురించి ప్రధాని వివరించారు. ఇది ఎన్నడూ లేని విధంగా చాలా సమగ్రమైన పంటల బీమా అని కూడా అన్నారు.

గ్రేడ్ 3 మరియు 4 ఉద్యోగాలలో అవినీతిని అరికట్టేందుకే తమ  ప్రభుత్వం ఇంటర్వ్యూలను లేకుండా చేసిందని ప్రధాని మోదీ అన్నారు. “గతంలో గ్రేడ్ 3 మరియు 4 ఉద్యోగాలకు లంచాలు తీసుకునేవారు. అందుకే ఇంటర్వ్యూలో ప్రక్రియలు దూరం చేశాము. ఇది అవినీతిని అరికట్టగలిగింది. 125 కోట్ల భారతీయుల దీవెనలు వల్లే నల్లధనం, అవినీతికి వ్యతిరేకంగా నేను పోరాడగల్గుతున్నానని “ కూడా ఆయన అన్నారు.

 పేదల సాధికారతకు బిజెపి కట్టుబడి ఉందని ప్రధాని మోదీ  చెప్పారు. “సమాజం నుండి అవినీతిని రూపుమాపకుండా పేదల సాధికారత సాధ్యంకాదు,” అని శ్రీ మోదీ అన్నారు. చికిత్స ఖర్చులు తగ్గడం ద్వారా నేరుగా ప్రజలకు ప్రయోజనంకరం అయ్యేలా స్టెంట్ ధరలను కేంద్రం తగ్గించిందని ప్రధాని మోదీ అన్నారు.

ఉత్తరప్రదేశ్ అదృష్టం మారేలా ఈ ఎన్నికలలో బిజెపికి ఓటు వేయాలని శ్రీ మోదీ కోరారు. అనేకమంది పార్టీ కార్యకర్తలు మరియు నాయకులూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

పూర్తి ప్రసంగం చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి