Relationship between India and the Kyrgyz Republic is filled with goodwill from centuries of shared historical links: PM
We regard Kyrgyz Republic as a valuable partner in making Central Asia a region of sustainable peace, stability and prosperity: PM
We will work to strengthen bilateral trade & economic linkages, facilitate greater people-to-people exchanges: PM to Kyrgyz President
We shall give special emphasis to youth exchanges in our technical and economic cooperation programme with Kyrgyz Republic: PM

శ్రేష్ఠుడైన కిర్గిస్తాన్ గణతంత్రం అధ్యక్షులు శ్రీ అల్ మజ్ బెక్ అటాంబాయెవ్‌,

సోదర సోదరీమణులారా,

ప్రసార మాధ్యమాల స‌భ్యులారా,

భార‌త‌దేశాన్ని మొద‌టిసారి సంద‌ర్శిస్తున్న ప్రెసిడెంట్ శ్రీ అల్ మజ్ బెక్ అటాంబాయెవ్‌ కు స్వాగ‌తం ప‌ల‌క‌డం నాకు ఎంత‌గానో ఆనందంగా వుంది. ఎక్స్ లెన్సీ, గ‌త సంవ‌త్స‌రం జులై లో నేను కిర్గిస్తాన్ గణతంత్రంలో ప‌ర్య‌టించిన‌ప్పుడు మీరు ఏర్పాటు చేసిన స్వాగ‌త స‌త్కారాలు,ఆతిథ్యం ఇంకా నా మ‌న‌స్సులో తాజాగానే మెదులుతున్నాయి. ఈ మీ భార‌త‌దేశ ప‌ర్య‌ట‌న ఇరు దేశాల మ‌ధ్య‌ ఉన్న స‌హ‌కారాన్ని మ‌రింత ముందుకు తీసుకుపోవ‌డ‌మే కాకుండా ఉన్న‌త‌ స్థాయిలో సంబంధాల్ని బ‌లోపేతం చేస్తుంది. ఇరు దేశాల మ‌ధ్య‌ శ‌తాబ్దాల త‌ర‌బ‌డి చరిత్రాత్మ‌క బంధాలు కొన‌సాగ‌డానికి కార‌ణం ఇరు దేశాల మ‌ధ్య‌ ఉన్న ప‌ర‌స్ప‌ర విశ్వాసం. ఇదే ప్ర‌స్తుతం ఇరు దేశాల సంబంధ బాంధ‌వ్యాల‌కు మూలం. ఇరు దేశాల స‌మాజాలలో అతిథుల‌ను అక్కున చేర్చుకునే గుణం ఉంది.. ఇదే మ‌ధ్యాసియాలో మ‌న దేశాల బంధాలు పెర‌గడానికి కార‌ణం. ఆ విధంగా కిర్గిస్తాన్ గణతంత్రంతో భార‌త‌దేశం బంధాన్ని నెల‌కొల్పుకొంది. ప్ర‌జాస్వామ్య విలువలు, సంప్ర‌దాయాలలో ఉమ్మ‌డిగా ఉన్న న‌మ్మ‌కాలు ఇరు దేశాలను ఒక చోటుకు చేరుస్తున్నాయి. కిర్గిస్తాన్ గణతంత్రంలో ప్ర‌జాస్వామ్య పునాదుల నిర్మాణంలో, వాటిని బ‌లోపేతం చేయ‌డంలో అధ్యక్షులు శ్రీ అటాంబాయెవ్ కృషి ఎంత‌గానో ఉంది.

స్నేహితులారా,

ఇరు దేశాల మ‌ధ్య‌ గ‌ల ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించిన పూర్తి స్థాయి ప‌రిధి గురించి అధ్యక్షులు శ్రీ అటాంబాయెవ్, నేను విస్తృతంగా చ‌ర్చ‌లు జరిపాము. ఇరు దేశాల ఉమ్మ‌డి ప్రాధాన్య‌మైన ద్వైపాక్షిక సంబంధాల‌పైన మేము దృష్టి పెట్టి, వీటిని విస్త‌రించ‌డంపైన‌, బ‌లోపేతం చేయ‌డంపైన చ‌ర్చించాము. ఇరు దేశాల యువ‌త‌, స‌మాజం ఎదుర్కొంటున్న ఉమ్మడి స‌వాళ్లు ఉగ్ర‌వాదం, తీవ్ర‌వాదం. వీటి నుండి బయట‌పడ‌డానికి ఇరు దేశాలు క‌లిసి చేయాల్సిన కృషిని గురించి చ‌ర్చించ‌డం జ‌రిగింది. ఇరు దేశాలుగా ఉమ్మ‌డిగా ల‌బ్ధి పొంద‌డానికి వీలుగా ఈ స‌వాళ్ల‌ను అధిగ‌మించ‌డానికిగాను ఒక‌రికొక‌రం స‌హ‌క‌రించుకోవాల‌ని నిర్ణ‌యించాము. మ‌ధ్యాసియా శాంతి, స్థిర‌త్వం, సౌభాగ్యంతో విల‌సిల్లాల‌నే ఉమ్మ‌డి ల‌క్ష్యం ఇరు దేశాలకు ఉంది. దీనిని సాధించే కార్య‌క్ర‌మంలో కిర్గిస్తాన్ గణతంత్రం ఎంతో విలువైన భాగ‌స్వామి అన‌డంలో సందేహం లేదు. ఈ అంశాల‌పైన ఇరు దేశాలు క‌లిసి ప‌నిచేయ‌డానికి కావ‌ల‌సిన విలువైన విధివిధానాల‌ను శాంగ్ హాయీ సహ‌కార సంస్థ రూపొందిస్తుంది.

స్నేహితులారా,

ర‌క్ష‌ణ రంగంలో ఇరు దేశాల స‌హ‌కారం ఏ స్థితిలో ఉందో అధ్యక్షులు శ్రీ అటాంబాయెవ్, నేను క‌లిసి స‌మీక్షించాము. కిర్గిజ్‌- ఇండియా మౌంటెయిన్ బ‌యో మెడిక‌ల్ రీసెర్చ్ సెంట‌ర్ అనేది ఇరు దేశాల మ‌ధ్య‌ గ‌ల విజయ‌వంత‌మైన భాగ‌స్వామ్యానికి నిద‌ర్శ‌నంగా నిలుస్తోంది. ప‌రిశోధ‌నా కార్య‌క్ర‌మంలో మేలు చేకూర్చే కేంద్రంగా ఇది నిరూపించుకొంది. దీనిని మ‌నం మ‌రింత బోల‌పేతం చేయాలి. కిర్గిస్తాన్ గణతంత్రంలో కిర్గిజ్- ఇండియా జాయింట్ మిలిట‌రీ ట్రెయినింగ్ సెంట‌ర్ కు సంబంధించిన ప‌నిని మ‌నం మొద‌లుపెట్టాము. ఉగ్ర‌వాదానికి వ్య‌తిరేకంగా ఇరు దేశాలు క‌లిసి ఉమ్మ‌డిగా నిర్వ‌హించే మిలిట‌రీ క‌వాతులు ఇప్పుడు ప్ర‌తి ఏటా కొన‌సాగుతాయి. దీనికి సంబంధించిన త‌దుప‌రి కార్య‌క్ర‌మం వ‌చ్చే సంవ‌త్స‌రం మొద‌టి భాగంలో కిర్గిస్తాన్ గణతంత్రంలో నిర్వ‌హించ‌డం జ‌రుగుతుంది.

స్నేహితులారా,

ఇరు దేశాలు క‌లిసి ఆర్ధిక రంగ బంధాన్ని మ‌రింత బలోపేతం చేయాల్సిన ఆవ‌శ్య‌క‌త ఎంతైనా ఉంద‌నే విష‌యాన్ని అధ్యక్షులు శ్రీ అటాంబాయెవ్, నేను మా చ‌ర్చ‌లలో అంగీక‌రించాము. ఇందుకోసం ద్వైపాక్షిక వాణిజ్య‌,ఆర్ధిక బంధాల‌ను ప్రోత్సహించాల‌ని, ప్ర‌జ‌ల‌కు- ప్ర‌జ‌ల‌కు మ‌ధ్య‌ రాక‌పోక‌లను అత్య‌ధికం చేయాల‌ని నిర్ణ‌యించ‌డం జ‌రిగింది. ఆరోగ్య భ‌ద్ర‌త‌, ప‌ర్యాట‌కం, స‌మాచార సాంకేతిక‌త‌, వ్య‌వ‌సాయం, గ‌నులు, ఇంధ‌న రంగాల్లో ఉన్న అవ‌కాశాల‌ను స‌రిగా వినియోగించుకొనే విష‌యంలో పారిశ్రామిక‌, వ్యాపార వ‌ర్గాల‌ను ఇరు దేశాల ప్రోత్సాహిస్తాయి. అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో ఇరు దేశాల మ‌ధ్య‌ స‌హ‌కారాన్ని ముఖ్యంగా సామ‌ర్థ్య నిర్మాణం, శిక్ష‌ణ అంశాల్లో పెంపొందించుకోవాల‌ని మేం నిర్ణ‌యించాము. వీటిలో ప్ర‌జల పాత్ర అత్య‌ధికంగా వుంటుంది. కిర్గిస్తాన్ గణతంత్రంతో భారత‌దేశానికి ఉన్న సాంకేతిక‌, ఆర్ధిక స‌హ‌కార కార్య‌క్ర‌మాలలో ఇరు దేశాల యువ‌త రాక‌పోక‌ల‌కు ప్ర‌త్యేక ప్రాధాన్య‌మివ్వ‌డం జ‌రుగుతుంది. ఈ రోజు ఇరు దేశాల మ‌ధ్య‌ ఏర్ప‌డిన అవ‌గాహ‌న ప్ర‌కారం ఉభయ దేశాలు చేప‌ట్టిన స‌హ‌కార కార్య‌క్ర‌మాలకు త‌ప్ప‌కుండా ఊపు వ‌స్తుంది. మ‌ధ్యాసియా ప్రాంతాన్ని తీసుకుంటే, ఇక్క‌డ మొట్ట‌మొద‌టిసారిగా భార‌త‌దేశం కిర్గిస్తాన్ గణతంత్రంతో లంకెను ఏర్పాటు చేసుకొని టెలీ మెడిసిన్ కార్య‌క్ర‌మాన్ని గ‌త సంవ‌త్స‌రమే మొద‌లుపెట్ట‌డమైంది. కిర్గిస్తాన్ గణతంత్రంలోని ప‌లు ప్రాంతాల‌కు ఈ కార్య‌క్ర‌మాన్ని విస్త‌రించడానికి మేము ప‌లు చ‌ర్య‌లు చేపడుతున్నాము.

స్నేహితులారా,

ఇరు దేశాల మ‌ధ్య‌ దౌత్య సంబంధాలు ఏర్ప‌డి వ‌చ్చే సంవ‌త్స‌రం మార్చి నాటికి 25 సంవ‌త్స‌రాల‌వుతుంది. ఈ మైలురాయిని స‌మీపిస్తున్న త‌రుణంలో అధ్యక్షులు శ్రీ అటాంబాయెవ్ భార‌త‌దేశాన్ని సంద‌ర్శింిచడమనేది ఇరు దేశాల మ‌ధ్య‌ భాగ‌స్వామ్యాన్ని మ‌రింత బ‌లోపేతం చేయ‌డానికి తోడ్పడగలుగుతుంది. ఈ ప‌ర్య‌ట‌న కార‌ణంగా ఇరు దేశాలు క‌లిసి ఈ మ‌ధ్య‌ సాధించిన ఫ‌లితాలు మ‌రింత బ‌లోపేతంు అవుతాయి. అంతే కాదు, రానున్న రోజులలో రెండు దేశాల మ‌ధ్య‌ బంధాలు మ‌రింత దృఢ‌మ‌వుతాయి. అధ్యక్షులు శ్రీ అటాంబాయెవ్ భార‌త‌దేశ ప‌ర్య‌ట‌న ఆయ‌న స‌దా స్మ‌రించుకొనే జ్ఞాప‌కంగా మిగ‌లాల‌ని, మంచి ఫ‌లితాల‌ను ఇవ్వాల‌ని నేను అభిల‌షిస్తున్నాను.

మీకు ఇవే నా ధన్యవాదాలు.

మరీ మరీ ధన్యవాదాలు.