PM Narendra Modi condoles unfortunate accident in Reasi, Jammu and Kashmir

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జమ్ము-కశ్మీర్ లోని రియాసీ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణ నష్టం సంభవించినందుకు సంతాపం తెలిపారు.

“జమ్ము-కశ్మీర్ లోని రియాసీ లో జరిగిన దురదృష్టకర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాల శోకంలో నేను పాలుపంచుకుంటున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.