We greet the Election Commission and salute their important role in our democracy: PM on Voters' Day
Elections are celebrations of democracy. They communicate the will of the people, which is supreme in a democracy: PM

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ దేశ పౌరులకు జాతీయ వోటర్ల దిన శుభాభినందనలను తెలియజేశారు. ఎన్నికలను ప్రజాస్వామ్యంలో వచ్చే పండుగ రోజులుగా ఆయన అభివర్ణిస్తూ, అర్హత కలిగిన ప్రతి ఒక్క వోటరు వారి వోటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞ‌ప్తి చేశారు. అలాగే, యువజనులు వారికి 18 ఏళ్ల వయస్సు రావడంతోనే వోటర్లుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని కూడా ప్రధాన మంత్రి యువజనులకు పిలుపునిచ్చారు.

“జాతీయ వోటర్ల దిన సందర్భంగా మీ అందరికీ అభినందనలు. మనం ఎన్నికల సంఘాన్ని అభినందిద్దాం. మన ప్రజాస్వామ్యంలో వారు పోషిస్తున్న ముఖ్యమైన పాత్రకుగాను వారికి నమస్కారిద్దాం.

ఎన్నికలనేవి ప్రజాస్వామ్యంలో పండుగల మాదిరిగా జరుపుకోవలసిన సంబరాలు. అవి ప్రజల అభిలాషను వ్యక్తం చేస్తాయి. ప్రజాస్వామ్యంలో ప్రజాభిలాషయే సర్వోన్నతమైనటువంటిది.

నేను ప్రతి ఒక్క వోటరు.. అతడికి లేదా ఆమెకు.. ఉన్న వోటు వేసే హక్కును వినియోగించుకోవలసిందిగా విజ్ఞ‌ప్తి చేస్తున్నాను. అలాగే, నా యువ మిత్రులకు.. వారికి 18 ఏళ్లు రావడంతోనే వోటర్లుగా పేర్లు నమోదు చేసుకోవలసిందిగా కూడా.. పిలుపు ఇస్తున్నాను” అని ప్రధాన మంత్రి తమ సందేశంలో పేర్కొన్నారు.