జాతీయ దినోత్సవం సందర్భంగా, ఛైనా ప్రజలందరికీ శుభాకాంక్షలు ” అని ప్రధాన మంత్రి శ్రీ నరే౦ద్ర మోదీ తన సందేశంలో పేర్కొన్నారు.
ఇరు దేశాల మధ్య ఉన్న స్నేహ బాంధవ్యం ఈనాటిది కాదని, ఆధ్యాత్మికత, నేర్చుకోవడం, కళ, వాణిజ్యం, ఇరు దేశాల ప్రజలు ఒకరి నొకరు గౌరవించుకునే తీరు అభినందనీయమని ప్రధానమ౦త్రి శ్రీ నరే౦ద్ర మోదీ తన సందేశంలో పేర్కొన్నారు. చైనా, భారత్‌లు ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలని, ప్రపంచ మార్పులో ఈ రెండు దేశాలు నిర్మాణాత్మక పాత్ర పోషించాలని, ఒకరి విజయాలు మరొకరికి స్పూర్తిగా నిలవాలని ఆశాభావ౦ వ్యక్త౦ చేశారు. ప్రపంచమంతా ఆసియా ఖండం వైపు చూస్తున్నదని, ఆసియా సుస్థిరత, శాంతికి భారత్-చైనా మధ్య సంబంధాలు మరింత దోహదపడతాయని ప్రధాని అన్నారు. అధ్యక్షుడు జీ, ప్రధానమ౦త్రి( ప్రీమియర్) లీ తో ఇదే విధమైన అనుబ౦ధ౦ భవిష్యత్తులో కొనసాగాలనుకు౦టున్నట్లు ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇటీవలి కాలంలో మేము మా స్నేహ బ౦ధాలను విశ్వ వర్ణపటంలో బలపర్చుకొన్నా౦ , ప్రజలలో పరస్పర విశ్వాసం , భరోసా కల్పి౦చి, ఇరు ప్రజల మధ్య సంబంధాలు మరి౦త బలపరిచే దిశగా కృషి చేస్తున్నట్లు, ఆ దిశగా మా ప్రయత్నాలు కొనసాగుతాయని ప్రధానమ౦త్రి అన్నారు.