PM Modi attends function for the release of book ‘Citizen and Society,’ written by Vice-President Hamid Ansari
India should be proud to be a country of so many dialects and languages, and so many different faiths, living in harmony: PM Modi
Technology has converted citizens into netizens: PM Modi

ఉప రాష్ట్రపతి శ్రీ హమీద్ అన్సారీ రచించిన “సిటిజన్ అండ్ సొసైటీ” (పౌరుడు మరియు సమాజం) అనే పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు పాల్గొన్నారు. ఈ పుస్తకాన్ని రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి భవన్ లో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ఉప రాష్ట్రపతిని ఆయన ఆలోచనలను పుస్తక రూపంలో భవిష్యత్ తరాలకు అందించినందుకు అభినందించారు.

ఈ రోజుల్లో సాంకేతిక విజ్ఞానం సిటిజన్ లను నెటిజన్ లుగా మార్చివేసిందని, సంప్రదాయిక సరిహద్దులు చెరిగిపోతున్నాయన్నారు. అయితే, భారతదేశంలో పౌరులకు, సమాజానికి నడుమ “కుటుంబం” అనే వ్యవస్థ ఉందని, అదే మన అతి పెద్ద బలం అని ప్రధాన మంత్రి అన్నారు.

అనేక మాండలికాలు, భాషలు, పలు విశ్వాసాలు ఉన్నప్పటికీ అందరం సామరస్యంతో ఉంటున్నందుకు భారతదేశం గర్వించాలని ప్రధాన మంత్రి అన్నారు. పౌరులు అందరి సహకారంతో ఇది సాధ్యమైందని ప్రధాన మంత్రి చెప్పారు.