శ్రేష్ఠులారా, స్నేహితులారా,
నా ప్రసంగం ఆరంభంలో.. పోర్చుగల్ దేశ మాజీ అధ్యక్షుడు, మాజీ ప్రధాని, ఆ దేశానికి చెందిన ప్రముఖ నేత, పేరెన్నికగన్న రాజనీతిజ్ఞుడు శ్రీ మారియో సోరెస్ కన్నుమూత సందర్భంగా పోర్చుగల్ ప్రజలకు, పోర్చుగల్ ప్రభుత్వానికి నా ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను. భారతదేశానికి, పోర్చుగల్ కు మధ్య దౌత్య సంబంధాల పునరుద్ధరణలో శ్రీ సోరెస్ కీలక పాత్రను పోషించారు. ఈ దు:ఖ సమయంలో భారతదేశం పోర్చుగల్ వెంట నిలుస్తోంది.
యువర్ ఎక్స్ లెన్సీ, సురినామ్ ఉపాధ్యక్షులు శ్రీ మైఖేల్ అశ్విన్ ఆదిన్,
యువర్ ఎక్స్ లెన్సీ పోర్చుగల్ ప్రధాన మంత్రి డాక్టర్ ఏంటోనియో కోస్టా,
కర్నాటక గవర్నర్, శ్రీ వజుభాయ్ వాలా
కర్నాటక ముఖ్యమంత్రి, శ్రీ సిద్ధరామయ్య గారు
గౌరవనీయ మంత్రులారా,
దేశ విదేశాలనుంచి వచ్చిన అతిథులారా,
అన్నిటికన్నా ముఖ్యంగా.. ప్రపంచవ్యాప్తంగా వున్న ప్రవాసీ భారతీయులారా
పధ్నాలుగవ ప్రవాసీ భారతీయ దివస్ సందర్భంగా మీకందరికీ స్వాగతం పలుకుతున్నందుకు నాకెంతో ఆనందంగా ఉంది. ఇక్కడకు చేరుకోవడానికి సుదూర ప్రాంతాల నుండి వేల సంఖ్యలో తరలివచ్చారు. డిజిటల్ వేదికల ద్వారా లక్షలాది మంది ఈ సమావేశంతో అనుసంధానమై ఉన్నారు.
భారతదేశానికి చెందిన ప్రఖ్యాత ప్రవాస భారతీయుడు మహాత్మ గాంధీ తిరిగి భారతదేశానికి వచ్చిన రోజు ఈ రోజు. ఈ సందర్భంగా ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం.
एक ऐसा पर्व है जिस में एक प्रकार से host भी आप है, तथा guest भी आप ही हैं यह पर्व एक राष्ट्र का उसकी विदेश में रहने वाली संतान से मिलन का पर्व है | इस event की असली पहचान और शान आप है | आप का इस पर्व में सम्मिलित होना हमारे लिए बहुत गर्व की बात है| आप सब का तहे दिल से स्वागत है |
సుందరమైన బెంగళూరు నగరంలో మనం ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమ నిర్వహణలో, నిర్వహణ కోసం సహాయం చేసినందుకు, అంతేకాకుండా ఇది విజయవంతం అయ్యేందుకు కృషి చేసినందుకు ముఖ్యమంత్రి శ్రీ సిద్ధరామయ్య గారికి అభినందనలు తెలియజేస్తున్నాను.
శ్రేష్ఠులు పోర్చుగల్ ప్రధానికి, సురినామ్ ఉపాధ్యక్షులకు, మలేసియా, మారిషస్ లకు చెందిన గౌరవనీయ మంత్రులకు ఆహ్వానం పలకడం నాకు ఎంతగానో సంతోషంగా ఉంది.
వారు సాధించిన విజయాలు వారి దేశాలలోను, విదేశాలలోను వారు సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతులు మనకందరికీ చాలా స్ఫూర్తిదాయకం. అంతే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు సాధించిన విజయాలు, చేపట్టిన కార్యక్రమాలు, వారి పేరు ప్రఖ్యాతులను ఈ సమావేశం ప్రతిఫలిస్తోంది.
విదేశాలలో దాదాపుగా 30 మిలియన్ మంది భారతీయులు నివసిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ప్రాంతంలో వారు నివసిస్తున్నారు.
విదేశాల్లో నివసిస్తున్న భారతీయుల గొప్పదనం వారి సంఖ్యలో లేదు. వారు భారతదేశ ప్రగతికి, వారు నివసిస్తున్నటువంటి సమాజాల, దేశాల ప్రగతికి చేస్తున్న కృషి కారణంగానే వారికి గౌరవం దక్కుతోంది. ప్రవాస భారతీయుల ఏ వృత్తుల్లో ఉన్నప్పటికీ, ఏ లక్ష్యాల కోసం కృషి చేస్తున్నప్పటికీ.. వారు భారతదేశ సంస్కృతిని, సంప్రదాయాలను, విలువలకు ప్రతినిధులుగా నిలుస్తున్నారు. కష్టపడే స్వభావంతో, క్రమశిక్షణతో వ్యవహరిస్తూ తాము నివసిస్తున్న దేశాల చట్టాలను గౌరవిస్తూ శాంతిని కోరుకొనే స్వభావంతో.. ఆయా దేశాల సమాజాలలోని ఇతర దేశాల ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
आप की प्रेरणा कई, उद्देश्य अनेक, मार्ग विभिन्न, मंजिलें तमाम लेकिन भाव एक -भारतीयता। प्रवासी भारतीय जहां रहे उसे कर्मभूमि माना,जहां से आए उसे मर्मभूमि माना। प्रवासी भारतीय जहां रहे वहां का विकास किया और जहां के हैं वहां भी असीम योगदान किया।
స్నేహితులారా, నా ప్రభుత్వానికి, వ్యక్తిగతంగా నాకూ ప్రవాస భారతీయులతో స్నేహ సంబంధాలనేవి చాలా ముఖ్యమైనవి. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, యుఎఇ, కతర్, సింగపూర్, ఫిజీ, చైనా, జపాన్, దక్షిణ కొరియా, కెన్యా, మారిషస్, సెషేల్స్, మలేసియా, ఇంకా ఇతర దేశాలలో పర్యటించిన సందర్భంగా వేలాది ప్రవాస భారతీయులైన నా సోదర సోదరీమణులను కలుసుకొన్నాను. వారితో మాట్లాడాను.
ప్రవాస భారతీయులను చేరుకోవడానికి ఒక పద్ధతి ప్రకారం సుస్థిరంగా చేసిన కృషి కారణంగా భారతదేశ సామాజిక, ఆర్ధిక మార్పులో భాగం కావడానికి ప్రవాస భారతీయులు ఎంతో చురుకుగా, మరెంతో నూతనోత్తేజంతో ముందుకు వస్తున్నారు.
ప్రవాస భారతీయులు ప్రతి ఏడాది 69 బిలియన్ డాలర్ల విదేశీ ద్రవ్యాన్ని భారతదేశానికి అందిస్తున్నారు. భారతదేశ ఆర్ధిక రంగానికి ఇది అమూల్యమైన సేవ.
प्रवासी भारतीयों में देश के विकास के लिए अदम्य इच्छाशक्ति है; वे देश की प्रगति में एक स्टेकहोल्डर है हमारी विकास यात्रा में आप हमारे एक VALUABLE PARTNER हैं। भारत के BRAIN DRAIN को BRAIN GAIN में बदलने के हमारे प्रयासों में आप सहभागी है।
ప్రవాస భారతీయులు, భారత సంతతికి చెందని వారు తమ తమ రంగాలలో అసాధారణమైన కృషి చేస్తున్నారు.
వారిలో పేరొందిన రాజకీయ నాయకులు ఉన్నారు. ప్రసిద్ధి చెందిన శాస్త్రవేత్తలు, వైద్యులు, ఎంతో తెలివైన విద్యావేత్తలు, ఆర్ధిక వేత్తలు, సంగీతవిద్వాంసులు, ప్రసిద్ధి చెందిన దానశీలులు, పత్రికారచయితలు, బ్యాంకర్లు, ఇంజినీయర్లు, న్యాయవాదులు ఉన్నారు. ఈ జాబితాలో సమాచార సాంకేతిక విజ్ఞాన నిపుణుల పేరు ప్రస్తావించలేదా?.. అయితే నన్ను క్షమించండి. రేపు రాష్ట్రపతి చేతుల మీదుగా 30 మంది ప్రవాస భారతీయులు ప్రతిష్టాత్మక ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డులను స్వీకరించనున్నారు. వారు భారతదేశంలోను, విదేశాలలోను వివిధ రంగాలలో చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డులను ఇవ్వడం జరుగుతోంది.
స్నేహితులారా, విదేశాలలో నివసిస్తున్నవారి నేపథ్యం, వారు చేపట్టిన వృత్తితో సంబంధం లేకుండా వారి సంక్షేమానికి, భద్రతకు భారతదేశం ప్రధాన ప్రాధాన్యతనిస్తోంది. ఇందుకోసం పరిపాలన పరమైన వాతావరణాన్ని బలోపేతం చేస్తున్నాం. పాస్ పోర్టులు పోగొట్టుకున్నప్పుడు, న్యాయ సహాయం కావాల్సి వచ్చినప్పుడు, వైద్య సహాయం అవసరమైనప్పుడు, నివాసం కావాల్సి వచ్చినప్పుడు.. చివరకు ఎవరైనా చనిపోయిన సందర్భాలలో పార్ధివ దేహాలను భారతదేశానికి తెప్పించడంలో చురుకుగా వ్యవహరించాలని, ప్రవాస భారతీయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని విదేశాలలోని భారతీయ రాయబార కార్యాలయాన్నింటికీ నేను ఆదేశాలు ఇచ్చాను.
ప్రవాస భారతీయుల పట్ల భారతదేశ బాధ్యత అనేది ఎలా ఉంటుందంటే అది వారిని చేరుకోవడానికి ఏం చేయాలనే దాని పైనా, సమస్య సున్నితత్వం పైనా, వేగం పైనా, పక్కాగా వ్యవహరించే తీరు పైనా ఆధారపడి ఉంటుంది. ఇందుకోసం రోజుకు 24 గంటల చొప్పున- అంటే అన్ని వేళలా- పని చేసే హెల్ప్ లైన్ లను ఆయా రాయబార కార్యాలయాలలో అందుబాటులో ఉంచడం జరిగింది. ప్రవాస భారతీయుల కోసం ఓపెన్ హౌస్ సమావేశాలు, దౌత్య కార్యాలయాల శిబిరాలను ఏర్పాటు చేయడం, పాస్‌పోర్టు పరమైన సేవలను అందించడానికి ట్విటర్ సేవా, సామాజిక మాధ్యమాల వేదికలను ఉపయోగించుకొని వేగంగా చేరుకోవడం.. మొదలైన చర్యలను చేపట్టడం ద్వారా ప్రవాస భారతీయుల కోసం భారతదేశం శ్రమిస్తోందనే స్పష్టమైన సందేశాన్ని ఇవ్వడం జరిగింది.
విదేశాలలో ఉన్న భారతీయుల భద్రత మాకు చాలా ముఖ్యం. విదేశాలలో భారతీయులు ఏదైనా ఆపదలో పడితే వారిని వెంటనే చేరుకోవడం ద్వారా వారికి భద్రత కల్పిస్తున్నాం. ఆ తరువాత వారిని రక్షించి తిరిగి స్వస్థలాలకు పంపుతున్నాం. మన విదేశీ వ్యవహారాల మంత్రి శ్రీమతి సుష్మ స్వరాజ్ గారు చాలా చురుకుగా వ్యవహరిస్తూ ప్రమాదంలో పడ్డ వారిని సామాజిక మాధ్యమం ద్వారా వెంటనే చేరుకుంటూ సహాయం చేస్తున్నారు.
గత సంవత్సరం జులై నెలలో చేపట్టిన సంకట్ మోచన్ ఆపరేషన్ ద్వారా దక్షిణ సూడాన్ నుండి 150 మంది భారతీయులను 48 గంటలలో రక్షించి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించగలిగాము. అంతకంటే ముందు.. చక్కటి సమన్వయంతో, చాలా వేగంగా, ఎలాంటి ఒడుదొడుకులకు తావు లేకుండా వ్యవహరించి యెమెన్ లో ఏర్పడ్డ సంక్షోభ పరిస్థితుల నుండి వేలాది భారతీయులను రక్షించడం జరిగింది. గత రెండు సంవత్సరాలలో, అంటే 2014-2016 మధ్య 54 దేశాల నుండి 90 వేల మందికి పైగా భారతీయులను రక్షించి వారిని వారి స్వస్థలాలకు తరలించడం జరిగింది. ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ ఫండ్ ద్వారా విదేశాలలో విపత్కర పరిస్థితుల్లో ఉన్న 80 వేల మంది భారతీయులకు ఆర్ధిక సహాయాన్ని అందించడం జరిగింది. విదేశాలలోని భారతీయులు ఎవరికైనా సరే .. వారు మాతృభూమికి దూరంగా లేరనే భావన వారిలో కలగజేయడమే మా లక్ష్యం. విదేశాలలో ఆర్ధికపరమైన అవకాశాలను
అందిపుచ్చుకోవడానికి కృషి చేస్తున్నవారికి వీలయినన్ని సౌకర్యాలను కల్పించి ఎలాంటి అసౌకర్యం లేకుండా చేయడానికి భారతదేశం కృషి చేస్తోంది. సురక్షితంగా, చక్కటి శిక్షణతో విదేశాలకు వెళ్లండి అనేది మా ఉద్దేశం. ఇందుకు అనుగుణంగా పని చేసేలా మా వ్యవస్థలను రూపొందించుకున్నాము. విదేశాలకు వెళ్లే కార్మికుల భద్రత కోసం అనేక చర్యలను చేపట్టడం జరిగింది. విదేశాలలో ఉపాధి కల్పన పొందేందుకు వీలుగా గుర్తింపు పొందిన రిక్రూట్ మెంట్ ఏజెంట్ ల ద్వారా ఆరు లక్షల కార్మికులకు ఎమ్మిగ్రేషన్ క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. ఉపాధి కల్పన సంస్థలు మన ఇ-మైగ్రేట్ పోర్టల్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి చేయడం జరిగింది.
అంతేకాకుండా ప్రవాస భారతీయ కార్మికుల సమస్యలు, ఫిర్యాదులు, అభ్యర్థనలు ఈ-మైగ్రేట్, మదద్ (MADAD) ఆన్లైన్ వేదికల ద్వారా పరిష్కార ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. అలాగే స్వదేశంలో చట్టవిరుద్ధ నియమాక ఏజెంట్ల మీద కఠిన చర్యలు తీసుకుంటూనే ఉన్నాం. చట్టవిరుద్ధ ఏజెంట్ల మీద కేసుల నమోదుకు-విచారణకు సీబీఐ, రాష్ట్ర పోలీసు శాఖల నుండి సత్వర అనుమతులు; నియామక ఏజెంట్ లు చూపవలసిన బ్యాంకు పూచీ మొత్తం రూ.20 లక్షల నుండి రూ.50 లక్షలకు పెంపు.. వంటివి ఈ దిశగా తీసుకున్న కొన్ని చర్యలు. వలస వెళ్లే భారతీయ కార్మికులు మరింత మెరుగైన ఆర్థిక అవకాశాలు పొందగల భరోసా ఇచ్చేందుకు వీలుగా త్వరలోనే నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం ప్రారంభించబోతున్నాం. ఈ మేరకు విదేశాలలో ఉపాధి కోరుకొనే భారత యువత లక్ష్యంగా ప్రవాసీ కౌశల్ వికాస్ యోజన (పికెవివై)కు శ్రీకారం చుట్టుకోనుంది.
మిత్రులారా, జన్మభూమితో లోతైన భావోద్వేగపూరిత బంధం గల గిర్మితియా దేశాలలో నివసించే ప్రవాస భారతీయులతో మాకు ప్రత్యేక అనుబంధం ఉంది. నాలుగైదు తరాలకు పూర్వం ఈ దేశాలకు వలస వెళ్లిన భారతీయ మూలాలు గల వ్యక్తులు ‘‘విదేశీ పౌరసత్వం గల భారతీయుడు’’(ఒసిఐ)గా గుర్తింపు కార్డు పొందడంలో ఎన్ని బాధలు పడుతున్నదీ మాకు తెలుసు. వారి ఆవేదనను మేం గుర్తించి, ఈ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నాం. ఈ దిశగా మారిషస్‌తో నాంది పలుకుతున్నామని సహర్షంగా ప్రకటిస్తున్నాను. ఈ మేరకు అక్కడి గిర్మితియాల వారసులను ఒసిఐ కార్డులకు అర్హులుగా పరిగణించేందుకు అవసరమైన కొత్త తరహా పత్రాలను, కొత్త విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నాం. అలాగే ఫిజి, రీయూనియన్ దీవులు, సురినామ్, గయానా తదితర కరీబియన్ దేశాలలోని భారత మూలాలున్నవారి వెతలు తీర్చేందుకు కట్టుబడి ఉన్నాం.
నిరుటి ప్రవాసీ భారతీయ దివస్ సందర్భంగా విజ్ఞప్తి చేసిన తరహాలోనే ప్రస్తుతం పిఐఒ కార్డులున్నవారంతా ఒసిఐ కార్డును పొందాలని మరోసారి ప్రోత్సహిస్తున్నాను. ‘‘మీరంతా తీరికన్నదే లేకుండా ఉంటారని నాకు తెలుసు.. కాబట్టే- (मुझे पता है, कि आप काफी व्यस्त रहते है. इसी को देखते हुए) 2016 డిసెంబరు 31తో ముగిసిన కార్డుల మార్పిడి గడువును 2017 జూన్ వరకు ఎటువంటి అపరాధ రుసుము లేకుండా పొడిగించామని చెప్పడానికి సంతోషిస్తున్నాను.’’ ఆ మేరకు ఒసిఐ కార్డుదారుల కోసం ఈ ఏడాది జనవరి 1 నుండే ఢిల్లీ, బెంగళూరు విమానాశ్రయాలలో వలస వ్యవహారాలు చూసే కేంద్రాల వద్ద ప్రత్యేక కౌంటర్లు కూడా ఏర్పాటు చేశాం.
మిత్రులారా, ఇవాళ సుమారు 7 లక్షల మంది భారత విద్యార్థులు విదేశాలలో వివిధ ఉన్నత విద్యలు అభ్యసిస్తున్నారు. ‘‘నాకు బాగా తెలుసు. విదేశాల్లో ఉంటున్న ప్రతి భారతీయుడు- మాతృదేశ ప్రగతిలో పాలుపంచుకోవాలని ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. వారి విజ్ఞానం, భారతీయ జ్ఞానంతో సమ్మిళతమైతే భారత ఆర్థిక ప్రగతిని సమున్నత శిఖరాలకు తీసుకుతుంది. భారత ప్రగతి చరిత్రలో ప్రత్యేకించి శాస్త్ర, సాంకేతిక రంగాలకు సంబంధించి సమర్థులు, సఫలురైన ప్రవాసులు ప్రతి ఒక్కరికీ స్థానం దక్కాలని నేను సదా విశ్వసించటానికే ప్రయత్నిస్తాను.ఇందుకోసం మేం అనేక చర్యలు కూడా తీసుకున్నాం.’’ (मुझे भली भाति ज्ञात है/ कि विदेश मे रह रहा हर भारतीय,,भारत की प्रगति से जुड़ने के लिए आतुर है | उनका विज्ञान और भारत के ज्ञान का मिलन. भारत को आर्थिक प्रगति को असीम उचाईयो पर ले जायेगा | मेरा सदैव यह प्रयास और विश्वास रहा है कि सक्षम तथा successful प्रवासियो को/ भारत की विकास गाथा से जुड़ने का सम्पूर्ण मौका मिलना चाहिए | खास तौर से विज्ञान तथा तकनीकी क्षेत्रो मे |इसके लिए हमने कई कदम उठाये है. )
ఇందులో భాగంగా బోధన, పరిశోధనలలో నిమగ్నులైన అధ్యాపకులతో ‘‘సంయుక్త సందర్శక-పరిశోధక అధ్యాపక బృందం’’ (Visiting Adjunct Joint Research Faculty-VAJRA) ‘వజ్ర’ పేరిట శాస్త్ర-సాంకేతిక మంత్రిత్వశాఖ ఒక పథకాన్ని ప్రారంభించనుంది. ఈ పథకం ద్వారా ప్రవాస భారతీయులు, విదేశీ శాస్త్రవేత్తలు భారతదేశంలో పరిశోధనకు, అభివృద్ధికి తోడ్పడే వీలుంటుంది. తదనుగుణంగా విదేశాలలోని భారతీయులు భారతదేశంలోని ఏదైనా సంస్థలో ఒకటి నుండి మూడు నెలల పాటు.. అందునా మంచి సయోధ్యతో పనిచేయవచ్చు. అయితే, అన్నిటి కన్నా ముఖ్యమైన అంశమేమిటంటే.. దీని ద్వారా దేశ ప్రగతిలో ప్రవాస భారతీయులు వాస్తవ భాగస్వాములు కాగలుగుతారు.
మిత్రులారా, భారత్-ప్రవాస భారతీయుల మధ్య అనుబంధం సుస్థిరమైందేగాక ఉభయ పక్షాలనూ సుసంపన్నం చేసేదిగా ఉండాలన్నది నా దృఢ విశ్వాసం. ఈ లక్ష్యాన్ని అందుకునే దిశగా నిరుడు అక్టోబరులో మహత్మ గాంధీ జయంతి నాడు న్యూ ఢిల్లీలో ప్రవాస భారతీయ కేంద్రాన్ని ప్రారంభించే గౌరవం నాకు దక్కింది. విదేశాలలోని భారతీయ సమాజానికే ఈ కేంద్రం అంకితం. ఇది ప్రవాస భారతీయుల విశ్వ వలసలకు, అనుభవాలకు, ఘర్షణలకు, విజయాలకు, ఆకాంక్షలకు ఒక ప్రతీకగా రూపుదిద్దుకోవాలని మేం అభిలషిస్తున్నాం. ప్రవాస భారతీయులతో ప్రభుత్వ సంబంధాలను పునర్నిర్వచించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిని సాకారం చేసే మరో ముఖ్యమైన వేదికగా ఈ కేంద్రం నిలుస్తుందన్న నమ్మకం నాకుంది.
మిత్రులారా, మన ప్రవాసులలో చాలామంది కొన్ని తరాలుగా విదేశాల్లో ఉన్నారు. ప్రతి తరంవారి అనుభవం భారత్‌ను మరింత బలోపేతం చేస్తూ వచ్చింది. నవ్యాంకురాల మీద మన హృదయాంతరాళం నుంచి ప్రేమ పొంగుకొచ్చే రీతిలోనే విదేశాల్లోని యువ ప్రవాసులు… ప్రత్యేకించి నవతరం ప్రతినిధులు మాతృదేశంలో మరింత సన్నిహిత, బలమైన బంధం కోసం తపిస్తున్నారు. ఇలాంటి భారత సంతతి యువత తమ మాతృదేశాన్ని సందర్శించేందుకు, భారతీయ మూలలు, సంస్కృతి, వారసత్వంతో మమేకం అయ్యేందుకు అవకాశం కల్పించాలని ప్రభుత్వం భావించింది. ఆ దిశగా ‘‘భారతదేశాన్ని తెలుసుకోండి’’ పేరిట ప్రారంభించిన కార్యక్రమాన్ని ప్రభుత్వం విస్తరించింది. (हमारे प्रवासी भारतीय कई पीढ़ीयो से विदेशो में है. हर पीढ़ी के अनुभव ने भारत को और सक्षम बनाया है. जैसे नए पौधों पर हमारे भीतर अलग से एक स्नेह उभर आता है, उसी तरह विदेश में रह युवा प्रवासी भारतीय भी हमारे लिए विशेष हैं।हम प्रवासी भारतीयों की युवा पीढ़ीयो से, young Pravasis से करीबी और मज़बूत संपर्क रखना चाहेगे. ) దీనికింద తొలిసారిగా ఆరు యువ ప్రవాస భారతీయ బృందాలు ఈ ఏడాది భారత్‌ను సందర్శించనున్నాయి.
ఈ యువ ప్రవాసులలో 160 మంది ఇవాళ ఇక్కడ ప్రవాస భారతీయ దినోత్సవంలో పాల్గొంటున్నారని తెలిసి నేనెంతో సంతోషిస్తున్నాను. యువ ప్రవాసులకు ప్రత్యేకంగా స్వాగతం పలుకుతున్నాను- మీరుంటున్న దేశాలకు తిరిగి వెళ్లిన తరువాత కూడా మీరంతా మాతో సంధానమై ఉంటారనే ఆశిస్తున్నాను. మీరెక్కడున్నా భారతదేశాన్ని మరో సారి సందర్శించండి. నిరుడు యువ ప్రవాస భారతీయుల కోసం ‘‘భారత్ కో జానో’’ (భారత్‌ను తెలుసుకోండి) పేరిట నిర్వహించిన తొలి ప్రశ్నావళి కార్యక్రమంలో 5000 మందికిపైగా ప్రవాస భారతీయులు, భారత సంతతివారు పాలుపంచుకొన్నారు. ఈసారి రెండో సంచికలో కనీసం 50వేల మంది యువ ప్రవాసులు పాలుపంచుకోవడం చూడాలని నేను ఆశిస్తున్నాను.
మిత్రులారా, నేడు భారతదేశం నవ్య ప్రగతిపథంలో పరుగు తీస్తున్నది. ఈ పరుగు కేవలం ఆర్థికపరమైనదేగాక సామాజిక, రాజకీయార్థిక పరమైనది. ప్రవాసులు, భారత సంతతి ప్రజల కోసం వివిధ రంగాలలో విదేశీ పెట్టుబడులపై పరిమితులు, ఆంక్షలను గణనీయంగా సడలించాం. (आज भारत एक नयी प्रगतिशील दिशा की और अग्रसर है | ऐसी प्रगति जो न केवल आर्थिक है अपितु सामाजिक, राजनैतिक, और शासिकिय है.आर्थिक क्षेत्र में, PIOs तथा NRIs के लिए FDI norms पूरी तरह से liberalized है.) భారత సంతతివారు, వారి కంపెనీలు, ట్రస్టులు, భాగస్వామ్య సంస్థలు తిరిగి తరలించని విధానంలో పెట్టే పెట్టుబడులను స్థానిక భారతీయులు పెట్టే పెట్టుబడుల తరహాలోనే పరిగణిస్తాం. మేం ప్రవేశపెట్టిన అటువంటి అనేక కార్యక్రమాలలో స్వచ్ఛ భారత్ మిషన్, డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా ల వంటివి కొన్ని. వీటి ద్వారా భారతదేశంలోని సామాన్యుల అభివృద్ధిలో ప్రవాస భారతీయులు పాలుపంచుకోవచ్చు.
మీలో కొందరు స్వదేశంలో పెట్టుబడులు, వ్యాపారాలలో భాగస్వాములు కావాలని భావిస్తూండవచ్చు. నమామి గంగే, స్వచ్ఛ భారత్ వంటి కార్యక్రమాలకు తమవంతు తోడ్పడటంద్వారా ఇతరులు కూడా మరింతగా సాయం అందించేందుకు ముందుకొస్తారు. మరికొందరు తమ విలువైన సమయాన్ని కేటాయించి, భారత్ ముందడుగు వేయడంలో స్వచ్ఛంద చేయూతనివ్వవచ్చు. లేదంటే వివిధ రంగాలలో అణగారిన వర్గాల సామర్థ్య నిర్మాణానికి సహాయపడేలా ఉత్తేజితులు కావచ్చు.
ప్రవాస భారతీయ సమాజంతో భారత భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో మీ కృషిని ఆహ్వానిస్తున్నాం. ప్రవాసీ భారతీయ దివస్ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనను తిలకించాల్సిందిగానూ మిమ్మల్ని కోరుతున్నాను. తద్వారా మేం అమలు చేస్తున్న ప్రతిష్టాత్మక కార్యక్రమాలపై మీకు అవగాహన కలగడంతో పాటు వాటిలో మీరెలా భాగస్వాములు కాగలరో కూడా తెలుస్తుంది.
మిత్రులారా,
నల్లధనానికి వ్యతిరేకంగా మేం ఒక ప్రయత్నాన్ని ప్రారంభించాం. నల్లధనం మన రాజకీయాలను, దేశాన్ని మరియు సమాజాన్ని చెదపట్టినట్టు పట్టి గుల్ల చేసేస్తోంది. నల్లధనం యొక్క రాజకీయ పూజారులు కొందరు మా కృషిని ప్రజా వ్యతిరేకమైందిగా మన రాజకీయ ప్రవక్తలు ప్రవచిస్తున్నారు. నల్లధనాన్ని అంతమొందించడానికి భారత ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలకు ప్రవాస భారతీయులు మద్దతివ్వడాన్ని నేను అభినందిస్తున్నాను. (हमने काले धन के विरुद्ध एक बीड़ा उठाया है. काला धन हमारी राजनीति, देश तथा समाज तथा शासन को धीरे धीरे खोखला कर रहा है. काले धन के कुछ राजनैतिक पुजारी हमारे प्रयासों को जन विरोधी बताते है. काले धन को समाप्त करने में भारत सरकार की नीतियों का जो समर्थन प्रवासी भारतीयों ने किया है उसके लिए मैं उनका अभिनन्दन करता हूँ.)
మిత్రులారా, చివరగా భారతీయులుగా మనది ఉమ్మడి వారసత్వం, మనందరినీ ఐకమత్యంతో నిలుపుతున్నది అదేనని చెప్పదలచుకున్నా. మనం ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినప్పటికీ కూడా, మన మధ్య గల ఆ బంధమే మనల్ని బలవంతులను చేస్తోంది.
ధన్యవాదాలు.. జయ్ హింద్.
PM begins address, condoles death of Mario Soares, architect of the re-establishment of diplomatic relations btw India and Portugal #PBD2017 pic.twitter.com/IpMGiULJEh
— Vikas Swarup (@MEAIndia) January 8, 2017
It is a great pleasure for me to welcome all of you on this 14th Pravasi Bharatiya Diwas: PM @narendramodi #PBD2017 @PBDConvention
— PMO India (@PMOIndia) January 8, 2017
Indians abroad are valued not just for their strength in numbers. They are respected for the contributions they make: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 8, 2017
The Indian diaspora represents the best of Indian culture, ethos and values: PM @narendramodi #PBD2017 @PBDConvention
— PMO India (@PMOIndia) January 8, 2017
Engagement with the overseas Indian community has been a key area of priority: PM @narendramodi @PBDConvention #PBD2017
— PMO India (@PMOIndia) January 8, 2017
Remittance of close to sixty nine billion dollars annually by overseas Indians makes an invaluable contribution to the Indian economy: PM
— PMO India (@PMOIndia) January 8, 2017
NRIs and PIOs have made outstanding contributions to their chosen fields: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 8, 2017
The welfare and safety of all Indians abroad is our top priority: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 8, 2017
The security of Indian nationals abroad is of utmost importance to us: PM @narendramodi @PBDConvention #PBD2017
— PMO India (@PMOIndia) January 8, 2017
EAM @SushmaSwaraj has particularly been proactive and prompt in reaching out to distressed Indians abroad using social media: PM at #PBD2017
— PMO India (@PMOIndia) January 8, 2017
For those workers who seek economic opportunities abroad, our effort is to provide maximum facilitation and ensure least inconvenience: PM
— PMO India (@PMOIndia) January 8, 2017
I would again encourage all PIO Card holders to convert their PIO Cards to OCI Cards: PM @narendramodi @PBDConvention #PBD2017
— PMO India (@PMOIndia) January 8, 2017
PM: We will shortly launch a skill devt program - the Pravasi Kaushal Vikas Yojana - targeted at Indian youth seeking overseas employment pic.twitter.com/4VJbL4CWE2
— Vikas Swarup (@MEAIndia) January 8, 2017
PM: Starting w/ Mauritius, we are working to put in place procedures so that descendants of Girmitiyas could become eligible for OCI Cards pic.twitter.com/wGng9BjFj9
— Vikas Swarup (@MEAIndia) January 8, 2017
PM: We remain committed to addressing similar difficulties of PIOs in Fiji, Reunion Islands, Suriname, Guyana and other Caribbean States. pic.twitter.com/KTd9yYKQEv
— Vikas Swarup (@MEAIndia) January 8, 2017
We welcome all your efforts that seek to strengthen India’s partnership with the overseas Indian community: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 8, 2017
PM: We have extended the deadline for PIO card conversions to OCI from 31 December 2016, until June 30, 2017 without any penalty.
— Vikas Swarup (@MEAIndia) January 8, 2017
PM: From1st of January this year, beginning with Delhi & Bengaluru, we have set up special counters at immig'n points for OCI cardholders
— Vikas Swarup (@MEAIndia) January 8, 2017
PM speaks of how overseas Indians in the scientific field can share their knowledge and expertise through programmes like VAJRA schemes pic.twitter.com/slIa8rnZcF
— Vikas Swarup (@MEAIndia) January 8, 2017
PM on the Pravasi Bharatiya Kendra: We want it to become a symbol of global migration, achievements & aspirations of the Diaspora.
— Vikas Swarup (@MEAIndia) January 8, 2017
PM: A special welcome to the young Pravasis – I hope that on returning to your respective countries, you will remain connected with us pic.twitter.com/QeESshH9qm
— Vikas Swarup (@MEAIndia) January 8, 2017
PM concludes: Whether knowledge, time or money, we welcome your contribut'ns that strengthen India’s partnership w/ overseas community pic.twitter.com/eibfXZYbZD
— Vikas Swarup (@MEAIndia) January 8, 2017