లోక్ సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సమాధానమిస్తూ, ప్రధాని మోదీ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్తో భారతదేశం యొక్క గ్రామాలను అనుసంధానం చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం మిషన్ మోడ్ లో పని చేస్తుందని వ్యాఖ్యానించారు. “2011 నుండి 2104 వరకు నేషనల్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ కింద, కేవలం 59 గ్రామాలు లబ్ధిపొందాయి కానీ వాటికి కూడా కొన్ని ప్రాంతాలు అనుసంధానమవ్వలేదు. సేకరణ కూడా పూర్తిగా కేంద్రీకృతమై ఉంది. కాని 2014లో మేము ప్రభుత్వం ఏర్పరచిన తరువాత పరిస్థితులు మారాయి. మేము సేకరణను వికేంద్రీకరించాము. అందుకే ఇప్పుడు డెబై ఆరు వేల గ్రామాలలో ఆకరి మైలు వరకు ఆప్టికల్ ఫైబర్ అనుసంధానత కలిగివున్నాయి" అని శ్రీ మోదీ అన్నారు.