Eight-member delegation of British Parliamentarians meets PM Modi
The relations between India and UK have strong bipartisan support in both countries: PM
India and UK are natural partners in the global fight against terrorism: PM

8 మంది సభ్యులతో కూడిన బ్రిటీష్ పార్లమెంటేరియన్ ల ప్రతినిధి వర్గం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీతో ఈ రోజు భేటీ అయింది.

భారత దేశం మరియు యుకె మధ్య సంబంధాలు బలమైన ద్వైపాక్షిక మద్ధతుతో కూడుకుని ఉన్నాయని, రెండు దేశాలకు చెందిన పార్లమెంట్ సభ్యుల మధ్య ముఖాముఖి సంభాషణలు పెంపొందాలని ఈ సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ మోదీ పిలుపునిచ్చారు.

2015 నవంబర్ లో తాను యుకె లో పర్యటించిన సంగతిని, అలాగే 2016 నవంబర్ లో ప్రధాని థెరిసా మే భారతదేశంలో పర్యటించడాన్ని ప్రధాన మంత్రి ఎంతో మక్కువతో గుర్తుకు తెచ్చుకున్నారు. 2017 సంవత్సరాన్ని భారతదేశం-యుకె సంస్కృతి సంవత్సరంగా జరుపుకోవడాన్ని ప్రధాన మంత్రి స్వాగతించారు.

ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రపంచవ్యాప్త యుద్ధంలో భారతదేశం మరియు యుకె సహజ భాగస్వాములని ప్రధాన మంత్రి అన్నారు. ఉగ్రవాదం, తీవ్రవాదం మరియు విప్లవవాదాలపై పార్లమెంటు సభ్యులు ఉమ్మడిగా గళమెత్తాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు.