The close association between our two countries is, of course, much older. India and Kenya fought together against colonialism: PM
Common belief in democratic values, our shared developmental priorities & the warm currents of Indian Ocean bind our societies: PM
Kenya's participation in Vibrant Gujarat has generated a strong interest in Indian businesses: PM Modi
India would be happy to share best practises in organic farming with Kenyan farmers: PM
The large Indian-origin community of Kenya is a vital and energetic link between us: PM Modi

శ్రేష్ఠుడైన అధ్యక్షుల వారు శ్రీ ఉహురు కెన్య‌ట్టా,
ప్రసిద్ధ ప్ర‌తినిధులారా,
ప్రసార మాధ్యమాల ప్ర‌తినిధులారా,
మిత్రులారా,

స‌రిగ్గా ఆరు నెల‌ల క్రితం కెన్యా ను సంద‌ర్శించ‌డం నాకు ఆనందం క‌లిగించింది. అధ్య‌క్షుల వారు శ్రీ కెన్య‌ట్టా, కెన్యా ప్ర‌జ‌లు, నాకు హృద‌య‌పూర్వ‌క, ప్రేమ‌పూర్వ‌క‌ స్వాగ‌తం ప‌లికారు. భారతదేశానికి విచ్చేసిన అధ్య‌క్షుల వారు శ్రీ కెన్య‌ట్టాకు, ఆయన ప్ర‌తినిధి వ‌ర్గానికి ఈ రోజు స్వాగ‌తం ప‌ల‌క‌డం నాకు ఎంతో సంతోషాన్నిస్తోంది. రెండు దేశాల‌ మ‌ధ్య సంబంధ బాంధ‌వ్యాలు ఎంతో పాత‌వి. భారతదేశం, కెన్యా లు వ‌ల‌స పాల‌న‌పై పోరాటం చేసిన దేశాలు. భార‌త సంత‌తికి చెందిన కార్మిక నాయ‌కుడు శ్రీ మాఖ‌న్ సింగ్‌, కెన్యాలో వ‌ల‌స‌ పాల‌న‌ను కూల‌దోసేందుకు కెన్యా సోద‌రుల‌తో చేతులు క‌లిపి సాగించిన పోరాట‌ పాత్ర‌కు అధ్యక్షుల వారు శ్రీ కెన్య‌ట్టా గ‌త నెల‌లోనే త‌గిన గుర్తింపునిచ్చారు. ప్ర‌జాస్వామిక ఉమ్మ‌డి విశ్వాసాలు, మ‌న ఉమ్మ‌డి అభివృద్ధి ప్రాధాన్యంర, హిందూ మ‌హా స‌ముద్ర‌పు నులివెచ్చ‌ని కెర‌టాలు మ‌న స‌మాజాల‌ను క‌లిపి ఉంచుతాయి.

మిత్రులారా,

మ‌న సంబంధాల‌ను ఈ రోజు చ‌ర్చ‌ల‌లో అధ్యక్షుల వారు శ్రీ కెన్య‌ట్టా, నేను పూర్తి స్థాయిలో స‌మీక్షించాం. గ‌త ఏడాది నేను కెన్యా లో ప‌ర్య‌టించిన‌పుడు ఆర్థిక స‌హ‌కారాన్ని మ‌రింత బ‌లోపేతం చేసుకోవ‌డం మ‌న కృషిలో ఒక ప్రాధాన్య‌ అంశంగా ఉండాల‌ని గుర్తించాం. ఈ నేప‌థ్యంలో ద్వైపాక్షిక వాణిజ్య విస్త‌ర‌ణ‌, రెండు ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల మ‌ధ్య మ‌రింత‌గా పెట్టుబ‌డుల ప్ర‌వాహం, బ‌ల‌మైన ఆర్థిక అభివృద్ధి భాగ‌స్వామ్యం అనేవి ప్రాధాన్య‌ అంశాలు. నిన్న అధ్యక్షుల వారు శ్రీ కెన్య‌ట్టా, ఎనిమిదో వైబ్రంట్ గుజ‌రాత్ గ్లోబల్ సమిట్ కు హాజ‌రై బ‌ల‌మైన‌, ఉన్న‌త‌ స్థాయి ప్ర‌తినిధి వ‌ర్గానికి నాయ‌క‌త్వం వ‌హించారు. వైబ్రంట్ గుజ‌రాత్ స‌ద‌స్సులో మీరు పాల్గొన‌డం ద్వారా, కెన్యాతో పెట్టుబ‌డి అవ‌కాశాల‌ను మ‌రింతగా అనుసంధానించ‌డానికి భార‌త వ్యాపారంపై మీ బ‌ల‌మైన ఆస‌క్తిని వ్య‌క్తం చేసింది. ఇంధ‌నం, స‌ముద్ర ఆర్థిక వ్య‌వ‌స్థ‌, వ్య‌వ‌సాయం, స‌మాచార సాంకేతిక విజ్ఞానం, ప‌ర్యాట‌క‌, ఆరోగ్య సంర‌క్ష‌ణ రంగాల‌లో అవ‌కాశాల‌ను స‌ద్వినియోగం చేసుకోవ‌డంలో రెండు దేశాలూ నాయ‌క‌త్వం వ‌హించేటట్లు వ్యాపార‌ వర్గాలను, ప‌రిశ్ర‌మ వ‌ర్గాల‌ను ప్రోత్స‌హించాల‌ని కోరుకుంటున్నాం. ఆ వర్గాలను ప్రోత్స‌హిస్తాం కూడా. రేపు జ‌రిగే సంయుక్త వ్యాపార మండ‌లి స‌మావేశం, ఈ రంగాల‌లో కొన్ని ప్ర‌త్యేక ప్రాజెక్టుల ద్వారా వాణిజ్య‌ప‌ర‌మైన అవ‌కాశాల‌ను ప‌రిశీలిస్తాం. వాణిజ్యాన్ని మ‌రింత పెంచ‌డానికి ప్ర‌మాణీక‌ర‌ణ సంబంధిత అంశాల‌తో స‌హా ట్రేడ్ ఫెసిలిటేష‌న్ చ‌ర్య‌ల విష‌యంలో మేం కూడా స‌హ‌క‌రిస్తున్నాం. వ్య‌వ‌సాయం, ఆహార భ‌ద్ర‌త‌పై మ‌రింత విస్తృత ప్రాతిప‌దిక‌న వివిధ స్థాయిల‌లో స‌హ‌కారం మా ఉమ్మ‌డి ప్రాధాన్యంా. కెన్యాలో వ్య‌వ‌సాయ ఉత్పాద‌క‌తను పెంచేందుకు మేం చేతులు క‌లుపుతున్నాం. వ్యవసాయ యాంత్రీకరణ కోసం ఈ రోజు సంతకాలు జరిగిన 100 మిలియన్ డాలర్ల ద లైన్ ఆఫ్ క్రెడిట్ ఒప్పందం ఒక కొత్త అనుబంధానికి తలుపు తెరుస్తుంది. కాయధాన్యాల ఉత్పత్తికి మరియు దిగుమతికి కెన్యాతో దీర్ఘకాలిక ఒప్పందానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తూ దీనిపై చర్చిస్తున్నాం. కెన్యా వ్యవసాయదారులతో సేంద్రియ వ్యవసాయంలో ఉత్తమ పద్ధతులను పంచుకోవడం మాకు సంతోషంగానే ఉంటుంది. ఆరోగ్య రంగానికి వస్తే, కేన్సర్ చికిత్స కోసం భాభాట్రాన్ యంత్రాన్ని కెన్యాట్టా నేషనల్ హాస్పిటల్ కు అందజేయడం జరిగింది. మన ఇండియా ఆఫ్రికా ఫోరమ్ సమిట్ కార్యక్రమంలో భాగంగా కెన్యా కు చెందిన వైద్యుల నైపుణ్యాన్ని పెంపొందించేందుకు చొరవ తీసుకొంటున్నాం. విద్య రంగంలో భాగస్వామ్యం మన ప్రజల మధ్య కొత్త సంబంధాలను ఏర్పరుస్తోంది. యూనివర్సిటీ ఆఫ్ నైరోబీ తో మనం బలమైన అనుబంధాన్ని కలిగివున్నాం. అక్క ఐసిసిఆర్ ఒక చైర్ ఫర్ ఇండియన్ స్టడీస్ ను నెలకొల్పింది. ఆ విశ్వవిద్యాలయ గ్రంథాలయ పునర్ నవీకరణ ను కూడా భారత సహాయంతో చేపడుతున్నారు. శక్తి రంగం విషయానికి వస్తే, ఇంటర్ నేషనల్ సోలార్ అలయెన్స్ కు కెన్యా అందించిన మద్దతును, అలాగే, మన ఆర్థిక పురోగతి కోసమని సౌర శక్తిని వినియోగించుకొనేందుకు మన సంయుక్త కృషిని మేం గౌరవిస్తున్నాం.

మిత్రులారా,

స‌ముద్ర ర‌వాణా రంగంలో స‌వాళ్లు ఇరు దేశాల‌కూ కీల‌క‌మైన‌వి. అయితే మ‌నం బ్లూ ఎకాన‌మీలో అవ‌కాశాల‌ను అందిపుచ్చుకోవ‌ల‌సి ఉంది. మ‌న ర‌క్ష‌ణ‌ రంగ స‌హ‌కారం త్వ‌రిత‌గ‌తిన కార్య‌రూపం దాల్చేందుకు దృష్టి పెడుతున్నాం.హైడ్రోగ్ర‌ఫి, క‌మ్యూనికేష‌న్స్ నెట్ వ‌ర్క్‌లు, పైర‌సీని రూపుమాపడం, సామ‌ర్ధ్యాల పెంపు, ప‌ర‌స్ప‌ర మార్పిడి, ర‌క్ష‌ణ, వైద్య స‌హ‌కారం వంటివి మ‌న ప్ర‌త్యేక ప్రాధాన్య‌ అంశాలు. మ‌న భ‌ద్ర‌తా స‌హ‌కారం, సామ‌ర్ధ్యాల‌ను బ‌లోపేతం చేసుకునే విష‌యంలో భాగ‌స్వాములమవుతున్నాం. ఇందుకు సంబంధించి వీలైనంత త్వ‌ర‌గా సంయుక్త కార్యాచ‌ర‌ణ బృందం స‌మావేశం కావాల‌ని సూచించాం. ఇది సైబ‌ర్ సెక్యూరిటీ, ఉగ్ర‌వాదాన్ని ఎదుర్కోవ‌డం, మాద‌క ద్ర‌వ్యాల అక్ర‌మ‌ర‌వాణా, మాన‌వ అక్ర‌మ ర‌వాణా, మ‌నీ లాండ‌రింగ్ వంటి వాటిపై దృష్టి పెడుతుంది.

మిత్రులారా,

కెన్యాలో పెద్ద సంఖ్య‌లో ఉన్న భార‌తీయ సంత‌తి ప్ర‌జ‌లు ఉభ‌య దేశాల మ‌ధ్య కీల‌క‌మైన‌, శ‌క్తిమంత‌మైన బంధంగా నిలుస్తున్నారు. ఉభ‌య దేశాల మ‌ధ్య వాణిజ్యం, పెట్టుబ‌డులు, క‌ల్చ‌ర‌ల్ ఎక్స్చేంజ్‌లో వీరిని భాగ‌స్వాముల‌ను చేయ‌డం గురించి అధ్యక్షుల వారు శ్రీ కెన్య‌ట్టాతో నేను చ‌ర్చించాను. మా నిర్ణ‌యాల అమ‌లు తీరును వ్య‌క్తిగ‌తంగా, నిశితంగా ప‌ర్య‌వేక్షించాల‌ని గ‌త ఏడాది జ‌రిగిన మా స‌మావేశంలో మేం నిర్ణ‌యించాం. దీనిని మ‌రింత ప‌ట్టుద‌ల‌తో కొన‌సాగించ‌వ‌ల‌సి ఉంది.

శ్రేష్ఠుడైన అధ్యక్షుల వారూ,

మా ఆహ్వానాన్ని మ‌న్నించి, గౌర‌వించి మీరు గుజ‌రాత్‌కు, ఢిల్లీకి వ‌చ్చినందుకు భార‌త‌దేశ ప్ర‌జ‌ల త‌ర‌ఫున, అలాగే నా తరఫున కూడా మ‌రోసారి మీకు నేను ధ‌న్య‌వాదాలు పలుకుతున్నాను.

థాంక్యూ.

థాంక్యూ వెరీ మ‌చ్‌.