ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు కన్యకుమారి లోని వివేకానంద కేంద్రంలో రామాయణ దర్శనం ఎగ్జిబిషన్ ప్రారంభ కార్యక్రమాన్ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు.

స్వామి వివేకానంద జన్మదినమైన జనవరి 12వ తేదీ సాధారణమైన రోజు కాదని, స్వామి వివేకానంద శక్తిమంతమైన ఆలోచనలు ఎందరి మస్తిష్కాలనో తీర్చిదిద్దడాన్ని కొనసాగిస్తూ వస్తున్నాయని ప్రధాన మంత్రి అన్నారు. భారతదేశం ఇవాళ యువ దేశంగా ఉన్నదని, ఈ దేశం ఆధ్యాత్మికంగాను, భౌతికంగాను పురోగమించవలసివుందని ప్రధాన మంత్రి చెప్పారు. స్వామి వివేకానంద ఆలోచనలు దేశ నిర్మాణం దిశగా యువతలో ఎల్లప్పటికీ ప్రేరణను రగిలిస్తూనే ఉంటాయని ఆయన అన్నారు.

రుషి శ్రీ తిరువళ్లువర్ కు, శ్రీ ఏక్ నాథ్ రానడే కు సైతం ప్రధాన మంత్రి శ్రద్ధాంజలి ఘటించారు. నేర్చుకొనే ప్రక్రియ ఎన్నటికీ ఆగకుండా చూసుకోవాలని యువతకు ప్రధాన మంత్రి పిలుపునిచ్చారు.