Group of Secretaries present ideas for transformative change in different areas of governance
Secretaries to GoI present ideas on science and technology, energy and environment to PM Modi

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సమక్షంలో భారతదేశ ప్రభుత్వ కార్యదర్శుల బృందాలు మూడు పరిపాలన, శాస్త్ర విజ్ఞానం & సాంకేతిక విజ్ఞానం, మరియు శక్తి & పర్యావరణం లపై తమ తమ ఆలోచనలను ఈ రోజు నివేదించాయి.

“పరిపాలన”కు సంబంధించిన సమర్పణలో ప్రధానంగా పౌరులకు అందించవలసిన సేవలు, అందరినీ డిజిటల్ సేవల పరిధిలోకి తీసుకురావడం, నవకల్పనతో పాటు చట్టాలను సులభతరం చేయడం వంటి విషయాలు చోటుచేసుకొన్నాయి.

“శాస్త్ర విజ్ఞానం & సాంకేతిక విజ్ఞానం” సంబంధ సమర్పణలో జ్ఞానాన్నిఅందరి అందుబాటులోకి తీసుకురావడం తో పాటు మెరుగైన అవకాశాలను కల్పించడం, ఉద్యోగాలు మరియు స్టార్ట్- అప్ లు, ఇంకా శాస్త్ర విజ్ఞాన రంగంలో సులభంగా ముందడుగు వేయడం వంటి అంశాలపై శ్రద్ధ తీసుకోవడం జరిగింది.

ఇక “శక్తి & పర్యావరణం” సంబంధ సమర్పణలో వివిధ శక్తి వనరులు మరియు శక్తిని పొదుపుగా వినియోగించడం తాలూకు సలహాలు ప్రముఖంగా చోటు చేసుకొన్నాయి.

ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు, నీతి ఆయోగ్ కు చెందిన అధికారులు కూడా పాల్గొన్నారు.

ప్రస్తుత పరంపరలో మొత్తం తొమ్మిది కార్యదర్శుల బృందాలు పాలనకు సంబంధించిన వేరు వేరు అంశాలపై తమ తమ సమర్పణలను నివేదించవలసి ఉండగా, ఇంతవరకు నాలుగు సమర్పణలను నివేదించడమైంది.