లఖింపూర్ బహిరంగ సభలో ప్రసంగిస్తూ, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలలో సాధించిన ప్రగతిని గురించి ప్రజలకు తెలపాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఎన్నికల గురించే, నిర్మాణ పనులు అసంపూర్తిగా ఉండగానే లక్నో మెట్రో ను యుపి ప్రభుత్వం ప్రారంభించిందని ప్రధాని ఆరోపించారు. “ ఎన్నికలు రావడం చూసే నిర్మాణ పనులు అసంపూర్తిగా ఉండగానే లక్నో మెట్రో ను యుపి ప్రభుత్వం ప్రారంభించింది! నేను అఖిలేష్ జీ ని లక్నో రావాలని ఆహ్వానిస్తున్నాను, నేను కూడా వస్తాను ఇరువురం కలిసి మెట్రోలో ప్రయాణం చేద్దాం. రైళ్ళు నడవడంలేదు, స్టేషన్ లు పూర్తికాలేదు అయినా సరే మీరు ఆ ప్రాజెక్టును ప్రారంభించారు. “ అని ప్రధాని అన్నారు.
ఇంకా వైద్య సౌకర్యాలు ప్రారంభించని మరియు వైద్యులు అందుబాటులో లేని ఆసుపత్రిని ప్రారంభించిందని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై కూడా ఆయన ఆరోపణ చేశారు.