శ్రీ నరేంద్ర మోదీకి ఒకనాడు, అప్పటి ప్రధాన మంత్రి శ్రీ అటల్ బీహార్ వాజ్ పేయి  నుండి ఒక ఫోన్ కాల్ వచ్చే సమయానికి, మాధవరావు సింధియా దుర్మరణం చెందిన విమాన ప్రమాదంలో,  ఆయనతో పాటు మృతిచెందిన పాత్రికేయులలో ఒకడైన సీనియర్ కెమెరామన్ గోపాల్ బిష్ట్  యొక్క అంత్యక్రియల వద్ద ఉన్నారు.

 

"మీరు ఎక్కడ ఉన్నారు" అని అటల్ గారు అడిగారు.

 

"నేను అంత్యక్రియల కార్యక్రమంలో ఉన్నాను" అని శ్రీ మోదీ జవాబివ్వడంతో, “ఓహ్! అయితే మీరు అంత్యక్రియల కార్యక్రమంలో ఉన్నప్పుడు నేను మాట్లాడడం బాగోదు" అని అటల్ గారు అని, ఆ సాయంత్రం తన నివాసంలో శ్రీ మోడీని కలవమని చెప్పారు.

 

శ్రీ మోడీ, అటల్ గారిని కలిసినప్పుడు, "ఢిల్లీ నిన్ను చాలా బలవంతుడిని చేసింది! ఇక గుజరాత్ రాష్ట్రానికి తిరిగివెళ్ళాలి!" అని ప్రధానమంత్రి అన్నారు.

 

ఆ మాటలను సరిగ్గా అర్ధంచేసుకున్న శ్రీ మోదీ, ఆ నిర్ణయం పట్ల ఆశ్చర్యపోయారు. కనీసం ఎన్నడూ ఎమ్మెల్యేగా పనిచేయని ఆయనకు అంత పెద్ద బాధ్యతను పార్టీ అప్పగించినప్పుడూ, మరియు భారతదేశ ప్రధానమంత్రి అభ్యర్థించినప్పుడు, ఎవరు మాత్రం కాదనగలరు.

 

ఆయన అది గుర్తుచేసుకున్న శ్రీ మోదీ ఏమన్నారో, ఆయన మాటల్లోనే ఇలా, “నేను ఏళ్ల తరబడి గుజరాత్ కు రాలేదు. నా పార్టీ సహచరులను పిలిచి – మీరు పిలుస్తున్నారు, నేను వస్తాను కాని, నేను ఎక్కడకి వెళ్ళాలి, నాకు ఇల్లు కూడా లేదు. నేను చాల రోజులుగా గుజరాత్ కూడా రాలేదు. వారు సర్క్యూట్ హౌస్ లో ఒక గదిని బుక్ చేస్తామన్నారు కానీ నేను ఎమ్మెల్యేను కాదు కాబట్టి దాని పూర్తి మొత్తం నేనే చెల్లిస్తాను !”

 

అలా, గుజరాత్ ముఖ్యమంత్రిగా శ్రీ నరేంద్ర మోదీ ఇన్నింగ్స్ ప్రారంభమైంది. రాష్ట్రంలో సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా చేసిన మరియు నాలుగు సార్లు ప్రమాణస్వీకారం చేసిన రికార్డు సొంతం చేసుకున్నారు.